Ninnu Kori March 27 Episode: నిన్ను కోరి.. చంద్రకళ సంచలన నిర్ణయం.. అత్తయ్య ప్రాణాల కోసం పంచమహాయాగం.. అత్తకు శ్రుతి దెబ్బ
Ninnu Kori March 27 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 27 ఎపిసోడ్ లో శాలినిపై క్రాంతి సీరియస్ అవుతాడు. ఎప్పుడో తనను మనసులో నుంచి తీసేశానిన క్రాంతి చెప్తాడు. మరోవైపు శ్రుతితో సేవలు చేయించుకోవాని సరోజ వేసిన ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. అత్తయ్య, మామయ్యతో పంచమహాయాగం చేయిద్దామని చంద్రకళ చెప్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 27 ఎపిసోడ్ లో.. శాలినిని బిజినెస్ పార్ట్ నర్ గా తప్పించానని క్రాంతి చెప్తాడు. ఎందుకు అలా చేశావని అందరూ అడుగుతారు. నమ్మించి గొంతు కోసే మనిషికి మనల్ని శాసించే పవర్స్ ఉండకూడదు. తను దొంగదెబ్బ తీశాక బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్త పడటం మంచిదని క్రాంతి చెప్తాడు.

క్రాంతి ఫైర్
లైఫ్ పార్ట్ నర్ గా నిన్ను నా మనసులో నుంచి ఎప్పుడో తీసేశా. నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని శాలినితో క్రాంతి అంటాడు. మన మధ్య భార్యాభర్తల బంధం ఇంకా ఉంది. నువ్వు ద్వేషం చూపించిన ప్రతిసారి నీకు ప్రేమను చూపిస్తా. నీ కోసం షర్ట్ తెచ్చానని శాలిని అంటుంది. ఆ షర్ట్ తీసుకోమ్మని అందరూ క్రాంతికి చెప్తారు. అయినా క్రాంతి వినడు.
చంద్ర చెప్పినా
మీ అన్నయ్య బిజినెస్ కోసం ఇంటికి దూరంగా వెళ్లాడు. మరోవైపు నా కడుపులో బిడ్డతో అత్తయ్యకు ప్రాణహాని ఉందని అంటున్నారు. మీరైనా సంతోషంగా ఉండాలని క్రాంతితో చంద్రకళ అంటుంది. నా ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటా కానీ అది జరగదు అని క్రాంతి అంటాడు. ఆ షర్ట్ ను తీసి శాలిని ముఖానికి కొడతాడు.
పంచమహాయాగం
సిద్ధాంతి, జగదీశ్వరి అన్న మాటలను తలుచుకుంటూ చంద్రకళ గదిలో కూర్చుని ఏడుస్తుంటుంది. విరాట్ తన పక్కన ఉంటే బాగుండని ఫీల్ అవుతుంది. ఇదంతా నీకు చెప్పుకోవాలని ఉన్నా నీ టెన్షన్ కారణంగా చెప్పట్లేదని తనలో తాను అనుకుంటూ చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. మాయ వచ్చి చంద్రను ఓదార్చుతుంది.
ఒక మంచి యాగం చేద్దాం. పంచమహాయాగం చేస్తే బాగుంటుందని మాయ చెప్తుంది. అవును, యాగం చేయాలని చంద్ర కూడా అంటుంది.
శ్రుతి రివర్స్ డ్రామా
మరోవైపు కోడలు శ్రుతితో సేవలు చేయించుకోవాలని సరోజ ప్లాన్ వేస్తుంది. జ్వరం వచ్చినట్లు నటిస్తుంది. అత్త నాటకం ఆడుతున్నట్లు శ్రుతి కనిపెడుతుంది. ఇదేదో పెద్ద జ్వరంలాగా ఉంది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం. రూ.1.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని శ్రుతి చెప్తుంది. అమ్మ వెంటనే హాస్పిటల్ వెళ్దామని రాజ్ అంటాడు. సరోజ తన ప్లాన్ గురించి చెప్పేస్తుంది. ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవని శ్రుతి అంటుంది.
అత్తయ్య, మామయ్యతో
బిడ్డ కోసం ఇంటిల్లిపాది ఆశగా చూస్తున్నారు. ప్రాణం పోయినా ఈ బిడ్డను వదులుకోను. అత్తయ్య, బిడ్డ క్షేమం కోసం ఇంట్లో పంచమహాయాగం జరిపించాలని అనుకుంటున్నా. అత్తయ్య, మామయ్య చేతుల మీదుగా యాగం చేయిద్దామని చంద్రకళ చెప్తుంది.
క్రాంతి మనం కూడా యాగంలో కూర్చుందామని శాలిని అడుగుతుంది. నీలాంటి దానితో కూర్చుంటే పవిత్ర యాగం కూడా అపవిత్రమవుతుందని క్రాంతి మండిపడతాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


