Peddi Cotroversy: పవర్‌ఫుల్ మగవాళ్లంతా కలిసి-జాన్వీ కపూర్ ను బలవంతపు ముద్దు సీన్ల కోసం వస్తువుగా మార్చారు: సింగర్ ఫైర్

Peddi Cotroversy: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను శృతిమించి గ్లామరైజ్ చేయడంపై నెట్టింట దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంలో డైరెక్టర్ సరిహద్దులు దాటారంటూ సింగర్ సుమంగళి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Published on: Jun 5, 2026, 14:06:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi Cotroversy: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లతో పాటు ఓ వివాదం కూడా హాట్ టాపిక్ గా మారింది. చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ కాంట్రవర్సీ నెలకొంది.

Janhvi Kapoor and Ram Charan in a still from Buchi Babu Sana's Peddi.
Janhvi Kapoor and Ram Charan in a still from Buchi Babu Sana's Peddi.

జాన్వీ కపూర్ పాత్ర

పెద్ది మూవీలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను విపరీతంగా హైపర్‌సెక్సువలైజేషన్ (గ్లామరైజ్) చేయడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాపులర్ సింగర్ సుమంగళి అరియనాయగం చేసిన ఘాటు వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి.

సింగర్ సుమంగళి ఫైర్

పెద్ది సినిమాలో హీరోయిన్ పాత్రలో జాన్వీ కపూర్ ను చూపించిన విధానాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ గా మారింది. దీన్ని జాన్వీ కపూర్ లైక్ చేయడంతో కలకలం రేగింది. జాన్వీ కపూర్ ఆ పోస్ట్‌ను లైక్ చేసిన కొద్దిసేపటికే, ప్రముఖ సింగర్ సుమంగలి అరియనాయగం ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ చిత్ర మేకర్స్‌పై నిప్పులు చెరిగింది. కమర్షియల్ సినిమాల్లో మహిళా పాత్రలను కేవలం వస్తువులుగా మార్చే ధోరణిని ఆమె తీవ్రంగా ఖండించింది.

పవర్ ఫుల్ మగవాళ్లంతా

సుమంగళి తన పోస్ట్‌లో.. "సమాజంలో అణచివేతకు గురైన వారి ఆవేదనను ఒక కథగా రాయడానికి కొంతమంది పవర్‌ఫుల్ మగవాళ్లంతా ఒక గదిలో కూర్చున్నారు. కానీ, అదే చేత్తో జాన్వీ కపూర్ పాత్రను కేవలం కెమెరా కంటికి నచ్చేలా ఒక శరీరంగా, బలవంతపు ముద్దు సీన్ల కోసం ఒక వస్తువుగా మార్చేశారు.

పాటలు అయిపోగానే ఆ పాత్రను పక్కన పడేశారు. మానవ మర్యాద అంటే ఏంటో ఆ మేకర్స్‌కు బాగా తెలుసు.. కానీ ఆ గౌరవం ఇవ్వడానికి ఈమె అర్హురాలు కాదని వారు నిర్ణయించుకున్నారు" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

సుమంగళి స్టోరీ
సుమంగళి స్టోరీ

‘రెకమండేషన్ కమ్యూనిటీ’ పోస్ట్

ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘రెకమండేషన్ కమ్యూనిటీ’ అనే పేజీ పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్. ‘పెద్ది: భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రధాన హీరోయిన్ గా జరిగిన అత్యంత ఖరీదైన అవమానం’ అనే టైటిల్‌తో వారు ఒక విశ్లేషణను పంచుకున్నారు.

సమాజంలో గుర్తింపును నిరాకరించడం ఒక సామాజిక అరిష్టం అని రూ.350 కోట్ల బడ్జెట్‌తో కథలు చెప్పిన దర్శకుడు, అదే సినిమాలో హీరోయిన్ అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్రకు కనీస గౌరవాన్ని నిరాకరించారని ఆ పోస్ట్‌లో ఎండగట్టారు.

ఇన్‌సైడ్ టాక్

ఈ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. చిత్ర యూనిట్‌ను తీవ్రంగా తప్పుబడుతూ వచ్చిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను స్వయంగా హీరోయిన్ జాన్వీ కపూర్ లైక్ చేయడం. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే ఈ అభ్యంతరకరమైన గ్లామర్ షాట్స్, బలవంతపు రొమాంటిక్ సీన్ల గురించి జాన్వీ మేకర్స్‌ను గట్టిగా ప్రశ్నించిందని సమాచారం.

ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషనల్ లైన్ గీస్తూ ఆమె తన అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ, ఫైనల్ ఎడిటింగ్‌లో బాక్సాఫీస్ కలెక్షన్ల కోసం దర్శకుడు ఆమె గీసిన సరిహద్దును దాటేశారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ 'లైక్' ద్వారా జాన్వీ సినిమా టీమ్‌పై తన నిశ్శబ్ద నిరసనను వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోందనే కామెంట్లు వస్తున్నాయి.

People Also Ask (PAA)

1. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ (అచ్చియమ్మ) పాత్ర వివాదానికి కారణం ఏంటి?

సినిమాలో ఒక బలమైన సామాజిక సందేశం ఉన్నప్పటికీ, హీరోయిన్ పాత్రను కేవలం అందాల ప్రదర్శనకు, కథకు సంబంధం లేని బలవంతపు రొమాంటిక్ సీన్లకు మాత్రమే పరిమితం చేశారనే విమర్శలు వస్తున్నాయి.

2. ఈ వివాదంపై రామ్ చరణ్ లేదా బుచ్చిబాబు సాన స్పందించారా?

జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ లైక్, సింగర్ సుమంగళి వ్యాఖ్యలపై పెద్ది చిత్ర బృందం (డైరెక్టర్ బుచ్చిబాబు సాన లేదా హీరో రామ్ చరణ్) ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

3. పెద్ది సినిమా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా?

'పెద్ది' ఒక అద్భుతమైన క్రీడా నేపథ్య, సామాజిక సందేశాత్మక చిత్రం అయినప్పటికీ, సినిమాలో హీరోయిన్‌పై చిత్రీకరించిన కొన్ని గ్లామర్ సీన్లు, రొమాంటిక్ షాట్స్ కారణంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More