Janhvi Kapoor: పెద్దిలో జాన్వీ కపూర్.. సౌత్ వర్సెస్ నార్త్ రచ్చ.. అలా చూపిస్తారా అంటూ వాళ్లు.. ఆమె అవసరమా అంటూ వీళ్లు..

Janhvi Kapoor: పెద్ది మూవీ బ్లాక్‌బస్టర్ టాక్ ఎలా ఉన్నా.. ఇప్పుడీ సినిమా చుట్టూ ఓ కొత్త వివాదం ముసురుకుంది. అది సౌత్ వర్సెస్ నార్త్ గా మారిపోయింది. మూవీలో జాన్వీని చూపించిన తీరుపై నార్త్ లోని కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు మండిపడుతుంటే.. అసలు జాన్వీ ఈ మూవీకి అవసరమా అని ఇక్కడి వాళ్లు అంటున్నారు.

Published on: Jun 5, 2026, 11:07:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Janhvi Kapoor: పెద్ది మూవీ రిలీజ్ తర్వాత అందరూ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంతలా చర్చించుకుంటున్నారో.. జాన్వీ గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఆమె విషయంలో పూర్తి డివైడెడ్ టాక్ నడుస్తోంది. నార్త్ లోని ఇన్‌ఫ్లుయెన్సర్లు కొందరు పెద్ది సినిమాలో జాన్వీని చూపించిన తీరును తప్పుబడుతూ టాలీవుడ్ ఇక మారదా అని అంటున్నారు. అదే సమయంలో ఈ పెద్ది సినిమాకు జాన్వీనే పెద్ద మైనస్ అని, అసలు ఆమెను ఎందుకు తీసుకున్నారంటూ ఇక్కడి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Janhvi Kapoor: పెద్దిలో జాన్వీ కపూర్.. సౌత్ వర్సెస్ నార్త్ రచ్చ.. అలా చూపిస్తారా అంటూ వాళ్లు.. ఆమె అవసరమా అంటూ వీళ్లు..
Janhvi Kapoor: పెద్దిలో జాన్వీ కపూర్.. సౌత్ వర్సెస్ నార్త్ రచ్చ.. అలా చూపిస్తారా అంటూ వాళ్లు.. ఆమె అవసరమా అంటూ వీళ్లు..

జాన్వీ కపూర్ మిస్ కాస్టింగ్?

ముందుగా జాన్వీ కపూర్ యాక్టింగ్ మీదే పెద్ద డిబేట్ నడుస్తోంది. ‘దేవర’ సినిమాకు, ఈ ‘పెద్ది’ సినిమాకు మధ్య ఆమె చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు. అయినా కూడా సౌత్ డైరెక్టర్లు ఆమె వెంటే ఎందుకు పడుతున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఆమె ఈ సినిమాలో చేయడం వల్ల నార్త్‌లో ఏమైనా ఎక్స్‌ట్రా టికెట్స్ తెగుతున్నాయా? అంత ఖర్చు పెట్టి సినిమా తీసేవారికి వేరే స్టార్ హీరోయిన్ దొరకలేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూసినా ఈ క్యారెక్టర్‌కు జాన్వీ అస్సలు సెట్ అవ్వలేదని, సినిమాకు ఆమె పెద్ద మైనస్ అని పబ్లిక్ టాక్ వస్తోంది.

రొమాన్స్ పేరుతో వేధింపులా?

ఇది ఒక ఎత్తైతే.. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ క్యారెక్టర్‌ను తెరమీద చూపించిన విధానం మరో వివాదానికి దారితీసింది. ఆత్మగౌరవం, సొసైటీలో ఐడెంటిటీ కోసం పోరాడే హీరో కథ ఇది. కానీ అదే హీరో.. హీరోయిన్ అచ్చియమ్మను ట్రీట్ చేసే విధానం చూస్తే విస్తుపోవాల్సిందే అంటూ ఓ నార్త్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.

ఆ అమ్మాయి ముఖం ఎంత అందంగా ఉందో వర్ణించే సీన్‌లో.. డైరెక్టర్ మాత్రం కావాలని ఆమె బాడీ పార్ట్స్‌ను జూమ్ చేసి చూపించడం విమర్శలకు తావిస్తోంది. వాళ్ల నాన్న పెళ్లికి ఒప్పుకోడు కాబట్టి కనీసం 'ముట్టేయాలి' అంటూ హీరో చెప్పే డైలాగులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కరెంట్ పోయినప్పుడు బలవంతంగా ముద్దు పెట్టుకునే సీన్ కూడా అలాంటిదే అంటున్నారు.

మారని టాలీవుడ్ మైండ్‌సెట్?

ఈ కాలంలోనూ హీరోయిన్లను ఇలా ఆటవస్తువులా చూపించడమేంటి? టాలీవుడ్ మైండ్ సెట్ మారదా అంటూ నేషనల్ మీడియాలోని పలు వెబ్‌సైట్లు విమర్శించడం గమనార్హం. మొత్తానికి జాన్వీ కపూర్ విషయంలో పూర్తి భిన్నమైన అభిప్రాయాలు అటు నార్త్, ఇటు సౌత్ లో వ్యక్తమవుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ చూస్తే అర్థమవుతోంది. ఈ పెద్ది మూవీతో జాన్వీకి టాలీవుడ్ లో అవకాశాలు ఇక మూసుకుపోయినట్లే అన్న చర్చ కూడా జరుగుతోంది.

జాన్వీకి ఇష్టం లేదా?

మరోవైపు ఈ సినిమాలో జాన్వీని చూపించిన విధానాన్ని విమర్శిస్తూ చేసిన ఓ రివ్యూకు ఆమె లైక్ కొట్టడం మరింత చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'రెకమండేషన్ కమ్యూనిటీ' (Recommendation Community) అనే పేజీ ‘పెద్ది’ సినిమా మీద ఒక పెద్ద అనాలిసిస్ పోస్ట్ చేసింది.

"ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక స్టార్ హీరోయిన్‌కు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం పెద్ది" అని ఆ పేజీ అందులో రాసుకొచ్చింది. ఆ పేజీకి జాన్వీ లైక్ కొట్టడంతో తన పాత్ర విషయంలో జాన్వీ కూడా అసంతృప్తిగానే ఉందా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More