Ninnu Kori March 24th Episode: నిన్ను కోరి- జగదీశ్వరి ఇంటికి సిద్ధాంతి- చంద్రకళకు బిడ్డ పుడితే ప్రాణనష్టం-శాలిని గొప్పలు

Ninnu Kori Serial March 24th Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 24 ఎపిసోడ్‌లో రఘురాం రాసుకున్న పేపర్ చూసి ఎవరి గురించి భయపడుతున్నారని శాలిని ఆలోచిస్తుంది. తనకు వచ్చిన కల గురించి చంద్రకళ చెబితే ఇంటికి సిద్ధాంతిని పిలిపిస్తారు. చంద్రకు బిడ్డ పుడితే ఇంట్లో ప్రాణనష్టం జరుగుతుందని సిద్ధాంతి చెబుతాడు.

Published on: Mar 24, 2026, 09:26:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం ఏదో ఆలోచిస్తుంటే శాలిని చూస్తుంది. బుక్‌లో రాసుకుంది రఘురాం చదువుతాడు. అది శాలిని వింటుంది. నేనేంటీ ఇలా రాసుకున్నా. జగదీశ్వరికి ఈ విషయం తెలియద్దు అని పేపర్ చింపి పాకెట్‌లో పెట్టుకుంటుండగా గాలికి ఎగిరిపోతుంది.

నిన్ను కోరి సీరియల్ మార్చి 24 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ మార్చి 24 ఎపిసోడ్‌

రొమాంటిక్‌గా క్రాంతి, శాలిని

ఆ పేపర్ వెంట రఘురాం పడతాడు. అదే పేపర్ కోసం శాలిని చూస్తుంటే ఇంతలో క్రాంతి అడ్డుపడతాడు. శాలిని కిందపడబోతుంటే క్రాంతి పట్టుకుంటాడు. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. తర్వాత శాలినిని కింద పడేస్తాడు. ఇంతలో రఘురాం వచ్చి పేపర్ కోసం వెతుకుతున్నా అంటాడు. అదేంటో చెప్పబొతుంటే ఫ్లవర్ వాజ్ కింద పడేస్తుంది శాలిని.

దాంతో మర్చిపోతాడు రఘురాం. ఏ పేపర్ కోసం వెతుకున్నారని క్రాంతి అడిగితే.. ఏ పేపర్ అని రివర్స్‌లో అడుగుతాడు రఘురాం. న్యూస్ పేపర్ అని శాలిని చెబుతుంది. న్యూస్ పేపర్ ఇవ్వడంతో రఘురాం వెళ్లిపోతాడు. కిందపడిన పేపర్ తీసుకుని చూసిన శాలిని ఎవరికి ప్రాణపాయం ఉంది. నేను వేసిన ప్లాన్ తెలిసిపోయిందా అని కంగారుపడుతుంది శాలిని.

మరోవైపు చంద్రకళ పరుగెత్తుకుంటూ వచ్చి విరాట్‌కు యాక్సిడెంట్ అయినట్లు పీడకల వచ్చిందని భయంతో చెబుతుంది. దాంతో అది కల, కంగారుపడకని జగదీశ్వరి వాళ్లు చెబుతారు. తెల్లవారు వచ్చే కల నిజమవుతుందంటారు. ఇప్పటివరకు ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చంద్రకళ అంటుంది. తిరిగి తిరిగి అలసిపోయి పడుకుని ఉంటాడు. ఇంత పొద్దున లిఫ్ట్ చేస్తారా అని కామాక్షి అంటుంది.

సిద్ధాంతికి చూపిద్దాం

అంతా చంద్రను ఓదార్చుతారు. కల కాదు కానీ జరిగేది చూస్తుంటే విరాట్‌కు టైమ్ బాగా లేదు. ఇద్దరి జాతకాలు సిద్ధాంతి గారికి చూపించి దోషం ఉంటే పరిహారం చేయిస్తే మంచిదని శ్యామల చెబుతుంది. జగదీశ్వరి సరేనంటుంది. సిద్ధాంతి గారిని పిలిపిస్తారా. సరే పిలిపించండి అని శాలిని అనుకుంటుంది. తర్వాత శాలిని ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు.

నీకు నీ భర్త బాగా సపోర్ట్ అనుకుంటా అని ఫ్రెండ్స్ అంటే.. లేదు మాదాంట్లో రివర్స్. నేను చెప్పడంతోనే క్రాంతి బిజినెస్ చేస్తున్నాడు. నేను ఎంకరేజ్ చేయడం వల్లే అతను బిజినెస్ ట్రిక్స్ చెప్పానని, నా పర్మిషన్ లేకుండా ఏం చేయడు, నా సైన్ లేకుండా కంపెనీలో ఒక్క ఫైల్ కూడా ముందుకు వెళ్లదని గొప్పలు పోతుంది శాలిని. ఆ మాటలు క్రాంతి విని షాక్ అవుతాడు.

ఇంతలో క్రాంతి వచ్చి పేపర్స్ మీద సంతకం కావాలంటాడు. దాంతో శాలిని సైన్ చేస్తుంది. చెప్పానుగా నా సైన్ లేకుండా ఏం జరగదని శాలిని అంటుంది. ఇక నుంచి నీకు ఆ శ్రమ ఉండదని క్రాంతి అంటాడు. క్రాంతిని పొగుడుతారు శాలిని ఫ్రెండ్స్. అంత పొగడకండి. శాలిని పార్టనర్‌షిప్ నుంచి తీసేస్తున్నా. ఈ శాలిని చెప్పింది అంతా అబద్ధం. తను నా పాలిట దాపురించిన శని శాలిని నిజస్వరూపం గురించి చెప్పేసి వెళ్లిపోతాడు క్రాంతి.

రాజ్‌కు శ్రుతి షాక్

గొప్పలు చెప్పడం ఇకనైనా ఆపు అనేసి వెళ్లిపోతారు శాలిని ఫ్రెండ్స్. మరోవైపు శ్రుతి చెప్పిన సరుకుల లిస్ట్ చూసి ఆశ్చర్యపోతుంది సరోజ. శ్రుతి తిండి చూసి దిష్టి తగులుద్ది, తక్కువ తినమంటుంది సరోజ. అత్తాకోడళ్లు ఇద్దరు వాదించుకుంటారు. ఇంతలో రాజ్ వచ్చి శ్రుతికి సపోర్ట్ చేస్తాడు. ఇంకో ప్లేట్ బోండా తెప్పించమంటుంది శ్రుతి. దీనికి మాత్రం సిగ్గే పెట్టలేదు దేవుడు అని రాజ్ అంటాడు.

సరే అకౌంట్‌లో ఎంత ఉంది. అప్పులు తీర్చాలని రాజ్ అంటాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని శ్రుతి అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. మరోవైపు జగదీశ్వరి ఇంటికి సిద్ధాంతి వస్తాడు. విరాట్ యాక్సిడెంట్ గురించి, క్రాంతి, రఘురాం భయపడటం గురించి చెబుతుంది శ్యామల.

చంద్రకళ బిడ్డతో ప్రాణ నష్టం

జాతకాలు చూసిన సిద్ధాంతి చంద్రకళ కడుపులోని బిడ్డ భూమ్మీద పడితే ఇంట్లో ప్రాణ నష్టం జరుగుతుందని సిద్ధాంతి చెబుతాడు. అంటే చంద్రకళకు నష్టజాతకుడు పుడతాడని చెబుతాడు సిద్ధాంతి. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More