...
...
Next Story

Crime Thriller Documentary: రూ.200 కోట్ల స్కామ్.. జైలు నుంచే స్కెచ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

Crime Thriller Documentary: సుకేశ్ చంద్రశేఖర్ స్కామ్ తిరిగే 200 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు, మోసాల కథతో తెరకెక్కుతున్న 'లవ్ స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ' డాక్యుమెంటరీ డిసెంబర్ 18, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Nov 26, 2026, 15:16:35 IST
Advertisement

Crime Thriller Documentary: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డాక్యుమెంటరీ వస్తోంది. సంచలనం రేపిన సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల స్కామ్ పై రూపొందిన ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

లవ్ స్కామ్ ఔర్ ధోకా విశేషాలు

Crime Thriller Documentary: రూ.200 కోట్ల స్కామ్.. జైలు నుంచే స్కెచ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ
Crime Thriller Documentary: రూ.200 కోట్ల స్కామ్.. జైలు నుంచే స్కెచ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ

ఓటీటీ వేదిక & తేదీ: డిసెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.

నిర్మాణం: ఇండియా టుడే ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ.

రెండేళ్ల రీసెర్చ్: సుకేశ్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు తీహార్ జైలు నుంచి ఆపరేషన్లు ఎలా సాగాయనే అంశాలపై ఫోకస్.

మేకర్స్: 'కరీ & సైనైడ్', 'ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ' రూపొందించిన టీమ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్.

ఓటీటీలోకి 'లవ్ స్కామ్ ఔర్ ధోఖా'

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుకేశ్ చంద్రశేఖర్ కేసు చుట్టూ అల్లుకున్న మోసాలు, మాయాజాలం కథను డాక్యుమెంటరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది నెట్‌ఫ్లిక్స్. 'లవ్ స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ' పేరుతో రూపొందిన ఈ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీ డిసెంబర్ 18, 2026 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

బెంగళూరులో ఒక సాధారణ యువకుడిగా మొదలై, దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన వర్గాల్లోకి సుకేశ్ ఎలా చొచ్చుకెళ్లాడు అనే కోణంలో ఈ కథ సాగుతుంది. ఇండియా టుడే ఒరిజినల్స్ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది.

లవ్ స్కామ్ ఔర్ ధోఖా స్టోరీ, తెరవెనుక నిజాలు

సుకేశ్ నేపథ్యం ఏమిటి? తీహార్ జైలు లోపల నుంచే ఇంత పెద్ద స్థాయిలో కార్యకలాపాలు ఎలా కొనసాగించగలిగాడు? వ్యవస్థలోని లోపాలు దీనికి ఎలా దారితీశాయి? జనాలు అతని మాటలను ఎందుకు నమ్మారు? అనే ప్రశ్నలకు ఈ డాక్యుమెంటరీలో సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు.

ట్రూ-క్రైమ్ మేకర్స్ నుంచి మరో ప్రాజెక్ట్

నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఆసక్తి రేపిన 'కరీ & సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్', 'ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్' వంటి డాక్యుమెంటరీల రూపకర్తల నుంచి ఇది వస్తోంది.

చాందినీ అహ్లావత్ దాబాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా, మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహించారు. కరణ్ రాణా కో-డైరెక్టర్‌గా పనిచేశారు. మునీశ్ పాండే, షమ్స్ తాహిర్ ఖాన్ క్రైమ్ కన్సల్టెంట్స్‌గా ఉన్నారు.

ఇలాంటి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ లను ఇష్టపడే ప్రేక్షకులు డిసెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో దీనిని చూడొచ్చు.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks