Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టమంటుంది. అప్పుడే వచ్చిన విరాట్ పంతులు గారు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. దానికి జగదీశ్వరి నీ భార్య చంద్రకళకి మదన్‌కి నిశ్చయతార్ధం ఫిక్స్ చేయడానికి అని అంటుంది.
మదన్‌ను ఇంట్లోంచి పంపించేయండి

విరాట్ నా భార్యకి మ్యారేజ్ చేయటం ఏంటి అని అడుగుతాడు. ముందు ఆ మదన్ ని ఇంట్లో నుంచి బయటకి పంపేయండి అని విరాట్ అంటాడు. దానికి రఘురామ్ ముందు నువ్వు పెళ్లి చేసుకొని వచ్చిన మాయని బయటకి పంపించు ఆ తర్వాత మదన్‌ను పంపిస్తాం అని అంటాడు. దాంతో విరాట్ చిరాకు పడతాడు.
శ్రుతి, కామాక్షి వాళ్లు పంతులు మనం చెప్పినట్టే చేస్తాడు అని అనుకుంటారు. పంతులు ఇప్పటిలో మదన్ జాతకానికి మంచి ముహూర్తం లేదు అని అంటాడు. శ్రుతి, కామాక్షి సంతోషపడతారు. మదన్ టెన్షన్ పడతాడు. చంద్రని త్వరగా పెళ్లి చేసుకుంటేగాని ఆస్తి చేతికి రాదు అని కంగారుపడతాడు.
క్రాంతి ఎందుకు తొందరపడుతున్నాడు
విరాట్ తమ్ముడు క్రాంతి మంచి రోజు ఉంటే చాలు, ముహూర్తం అవసరం లేదు అని అంటాడు. దానికి క్రాంతి భార్య శాలిని మనసులో క్రాంతి చంద్రకి పెళ్లి చేయటంలో తొందర ఎందుకు పడుతున్నాడు, అసలు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా అని ఆలోచిస్తుంది. పంతులు ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ చేస్తాడు. నా భార్య చంద్రకి ఎలా ఎంగేజ్‌మెంట్ చేస్తారో నేను చూస్తాను అని విరాట్ అంటాడు.
విరాట్‌ని ఉడికించాలని వెనకాలే వెళ్తుంది చంద్రకళ. వాళ్లిద్దరు వెళ్లడం మదన్ చూస్తాడు. మదన్‌ని చంద్ర చూసి ఏమిటి మదన్ గారు? నన్ను సందేహాపడుతున్నారా అని అడుగుతుంది. మదన్‌కి సందేహం ఉన్న లేదు అని అబద్ధం చెబుతాడు. దాంతో చంద్రకళ సరే అని అంటుంది.
ఈ దుకాణం తీసేయండి
{{/usCountry}}విరాట్‌ని ఉడికించాలని వెనకాలే వెళ్తుంది చంద్రకళ. వాళ్లిద్దరు వెళ్లడం మదన్ చూస్తాడు. మదన్‌ని చంద్ర చూసి ఏమిటి మదన్ గారు? నన్ను సందేహాపడుతున్నారా అని అడుగుతుంది. మదన్‌కి సందేహం ఉన్న లేదు అని అబద్ధం చెబుతాడు. దాంతో చంద్రకళ సరే అని అంటుంది.
ఈ దుకాణం తీసేయండి
{{/usCountry}}రఘురామ్ ఎంగేజ్‌మెంట్‌కి బట్టలు కొనాలి అని అంటాడు. బట్టల వ్యాపారిని ఇంటికి పిలుస్తారు. అందరూ బట్టలు చూస్తూంటారు. విరాట్ ఏంటి ఇదంతా? ముందు ఇంట్లో ఈ దుకాణం తీసేయండి అని అంటాడు. కానీ, ఎవరు పట్టించుకోరు. మదన్ ఏమో ఎంగేజ్‌మెంట్‌కి తన డ్రెస్సును చంద్రకళనే సెలెక్ట్ చేయమంటాడు. దానికి చంద్రకళ సరే అని అంటుంది.
విరాట్‌ని చూసి కావాలనే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఈ డ్రెస్ మీకు బాగుంటుంది అని మదన్‌తో అంటుంది చంద్రకళ. అదంతా చూసిన విరాట్ చిరాకు పడి బయటకి వెళ్లి పోతాడు. చంద్రకళ కూడా తన వెనకాలే వెళ్తుంది. విరాట్ సడెన్‌గా వెనక్కి తిరిగేసరికి చంద్రకళ పడబోతుంది. అది గమనించిన విరాట్ వెంటనే చంద్రకళను పట్టుకుంటాడు.
చంద్ర, విరాట్ రొమాన్స్
ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు. అప్పుడే మదన్ అక్కడికి వస్తాడు. చంద్రకళను విరాట్ పట్టుకోవడం చూసి షాక్ అవుతాడు. అదేంటి నాకు కాబోయే భార్య విరాట్ చేతిలో ఉంది. అంటే ఇద్దరు ఇంకా విడిపోలేదా అని మదన్ అనుమానపడతాడు. మదన్ చూడటం గమనించిన చంద్రకళ అదేంటి విరాట్ సార్ అలా పట్టుకున్నారు అని అడుగుతుంది.
నేను ఇప్పుడు మీ భార్యని కాదు కదా. అలా ఎలా పట్టుకుంటారని విరాట్‌ను నిలదీస్తుంది చంద్రకళ. కానీ, మదన్ మాత్రం వాళ్లిద్దరిని అలా చూసి కంగారుపడుతుంటాడు. తర్వాత మదన్‌ను చంపేందుకు విరాట్ కత్తికి సానపడుతుంటాడు. అది చూసిన జగదీశ్వరి భర్త రఘురామ్‌తో మదన్‌ను విరాట్ ఏమైనా చేస్తాడేమో అంటుంది.
ఎంగేజ్‌మెంట్‌పై ఐదుగురి ప్లాన్
మందార, మాయ ఎలాగైనా చంద్రకళ, మదన్ ఎంగేజ్‌మెంట్ జరగాలని అనుకుంటారు. మరోవైపు శ్రుతి, కామాక్షిలు ఇదే ఎంగేజ్‌మెంట్ ఎలాగైనా చెడగొట్టాలి అని ప్లాన్ చేస్తారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.