Ninnu Kori March 17 Episode: మా అమ్మను చంపాలని చూశావా? శాలినిపై క్రాంతి ఫైర్.. శ్రుతి బ్యాగ్ దొంగతనం..మాయకు తెలిసిన నిజం

Ninnu Kori March 17 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 17 ఎపిసోడ్ లో శాలిని గురించి నిజాలు తెలుసుకుని మాయ స్టన్ అవుతుంది. శాలినిని మారిపోలేదు కదా అని ప్రశ్నిస్తుంది. శ్రుతి, కామాక్షి వెళ్తున్న కారు ఆగిపోతుంది. శ్రుతి హ్యాండ్ బ్యాగ్ ను దొంగ కొట్టేస్తాడు.

Published on: Mar 17, 2026, 07:37:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 17 ఎపిసోడ్ లో.. వదిన కోసం తెచ్చిన ఫ్రూట్స్ ను చంద్రకళకు క్రాంతి ఇస్తాడు. బొజ్జలో ఉన్న బుజ్జి బాబు కోసం ఈ బాబాయి కూడా ఆలోచిస్తాడని క్రాంతి అంటాడు. జూనియర్ విరాట్ వచ్చాక అందరినీ ఆడిస్తాడని చెప్తాడు. శాలినిపై కోపంతో క్రాంతి లోపలికి వెళ్లిపోతాడు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మాయ ప్లాన్

క్రాంతి తెచ్చిన ఫ్రూట్స్ ను కామాక్షి తీసుకోబోతుంటే శ్యామల వచ్చి కొడుతుంది. ఈ పళ్లు అన్ని చంద్రకళనే తినాలని శ్యామల చెప్తుంది. మరోవైపు కామాక్షిని బుట్టలో వేసుకునేందుకు మాయ ట్రై చేస్తుంది. పిన్ని గారు అని వరుస పెట్టి పిలుస్తుంది. నాకు రెస్పెక్ట్ ఇస్తున్న ఫస్ట్ పర్సన్ నువ్వేనని కామాక్షి అంటుంది.

మొత్తం చెప్పేసిన కామాక్షి

క్రాంతి, శాలిని గురించి కామాక్షిని మాయ అడుగుతుంది. ఆ శాలిని మామూలు మనిషి కాదు, మేకవన్నె పులి. మా అన్నయ్య మీద దాడి చేసిందని జరిగింది మొత్తం మాయకు కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షికి శ్రుతి కాల్ చేసి షాపింగ్ కు వెళ్లాలని బయటకు రమ్మంటుంది.

శాలినికి షాక్

శాలిని క్యారెక్టర్ ఇంత డేంజరా? తన గురించి తెలుసుకోవాలని ఉందని మాయ అనుకుంటుంది. అప్పుడే శాలిని బయటకు వస్తుంది. మీకు, క్రాంతికి జరిగిన గొడవ చూశా. దాని వెనుక ఉన్న కారణం కూడా తెలిసింది. మనుషులను చంపే క్రూరత్వం నీలో ఉందంటే నమ్మలేకపోతున్నా. దేవుడి లాంటి రఘురాంను చంపాలని చూశావు. ఇంకా నువ్వు మారలేదు కదా అని శాలినిని మాయ అడుగుతుంది.

శాలిని వార్నింగ్

మాయ నా విషయంలో ఇన్వాల్స్ అవకు. గెస్ట్ లా వచ్చావ్ గెస్ట్ లా ఉండమని శాలిని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శ్రుతి, కామాక్షి కలిసి కార్లో వెళ్తారు. రెండు రోజుల కలెక్షన్ నా దగ్గరే ఉంది. అందుకే షాపింగ్ చేద్దామని పిలిచా. ఈ దెబ్బకు నా మొగుడి బిజినెస్ దివాళా తీయాల్సిందే. నాకు విడాకులు ఇవ్వాల్సిందేనని శ్రుతి అంటుంది.

బ్యాగ్ దొంగతనం

అప్పుడే కారు ఆగిపోతుంది. ఇంజిన్ లోనుంచి పొగలు వస్తాయి. కారును తోయమని తల్లిని శ్రుతి అడుగుతుంది. ఓ దొంగ వచ్చి కారు తోస్తానని చెప్పి శ్రుతి హ్యాండ్ బాగ్ తీసుకుని పారిపోతాడు. రూ.50 వేలు దొంగపాలయ్యాయని శ్రుతి, కామాక్షి ఫీల్ అవుతారు.

క్రాంతి ఫైర్

కిచెన్ లో శాలిని చేయి తగిలి గ్లాస్ మగ్ కింద పడిపోతుంది. ఆ గ్లాస్ ముక్కలు తీస్తుంటే జగదీశ్వరి చేయి తెగి రక్తం వస్తుంది. క్రాంతి, రఘురాం పరుగెత్తుకుంటూ వస్తారు. మా అమ్మను చంపాలని చూశావా? చెప్పవే రాక్షసి. నీ వల్లే జరిగిందని ఎందుకు చెప్పావు? ఇంటిల్లిపాదిని చంపడానికి మళ్లీ ఏమైనా ప్లాన్ చేశావా? అని శాలినిపై క్రాంతి ఫైర్ అవుతాడు.

శాలిని ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. మొసలి కన్నీళ్లు పెడుతుంది. అందరు కలిసి నన్ను తిట్టండి. ఇప్పుడు నిజంగా మంచిదానిలా మారిపోతే నమ్మట్లేదు. మాయ కూడా నిలదీస్తోంది. నా మనసుకు బాధగా ఉండదా? అని శాలిని అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More