Ninnu Kori March 14th Episode: నిన్ను కోరి- బెడిసికొట్టిన సునంద ప్లాన్- పోలీసులకే వార్నింగ్- చంద్రకళకు అత్తమామ గిఫ్ట్!
Ninnu Kori Serial March 10th Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 14 ఎపిసోడ్‌లో రఘురాం ఇంటికి పోలీసులను పంపించి విరాట్‌ను విచారణ జరిపించేలా సునంద, శాలిని ప్లాన్ వేస్తారు. కానీ, అది బెడిసికొడుతుంది. రివర్స్‌లో పోలీసులకే వార్నింగ్ ఇప్పిస్తాడు క్రాంతి. చంద్రకళకు అత్తమామలు మొదటి గిఫ్ట్ ఇస్తారు.
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మాయ తమలో కలిసిపోయినందుకు జగదీశ్వరి అంటుంది. మీరే నన్ను కలుపుకున్నారు ఆంటీ అని మాయ అంటుంది. ఇక్కడ అందరు తనను ఇన్‌స్పైర్ చేస్తున్నారు అక్క అని చంద్రకళను పిలుస్తుంది మాయ.

నేను ఒక్కదాన్నే పిలవాలి
నన్ను అక్క అని పిలువు. కానీ, మా ఆయన్ను బావ అని పిలవకు. ఆయన్ను నేను ఒక్కదాన్నే ప్రేమగా బావ అని పిలవాలని నా కోరిక అని చంద్రకళ చెప్పి వెళ్లిపోతుంది. మాయ నవ్వుతుంది. మరోవైపు శాలినికి తల్లి కాల్ చేస్తుంది. నీకో గుడ్ న్యూస్. కాసేపట్లో మీ ఇంటికి పోలీసులు వస్తారు. నీలిమ ప్రమోదుల చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాను. విరాట్‌ను విచారించేందుకు పోలీసులు వచ్చి రచ్చ రచ్చ చేస్తారని తల్లి సునంద చెబుతుంది.
కానీ, ఆ విరాట్ ఇంట్లో లేడు అని శాలిని అంటుంది. ఆ పోలీసులే విరాట్‌ను పిలిపిస్తారు. ఆ ఇల్లంతా బాధతో కుమిలిపోతుంది. ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఈ ల్యాండ్ ఇష్యూని అడ్డుపెట్టుకుని వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేద్దామని సునంద అంటుంది. తర్వాత విరాట్ కోసం పోలీసులు వస్తారు. ఇంట్లో విరాట్ లేడని క్రాంతి చెబుతాడు.
నకిలి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ల్యాండ్ కొన్నారు. మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకే విచారిద్దామని వచ్చామని పోలీస్ అంటాడు. అసలు మీకు వారెంట్ ఉందా. మీరు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారా అని రఘురాం, తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్న వాళ్లు లంచం ఇస్తే వచ్చినట్లున్నారని జగదీశ్వరి అంటారు.
లీగల్‌గానే హ్యాండిల్ చేస్తాం
మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఫేక్ అని మీరు ఎలా చెబుతారు. మేము కూడా దీన్ని లీగల్‌గానే హ్యాండిల్ చేస్తాం అని చంద్రకళ అంటుంది. ఓహో అంతా సిద్ధంగా ఉన్నారన్నమాట. అంతా కలిసే పేదవాడి కడుపు కొట్టాలని చూస్తున్నారా. విరాట్‌ను పిలవండి అని ఎస్సై అంటాడు. మీకు ఎవరితో చెప్పించాలో చెప్పిస్తాను అని మినిస్టర్ పీఏకు కాల్ చేసిన క్రాంతి పోలీసుల విషయం చెబుతాడు.
కేసు బుక్ అవ్వకుండా ఇంటికి ఎలా వస్తారు. నేను మాట్లాడుతానను అని అతను మాట్లాడుతాడు. ఏంటయ్యా ఇద్దరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మీరెలా ఇన్వాల్వ్ అవుతారు. అది కోర్టు చూసుకుంటుంది. మీరు ఇన్వాల్వ్ అయితే నేను మినిస్టర్‌ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుందని అతను పోలీసులకు వార్నింగ్ ఇస్తాడు. దాంతో సారీ చెప్పేసి పోలీసులు వెళ్లిపోతారు.
ఇదంతా ఎవరో కావాలనే చేయిస్తున్నట్లుందని రఘురాం అంటాడు. మన శత్రువులు ఇంట్లోనే ఉన్నారని, మీ అమ్మే కదా ఇదంతా చేస్తుంది. ఆ డాక్యుమెంట్స్ కొట్టేసింది నువ్వే కదా అని క్రాంతి అంటాడు. శాలిని డ్రామా చేస్తుంది. దీని వెనుక మీ అమ్మ ఉందని నా నమ్మకం. అది తెలిసినరోజు నువ్వు ఇంట్లో ఉండవు అని క్రాంతి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
బెంగళూరుకు విరాట్
వీళ్లిద్దరి మధ్య ఇంత గొడవ ఉందా అని డౌట్ పడుతుంది మాయ. తర్వాత రాత్రికి విరాట్ వచ్చి తనకు ల్యాండ్ అమ్మిన వ్యక్తి బెంగళూరుకు వస్తున్నారని, హైదరాబాద్ రాడానికి ముందే తానే వెళ్లి కలుస్తానని చెబుతాడు విరాట్. ఇప్పుడే వెళ్తానని, చంద్రను చూసుకోమ్మని చెబుతాడు విరాట్. చంద్రకు ఏ లోటు రాదని శ్యామల హామీ ఇస్తుంది.
మన ప్లాన్ బెడిసికొట్టిందమ్మా. పోలీసులు రావడంతో విరాట్‌కు బెంగళూరు వెళ్లాలన్న ఆలోచన కూడా వచ్చింది అని తల్లి సునందకు చెబుతుంది శాలిని. అక్కడ విరాట్‌కు ఏదైనా చేస్తే అని సునంద అంటే.. వద్దని చెప్పిన శాలిని ముందు క్రాంతిని డైవర్ట్ చేయాలంటుంది. ముందు విరాట్ సైన్ తీసుకోకుండా ఆపాలి అని సునంద అంటుంది. ఏం జరిగినా మన పేర్లు రాకుండా చూసుకో అని శాలిని చెబుతుంది.
విరాట్ వెళ్తాడు. చంద్రకళకు జాగ్రత్తలు చెబుతాడు. చంద్రకళను జాగ్రత్తగా చూసుకుంటానని, తనను కాపాడినందుకు రుణం తీర్చుకుంటానని మాయ చెబుతుంది. విరాట్ వెళ్లిపోతాడు. మాయ ఏదో రాసి ఈ పాయింట్స్ చంద్రతో డిస్కస్ చేయాలనుకుంటుంది. ఇంతలో హాల్లోకి చంద్రకళను పిలిచిన జగదీశ్వరి నెక్లెస్ చూపిస్తుంది. అది చాలా బాగుందని చంద్ర అంటే.. నీకోసమే తీసుకున్నామని చెబుతాడు రఘురాం.
నా ఇంటికి గిఫ్ట్‌గా వారసుడు
ఈ అత్తమామల తరఫు నుంచి నీకు చిన్న కానుక అని జగదీశ్వరి చెబుతుంది. నా ఇంటికి వారసుడిని అందిస్తూ పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అందుకోసం ఈ మాత్రం గిఫ్ట్ ఇవ్వొద్దా అని రఘురాం అంటాడు. ఏదో ఒకరోజు శాలినిలాగే చంద్ర కూడా ఈ ఇంటిని ముంచేస్తుందని కామాక్షి అనుకుంటుంది. అంతా వెళ్లిపోతారు. నైస్ డిజైన్, నెక్లెస్ చాలా బాగుందని మాయ అంటుంది.
ఇష్టమైనవి సొంతం అవడమే కష్టం అని కామాక్షి వెళ్లిపోతుంది. గదిలోకి వెళ్లి విరాట్ ఫొటో ముందు నెక్లెస్ చూపిస్తూ అత్త మామ నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇది. నువ్వు వచ్చాకా నీతో చేయించే మొదటి పని ఇది నీ చేత్తో మెడలో వేయించుకోవడమే అని చంద్రకళ చెబుతుంది. నెక్లెస్ బెడ్‌పైనే పెట్టి పైన ఆరేసిన బట్టలు తీసుకురావాలని వెళ్లిపోతుంది చంద్రకళ.
చంద్రకళ అరుపులు
ఇంతలో మాయ చంద్రకళ గదిలోకి వచ్చి నెక్లెస్ చూస్తుంది. అది చూసి తన మెడలో వేసుకుని అద్దంలో చూస్తూ మురిసిపోతుంది. అది చూసిన చంద్రకళ మాయను చూసి అరుస్తుంది. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తిడుతుంది చంద్రకళ. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


