Shah Rukh Khan: "నా భర్త కంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నా".. షారుఖ్‌కు లేడీ ఫ్యాన్ ప్రపోజల్.. అతని రియాక్షన్ చూస్తే..
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. మంగళూరులో జరిగిన ఓ ఈవెంట్ లో లేడీ ఫ్యాన్ ఓపెన్ గా చేసిన లవ్ ప్రపోజల్ తో కింగ్ కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే తనదైన స్టైల్లో ఓ ఫన్నీ రిప్లై కూడా ఇచ్చారు.
Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన మార్క్ టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో కర్ణాటకలోని మంగళూరు సిటీని ఒక ఊపు ఊపేశారు. గురువారం (జూన్ 25) మంగళూరులో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన కింగ్ ఖాన్.. తన చార్ట్‌బస్టర్ సాంగ్స్‌కు మాస్ స్టెప్పులేయడమే కాకుండా ఆడియన్స్‌తో సరదాగా ముచ్చటించారు.

ఈ క్రమంలో ఒక లేడీ ఫ్యాన్ నుంచి ఎదురైన ఊహించని లవ్ ప్రపోజల్‌కు షారుఖ్ ఇచ్చిన స్పాంటేనియస్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సదరు మహిళా అభిమాని స్టేజ్ ముందే నిలబడి.. "నా భర్త కంటే నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను షారుఖ్" అంటూ గట్టిగా అరిచింది.
ఒంటరిగా చెప్పాలి కదా..
దీనికి షారుఖ్ ఖాన్ అస్సలు టైమ్ వేస్ట్ చేయకుండా తన ట్రేడ్‌మార్క్ డింపుల్ స్మైల్ ఇస్తూ గట్టిగా నవ్వేశారు. ఆ వెంటనే మైక్ అందుకుని హిందీలో ఒక క్రేజీ కౌంటర్ వేశారు.
"ఇలాంటి పర్సనల్ విషయాలన్నీ అందరి ముందు కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి కదా" అంటూ కింగ్ ఖాన్ సరదాగా అనడంతో ఈవెంట్‌కు వచ్చిన ఆడియన్స్ అంతా నవ్వులతో ఊగిపోయారు.
ఆ తర్వాత కాస్త సీరియస్‌గా స్పందిస్తూ.. ఆ అభిమాని ఎమోషన్‌ను షారుఖ్ గౌరవించారు. ఇదంతా కేవలం అభిమానంతో అన్న మాటలే అని తనకు తెలుసని, ఆమె ఫీలింగ్స్‌ను తాను, అలాగే ఆమె భర్త కూడా పక్కాగా అర్థం చేసుకోగలరని చెప్పారు. తాను ఆ అభిమానితో పాటు ఆమె భర్త, మొత్తం ఫ్యామిలీని ప్రేమిస్తున్నానంటూ థాంక్స్ చెప్పారు.
కన్నడలో నమస్కారం.. మంగళూరుతో కనెక్షన్
ఈవెంట్ మొదట్లోనే షారుఖ్ ఖాన్ స్టేజ్ పైకి వస్తూనే కన్నడలో "నమస్కార" అంటూ పలకరించి లోకల్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ వేదిక వరకు మంగళూరు జనాలు చూపించిన ప్రేమాభిమానాలు, ఎనర్జీ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని ఎమోషనల్ అయ్యారు.
నిజానికి షారుఖ్ ఖాన్‌కు మంగళూరు సిటీతో ఒక బలమైన వ్యక్తిగత బంధం ఉంది. ఆయన పుట్టింది ఢిల్లీలో అయినప్పటికీ.. తన చిన్నతనంలో 1965 నుంచి 1970 వరకు మొదటి ఐదేళ్ల లైఫ్‌ను ఈ పోర్ట్ సిటీలోనే గడిపారు. తన తాత ఇఫ్తికార్ అహ్మద్ ఇక్కడే పని చేయడం వల్ల షారుఖ్ తన బాల్యాన్ని మంగళూరులోనే ఎంజాయ్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే ప్లేస్‌కు రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
క్రిస్మస్ బరిలో 'కింగ్'.. కూతురు సుహానా ఖాన్‌తో..
షారుఖ్ ఖాన్ తర్వాతి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తన మోస్ట్ అవేటెడ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్' (King) షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. 'పఠాన్' లాంటి రూ.1000 కోట్ల బ్లాక్‌బస్టర్ ఇచ్చిన యాక్షన్ స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా చేస్తుండగా, క్లాసిక్ మేకర్ సుజోయ్ ఘోష్ స్క్రిప్ట్ వర్క్ చూసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ షారుఖ్ వ్యక్తిగత జీవితానికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆయన కూతురు సుహానా ఖాన్ సిల్వర్ స్క్రీన్ పైకి కమర్షియల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
1994 నాటి హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ 'లియోన్: ది ప్రొఫెషనల్' స్ఫూర్తితో ఈ సినిమా కథను రూపొందించినట్లు టాక్. ఇందులో షారుఖ్ ఒక రిటైర్డ్ డెడ్లీ హిట్ మాన్ (షూటర్)గా కనిపిస్తుండగా.. ఒక అమ్మాయిని కాపాడే మిషన్‌లో ఆయన చేసే యాక్షన్ అరాచకం మరో లెవెల్‌లో ఉండబోతోంది.
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తోంది. ఈమధ్యే సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో షారుఖ్, దీపికాలపై కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ షూట్ చేసిన ఫొటోలు నెట్‌లో లీకయ్యాయి. అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అర్షద్ వార్సి, రాఘవ్ జుయల్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ 2026 కానుకగా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా తన కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌లో షారుఖ్ ఒక క్రేజీ కామియో రోల్‌లో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


