Ninnu Kori March 26 Episode:నిన్ను కోరి: జగదీశ్వరి ప్రాణత్యాగం? సిద్ధాంతిని గన్‌తో బెదిరించిన సునంద.. చంద్రకళ బిడ్డ గండం

Ninnu Kori March 26 Episode: చంద్రకళ కడుపులో బిడ్డతో జగదీశ్వరికి ప్రాణ గండం ఉందని సిద్ధాంతి చెప్పడం వెనుక సునంద కుట్ర ఉంటుంది. అది తెలిసి శాలిని గంతులేస్తుంది. ఏ ప్రాణం కాపాడుకోవాలని చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బిడ్డ కోసం తన ప్రాణాలు వదులుకునేందుకు సిద్ధమని జగదీశ్వరి చెప్తుంది.

Published on: Mar 26, 2026, 07:40:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 26 ఎపిసోడ్ లో.. సిద్ధాంతిని శాలిని తల్లి సునంద కలుస్తుంది. మీరే నా సమస్య సిద్ధాంతి. మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగిన శాలిని నా కూతురు. ఆమె చెప్పిన విషయం మీరు అంగీకరించలేదని తెలిసింది. కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం వల్ల తప్పులు చేయాలి. మీ కూతురు చస్తే తప్పు చేస్తారా? అని సునంద వార్నింగ్ ఇస్తుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

బెదిరించిన సునంద

మీ కూతురు బెంగళూరులో జాబ్ చేస్తోంది. మీ భార్య ఇప్పుడు రైతు బజార్ లో కూరగాయలు కొంటుంది. వీళ్లకు ఏమైనా అయితే ఎలా అని సిద్ధాంతిని సునంద బెదిరిస్తుంది. గన్ తీసి గురి పెడుతుంది. భయపడ్డ సిద్ధాంతి జాతకం తప్పుగా చెప్పేందుకు ఒప్పుకొంటాడు. ఆ తర్వాత రఘురాం ఇంటికి వెళ్లి చంద్రకళ కడుపులో బిడ్డతో జగదీశ్వరికి ప్రాణగండం ఉందని అబద్ధం చెప్తాడు.

శాలిని సైకో ఆనందం

సునందను కలిసిన శాలిని సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయిందని శాలిని చెప్తుంది. ఏ కన్ను పొడుచుకోవాలో తెలియక చంద్ర ఏడుస్తుంది. క్రాంతి ఒక్కడే నమ్మలేదు. కానీ ఫ్యామిలీ అంతా ఎమోషనల్ పూల్స్ కదా. వెళ్లి ఇంట్లో జరిగే తమాషా చూడాలని శాలిని వెళ్లిపోతుంది.

కారంగా చేపల పులుసు

మరోవైపు శ్రుతి చేపల పులుసు ప్రిపేర్ చేస్తుంది. మొదటి సారి కోడలి చేతి వంట రుచి చూడబోతున్నానని సరోజ ఎదురు చూస్తుంది. తీరా చూస్తే అన్నం కిచిడీ అవుతుంది. పులుసులో చేపలు కనిపించడం లేదని రాజ్ అడుగుతాడు. బాగా ఉడికించాను కాబట్టి అందులోనే కలిసిపోయాయని శ్రుతి చెప్తుంది. నోట్లో ముద్ద పెట్టుకోగానే కారం అంటూ రాజ్, సరోజ హడలెత్తిపోతారు.

చంద్ర కన్నీళ్లు

ఇక సిద్ధాంతి చెప్పిన మాటలు తలుచుకుంటూ చంద్రకళ ఏడ్చేస్తుంది. దేవుడికి మొర పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన జగదీశ్వరి కూడా ఫీల్ అవుతుంది. ఇంటి వారసుడి కోసం అత్తయ్య, మామయ్య ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోరిక తీర్చే అవకాశం నాకు వచ్చినందుకు సంతోషపడ్డా. కానీ ఇప్పుడు ఏ ప్రాణాన్ని కాపాడుకోవాలి? అని దేవుడి ముందు చంద్ర బాధపడుతుంది.

నాకు రెండు ప్రాణాలు ముఖ్యమే. ఒక్క ప్రాణాన్ని ఎంచుకోమనడం అన్యాయం స్వామి. నా భర్తకు ఎలా చెప్పగలను? ఆయన ఎలా తట్టుకుంటారు? అని చంద్ర ఏడ్చేస్తుంది. చంద్ర దగ్గరకు జగదీశ్వరి వెళ్తుంది.

ప్రాణాలు వదిలేయడానికి

ఏం జరగాలని రాసి ఉంటే, అదే జరుగుతుంది. నీ స్థానంలో ఎవరున్నా అత్త ప్రాణాల కంటే బిడ్డ ప్రాణాలే ముఖ్యమని కోరుకుంటారు. కానీ నువ్వు నా ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు. నా బిడ్డ కోసం, వాడికి పుట్టబోయే బిడ్డ కోసం ప్రాణాలు వదలేయడానికి సంతోషంగా సిద్ధపడతానని జగదీశ్వరి అంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం పోవాల్సిందేనని చెప్తుంది.

నా తర్వాత ఈ ఇంటిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావనే నమ్మకం నాకుంది. నాకు ఏ బాధ లేదని చంద్రతో జగదీశ్వరి చెప్తుంది. మరోవైపు క్రాంతి కోసం శాలిని షర్ట్ తీసుకువస్తుంది. అసలు మనిషివేనా నువ్వు? ఇంట్లో అందరు ఏ మూడ్ లో ఉన్నారు? నువ్వు ఏం చేస్తున్నావని క్రాంతి ఫైర్ అవుతాడు. ఇక్కడతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More