Nikita Rawal: షాకింగ్.. హీరోయిన్‌కు ప‌బ్లిక్‌గా బ‌ల‌వంతంగా ఫ్యాన్ లిప్‌కిస్‌.. నెట్టేస్తున్నా పట్టుకొని.. వీడియో వైర‌ల్‌

Nikita Rawal: బాలీవుడ్ హీరోయిన్ నికితా రావల్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. రెడ్ కార్పెట్ పై పోజులిస్తున్న ఆమెకు ఓ ఫ్యాన్ బలవంతంగా లిప్ కిస్ పెట్టింది. సెల్ఫీ పేరుతో ఆ ఫ్యాన్ చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Aug 10, 2026, 10:08:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nikita Rawal: హిందీ, సౌత్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నికితా రావల్ (Nikita Rawal) కు చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈవెంట్ రెడ్ కార్పెట్‌పై ఆమెకు ఓ లేడీ ఫ్యాన్ పబ్లిక్ గా, బలవంతంగా లిప్ కిస్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షాకింగ్.. హీరోయిన్‌కు స్టేజీపైనే బ‌ల‌వంతంగా ఫ్యాన్ లిప్‌కిస్‌.. నెట్టేస్తున్నా పట్టుకొని.. వీడియో వైర‌ల్‌
షాకింగ్.. హీరోయిన్‌కు స్టేజీపైనే బ‌ల‌వంతంగా ఫ్యాన్ లిప్‌కిస్‌.. నెట్టేస్తున్నా పట్టుకొని.. వీడియో వైర‌ల్‌

నికితా రావల్ కు కిస్

రీసెంట్ గా ఓ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై నికితా రావల్ పోజులిచ్చింది. అదే సమయంలో ఓ లేడీ ఫ్యాన్ సెల్ఫీ కోసం ఆమె దగ్గరకు వచ్చింది. విదేశీ అమ్మాయిలా కనిపించిన ఆమెతో నికితా సెల్పీ దిగింది. అయితే ఆ లేడీ ఫ్యాన్ ఫస్ట్ నికితా చెంపపై ముద్దు పెట్టింది. అంతటితో ఆగకుండా పెదాలపై బలవంతంగా ముద్దు ఇచ్చింది. నికితా తోసేస్తున్నా.. ఆ ఫ్యాన్ గట్టిగా పట్టుకుని మరీ లిప్ కిస్ ఇచ్చింది.

హీరోయిన్ షాక్

లేడీ ఫ్యాన్ లిప్ కిస్ ఇవ్వడంతో బాలీవుడ్ హీరోయిన్ నికితా రావల్ ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. తీవ్రమైన షాక్ కు లోనైంది. వెంటనే నోటిపై చేయి అడ్డుపెట్టుకుంది. అయినా కూడా వినని ఆ లేడీ ఫ్యాన్ మరోసారి నికితా చెంపపై కిస్ చేసింది. వెంటనే ఆమెను సెక్యూరిటీ బయటకు తీసుకెళ్లారు. ఈ డ్రామా అంతా కెమెరాలో రికార్డై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది.

బోల్డ్ రోల్స్ నుంచి టాలీవుడ్ వరకు

బాలీవుడ్‌లో 'గరం మసాలా', 'బ్లాక్ & వైట్', 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్', 'ది హీరో - అభిమన్యు', 'అమ్మ కీ బోలి', 'క్యూట్ కమిటీ' వంటి చిత్రాలలో నటించిన నికితా రావల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

2012లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'తింపా' (Timpa) అనే చిత్రంలో విక్రమ్ రాయ్ సరసన ‘ఇచ్ఛాధారి నాగిని’ పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్ అండ్ యాక్టింగ్‌తో పలు సౌత్ ప్రాజెక్టులలో మెరిసింది.

అర్షద్ వర్సీ, చంకీ పాండేతో బిగ్ మూవీ!

ప్రస్తుతం బాలీవుడ్‌లో వినూత్న కథాంశాలతో వస్తున్న ప్రాజెక్టులపై నికితా ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఆమె అర్షద్ వర్సీ (Arshad Warsi), చంకీ పాండేలతో కలిసి 'రోటీ కప్డా ఔర్ రొమాన్స్' (Roti Kapda Aur Romance) అనే భారీ వినోదాత్మక చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.

సెలబ్రిటీల ప్రైవసీ

పబ్లిక్ ఈవెంట్లలో ఫ్యాన్ లవ్ పేరిట సెలబ్రిటీలపై వారి అనుమతి లేకుండా బలవంతపు ముద్దులు లేదా భౌతిక దాడి చేయడం సరైన పద్ధతి కాదని నికితా రావల్ ఘటన స్పష్టం చేస్తోంది. ఆ లేడీ ఫ్యాన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల ప్రైవసీ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More