OTT Malayalam: ఓటీటీలో మూడు మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలు.. అన్నీ తెలుగులో ఫ్రీగానే చూడొచ్చు.. కొత్త ఓటీటీ బంపర్ ఆఫర్

OTT Malayalam: ఓటీటీలో మూడు మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలు ఫ్రీగా అందుబాటులోకి వచ్చాయి. అది కూడా ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో కావడం విశేషం. థియేటర్ ప్లస్ అనే ఓటీటీ ఈ బంపర్ ఆఫర్ ను ప్రేక్షకులకు ఇవ్వడం విశేషం.

Published on: Sep 30, 2026, 17:29:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Malayalam: ఓటీటీ లవర్స్‌కి మైండ్ బ్లాకింగ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'థియేటర్ ప్లస్' (Theatre Plus) రెండు వారాల పాటు ఏకంగా మూడు మలయాళ సూపర్ హిట్ సినిమాలను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు, హిడెన్ ఛార్జీలు లేకుండా నేరుగా యాప్‌లో మూడు డిఫరెంట్ జానర్ల బ్లాక్‌బస్టర్లను బింజ్ వాచ్ చేయవచ్చు.

OTT Malayalam: ఓటీటీలో మూడు మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలు.. అన్నీ తెలుగులో ఫ్రీగానే చూడొచ్చు.. కొత్త ఓటీటీ బంపర్ ఆఫర్
OTT Malayalam: ఓటీటీలో మూడు మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలు.. అన్నీ తెలుగులో ఫ్రీగానే చూడొచ్చు.. కొత్త ఓటీటీ బంపర్ ఆఫర్

ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్న 3 మలయాళ సినిమాలు ఇవే

ఇటీవలి కాలంలో మన తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలంటే విపరీతమైన క్రేజ్ పెరిగింది. కంటెంట్ ఓరియెంటెడ్ కథలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో వచ్చే మలయాళం థ్రిల్లర్లకు మన దగ్గర సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ క్రమంలోనే 'థియేటర్ ప్లస్' ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, సైబర్ ఇన్వెస్టిగేషన్ జానర్లలో మూడు విభిన్న చిత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు వారాలు ఫ్రీ మూవీ మారథాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల డీటైల్స్ ఒకసారి చూద్దాం.

1. గుమాస్తా (Gumastha) - ఉత్కంఠరేపే మైండ్ గేమ్‌లు, ట్విస్ట్‌లు

చట్టంలో ఉన్న ప్రతీ చిన్న లొసుగులను వేళ్లమీద లెక్కపెట్టే ఒక లాయర్ క్లర్క్ (గుమాస్తా) చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ లీగల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. తన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు, గుమాస్తానే ప్రధాన నిందితుడిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అనుమానిస్తారు.

పోలీసులు మెడకు ఉరితాళ్ళు బిగిస్తున్న వేళ, బూడిదలో కప్పెట్టిన రహస్యాలు, మైండ్ గేమ్‌లు బయటపడతాయి. ఒక సాదాసీదా క్లర్క్.. వ్యవస్థతో ఆడుకుని 'ఫర్‌ఫెక్ట్ మర్డర్' ప్లాన్ చేశాడా లేదా అనేది చివరిదాకా ఊపిరి బిగబెట్టి చూసేలా ఉంటుంది.

2. 4 వసంతాలు (4 Vasanthalu) - మధురమైన కాలేజీ జ్ఞాపకాలు

కాలేజీ రోజుల్లో విడిపోయిన ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇది. నాలుగేళ్ల కాలేజీ లైఫ్, మర్చిపోలేని ప్రేమ, గ్రాడ్యుయేషన్ ముగిసే సమయంలో మళ్లీ ఒకరినొకరు కలుసుకోవడం చుట్టూ కథ నడుస్తుంది.

విశాల్, గాయత్రి చివరి సెమిస్టర్‌లో కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు, అప్పటి ఎమోషన్స్ మళ్లీ తెరపైకి వస్తాయి. విడిపోయే ముందు వాళ్ళ ప్రేమకు ఒక సరైన ముగింపు దొరికిందా లేదా అనేది ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతుంది.

3. జై గణేష్ (Jai Ganesh) - వీల్‌చైర్ డిటెక్టివ్ సైబర్ వేట

ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిలిచింది. ఒక అమాయక చిన్నారి కిడ్నాప్‌కు గురైనప్పుడు, వీల్‌చైర్‌కే పరిమితమైన ఒక గ్రాఫిక్ డిజైనర్ డిటెక్టివ్‌గా మారే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది.

తన శారీరక వైకల్యాన్ని పక్కనబెట్టి, హ్యాకింగ్ స్కిల్స్, షార్ప్ ఇంటెలిజెన్స్‌తో కిడ్నాపర్ల నెట్‌వర్క్‌ను గణేష్ ఎలా ఛేదించాడనేది సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఉన్ని ముకుందన్ నటన, ఉత్కంఠరేపే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్.

'థియేటర్ ప్లస్' ఉచిత ఆఫర్ ఎలా పొందాలి?

సాధారణంగా ఏ ఓటీటీ యాప్ చూసినా క్రెడిట్ కార్డ్ డీటైల్స్, సబ్‌‌స్క్రిప్షన్ ప్యాక్‌లు అడుగుతుంటాయి. కానీ థియేటర్ ప్లస్ మాత్రం ఎటువంటి ఫీజు లేకుండా సైన్-ఇన్ అయి నేరుగా ఈ సినిమాలను ఎంజాయ్ చేసే ఛాన్స్ ఇస్తోంది.

ఈ రెండు వారాల ఫ్రీ మారథాన్ వీకెండ్‌లో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే మూవీ లవర్స్‌కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. క్వాలిటీ కంటెంట్‌‌ను ఉచితంగా అందిస్తూ కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఇది సూపర్ స్ట్రాటజీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More