Nikhil Bhatt: ఇండియన్ సినిమాలో మోస్ట్ వైలెంట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్.. ఇప్పుడు హాలీవుడ్‌లో రికార్డుల వేట
Nikhil Bhatt: ఓ ఇండియన్ డైరెక్టర్ ఇప్పుడు హాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియాలో అత్యంత హింసాత్మక సినిమాగా గుర్తింపు పొందిన కిల్ సినిమాను డైరెక్ట్ చేసిన నిఖిల్ భట్.. ఇప్పుడు హాలీవుడ్ బాట పట్టడం విశేషం.
Nikhil Bhatt: 'కిల్' (Kill) సినిమాతో ఇండియన్ స్క్రీన్లపై రక్తం ఏరులై పారించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ భారీ హాలీవుడ్ ఎంట్రీకి సై అన్నాడు. ఆస్కార్ అవార్డు విన్నర్, పాపులర్ హాలీవుడ్ స్టార్ జేమీ ఫాక్స్ (Jamie Foxx) ప్రధాన పాత్రలో ఓ ఇంటెన్స్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆయన తెరకెక్కించబోతున్నాడు.

ప్రైమ్ వీడియోలో గ్లోబల్ రిలీజ్.. 'డెడ్‌లాక్డ్' స్టోరీ ఏంటంటే?
ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి 'డెడ్‌లాక్డ్' (Deadlocked) అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ఎంజిఎమ్ స్టూడియోస్ దక్కించుకోవడంతో ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
కోర్టు రూమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హై-వోల్టేజ్ హోస్టేజ్ డ్రామాగా ఈ సినిమా కథ ఉండబోతోంది. కోర్టులో జ్యూరీ డ్యూటీలో ఉన్న ఒక మాజీ మెరైన్ సైనికుడు, అనుకోకుండా కోర్టురూమ్ కిడ్నాప్ డ్రామాలో ఇరుక్కుంటాడు. నేరస్థుడి కూతురు తన తండ్రిని విడిపించుకోవడానికి కోర్టును తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో సాగుతుంది.
'కిల్' సినిమా సృష్టించిన సెన్సేషనల్ రికార్డులు
నటులు లక్ష్య, రాఘవ్ జుయల్ కాంబినేషన్‌లో నిఖిల్ భట్ డైరెక్ట్ చేసిన 'కిల్' చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత వైలెంట్ యాక్షన్ మూవీగా నిలిచింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాను హాలీవుడ్ దిగ్గజ సంస్థ లయన్స్ గేట్ కొనుగోలు చేయడం అప్పట్లో నేషనల్ వైడ్‌గా పెద్ద సంచలనం సృష్టించింది.
బాక్సాఫీస్ దగ్గర రూ.47 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, ఉత్తమ డెబ్యూ నటుడిగా లక్ష్యతో సహా ఏకంగా 6 ఫిలింఫేర్ అవార్డులను ఈ సినిమా కైవసం చేసుకుంది. 'అపూర్వ', 'హుర్దంగ్' వంటి విలక్షణమైన సినిమాలు, 'రసభరి', 'ది గాన్ గేమ్' వంటి హిట్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కించిన నిఖిల్ భట్ కెరీర్‌లో 'కిల్' బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.
హాలీవుడ్ స్టార్ జేమీ ఫాక్స్ జోరు
ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న జేమీ ఫాక్స్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన 'బ్యాక్ ఇన్ యాక్షన్' సినిమాతో ఓపెనింగ్ వీకెండ్‌లోనే 46.8 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించాడు. త్వరలోనే ఒలింపిక్ బాక్సింగ్ డ్రామా 'ఫైట్ ఫర్ '84' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరోవైపు ఈ 'డెడ్‌లాక్డ్' ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌తో నిఖిల్ భట్ చేయాల్సి ఉన్న 'పరశురామ్' సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశానికి చెందిన ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ ఏకంగా ఆస్కార్ విన్నర్‌తో నేరుగా హాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తుండటంతో ఇండియన్ ఫిల్మ్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


