మహేష్ - రాజమౌళి 'వారణాసి'పై నిక్ జోనస్ సంచలన వ్యాఖ్యలు: ప్రియాంక 14 నెలలుగా షూటింగ్‌లోనే.. ఆ సాంగ్ వేరే లెవల్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'వారణాసి'. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published on: Feb 10, 2026 5:33 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'వారణాసి' (Varanasi). 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి రీఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనస్ ఈ సినిమా గురించి, ఇండియన్ మ్యూజిక్ గురించి 'జాక్ సాంగ్ షో' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.

మహేశ్ - రాజమౌళి 'వారణాసి'పై నిక్ జోనస్ సంచలన వ్యాఖ్యలు: ప్రియాంక 14 నెలలుగా షూటింగ్‌లోనే.. ఆ సాంగ్ వేరే లెవల్
మహేశ్ - రాజమౌళి 'వారణాసి'పై నిక్ జోనస్ సంచలన వ్యాఖ్యలు: ప్రియాంక 14 నెలలుగా షూటింగ్‌లోనే.. ఆ సాంగ్ వేరే లెవల్

"14 నెలలుగా షూటింగ్.. ఇదొక బిగ్ ప్రాజెక్ట్"

వారణాసి మూవీ గురించి నిక్ జోనస్ మాట్లాడుతూ.. "ప్రియాంక గత 14 నెలలుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న తదుపరి భారీ చిత్రం ఇది. ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది" అని చెప్పుకొచ్చాడు. సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

ఇండియన్ మ్యూజిక్‌పై ప్రశంసలు

ఇండియన్ మ్యూజిక్ గురించి నిక్ జోనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఇండియన్ మ్యూజిక్ లోని మెలోడీలు అద్భుతం. అక్కడి స్కేల్ మనకు అలవాటు లేనిది. సినిమాల్లోని పాటలు బయటకొచ్చి పెద్ద హిట్లవుతాయి. నటులు వేరే వాళ్ళ గొంతుకు లిప్ సింక్ చేసినప్పటికీ, సంగీత దర్శకులు ఆ పాటలను సినిమాకు తగ్గట్టుగా, వినసొంపుగా మారుస్తారు. థియేటర్లలో జనాలు పాటలకు డ్యాన్సులు చేయడం, సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా స్ఫూర్తినిస్తుంది" అని నిక్ ఇండియన్ సినిమా సంస్కృతిని కొనియాడాడు.

మహేష్ లుక్ సీక్రెట్.. ప్రియాంక 'మందాకిని'

గతేడాది పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే మహేష్ బాబు లుక్ రివీల్ కాకూడదని అప్పట్లో ఫోటోలేవీ బయటకు రానివ్వలేదు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్రలో యాక్షన్, గ్లామర్ రెండూ ఉంటాయని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా స్పష్టమైంది. అంతేకాకుండా మహేష్ బాబు, తన మధ్య ఒక "సెన్సేషనల్ సాంగ్" ఉంటుందని, అది ఫ్యాన్స్‌కు పండగే అని ప్రియాంక ఇటీవల వెల్లడించింది.

రాముడి పాత్రలో మహేష్?

'గుంటూరు కారం' తర్వాత మహేష్ బాబు నటిస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. కథలో టైమ్ ట్రావెల్ అంశాలు ఉంటాయని, సినిమాలోని ఒక భాగంలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తాడని రాజమౌళి గతంలోనే హింట్ ఇచ్చాడు. 8 ఏళ్ల తర్వాత ప్రియాంక ఇండియన్ స్క్రీన్‌పై కనిపిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.