Ninnu Kori March 20 Episode: రఘురాం గుండె బద్దలయ్యే నిజం.. జగదీశ్వరికి లివర్ క్యాన్సర్.. శ్రుతి విషయం బయటపెట్టిన చంద్రకళ

Ninnu Kori March 20 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో శ్రుతిపై రఘురాం సీరియస్ అవుతాడు. చంద్రకళ అసలు విషయం చెప్పడంతో అందరూ శ్రుతిపై మండిపడతారు. మరోవైపు జగదీశ్వరికి లివర్ క్యాన్సర్ ఉందని రఘురాంకు డాక్టర్ చెప్తాడు.

Published on: Mar 20, 2026, 07:30:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో.. రఘురాం త్వరలోనే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారని డాక్టర్ చెప్తాడు. మందులు తీసుకురమ్మని జగదీశ్వరిని రఘురాం పంపిస్తాడు. జగదీశ్వరి వేలు కట్ అయిన విషయం చెప్పిన రఘురాం బ్లడ్ క్లాట్ కాలేదని డాక్టర్ కు చెప్తాడు. దీంతో జగదీశ్వరికి తెలియకుండా డాక్టర్ సీక్రెట్ గా బ్లడ్ టెస్ట్ చేద్దామని శాంపిల్ తీసుకుంటారు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్రుతి కోపం

శ్రుతి అరుస్తూ ఇంటికి వస్తుంది. చంద్రకళ నా జీవితంలో జోక్యం చేసుకుంటుంది. నా కాపురంలో, ఆఫీస్ విషయంలో కలగజేసుకుంటుంది. నా ఆఫీస్, నా డబ్బులు అడగడానికి తనెవ్వరు? పైగా నా మీద చేయి ఎత్తుతుందా? అని శ్రుతి అరుస్తుంది.

చంద్రకళ నిజం

అప్పుడే చంద్రకళ వస్తుంది. నా కూతురు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా అని చంద్రను కామాక్షి అడుగుతుంది. బిజినెస్ లో వచ్చిన డబ్బంతా తానే తీసుకుని షాపింగ్ లకు ఖర్చు చేస్తోంది. పాపం జల్ రాజ్ ఇబ్బంది పడుతున్నాడని చంద్ర చెప్తుంది. దీంతో శ్రుతిపై శ్యామల ఫైర్ అవుతుంది.

రఘురాం ఫైర్

నా భర్త, నా సంపాదన నేను ఏమైనా చేసుకుంటా. ఆ డబ్బులు వాడుకోనివ్వండి లేదంటే తెగదెంపులు చేసి ఇంటికి తీసుకురండి అని శ్రుతి అంటుంది. విడాకులు ఏంటీ అని రఘురాం గట్టిగా అరుస్తాడు. ఈ చంద్రకళ నాశనం అయిపోతుందని శ్రుతి అంటుంది. చంద్రకళ వట్టిమనిషి కాదు అలా అంటావా? అని జగదీశ్వరి కోప్పడుతుంది.

శ్రుతికి వార్నింగ్

జల్ రాజ్ నాకు కాల్ చేశాడు మామయ్య. రోజు వచ్చిన లాభమంతా శ్రుతి తీసుకుంటుంది. ఇందులో కామాక్షి కూడా ఇన్వాల్వ్ అయింది. రాజ్ ను ఫెయిల్యూర్ గా చూపించి, శ్రుతికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారని చంద్ర చెప్తుంది. జల్ రాజ్ కు సపోర్ట్ చేస్తే ఎదుగుతాడు. ఇంకా ఎక్కువ చేస్తే శ్రుతిని మెడ పట్టుకుని బయటకు నెట్టేస్తానని రఘురాం సీరియస్ అవుతాడు.

చంద్రకు ప్రేమతో

రాత్రి విరాట్ తో చంద్ర ఫోన్లో మాట్లాడుతుంది. ఇంకా పురుషోత్తాన్ని కలవలేదు. రావడానికి టైమ్ పడుతుందని విరాట్ చెప్తాడు. చంద్ర డల్ గా ఉండటంతో శ్యామల, జగదీశ్వరి ఏమైందని అడుగుతారు. బావకు ఇన్ని రోజులు ఎప్పుడూ దూరంగా లేనని చంద్ర అంటుంది. దిగులు పెట్టుకోకుండా ముందు భోజనం చేయమంటారు. చంద్రకు శ్యామల తినిపిస్తుంది.

అప్పుడే వచ్చిన మాయ కూడా తనకు తినిపించమని అడుగుతుంది. అన్నం కలిపి మాయ చేతిలో పెడుతుంది శ్యామల. మీలాంటి మంచి ఫ్యామిలీలో చోటు దొరకడం నా లక్ అని మాయ అంటుంది.

జగదీశ్వరికి లివర్ క్యాన్సర్

జగదీశ్వరికి సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆమెకు లివర్ క్యాన్సర్ ఉంది. ట్రీట్మెంట్ తో క్యూర్ అవుతుందనే గ్యారెంటీ ఇవ్వలేను. ఇంకా ఎంత కాలం బతికి ఉంటుందోనని డాక్టర్ చెప్పడంతో రఘురాం గుండె బద్దలవుతుంది. ఈ విషయాన్ని ఆలోచిస్తూ రఘురాం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు.

రఘురాం కనిపించకపోవడంతో జగదీశ్వరి కంగారు పడుతుంది. పక్క ఇంటికి వెళ్లి రఘురాం డోర్ కొడతాడు. వాళ్లు రఘరాంను తన ఇంటికి తీసుకొస్తారు. ఇక్కడితో నేటి నిన్నుకోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More