Ninnu Kori March 25 Episode: నిన్నుకోరి.. అత్త ప్రాణాలా? కడుపులోని బిడ్డనా? చంద్రకళకు అగ్నిపరీక్ష.. శాలిని కుట్ర
Ninnu Kori March 25 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 25 ఎపిసోడ్ లో సిద్ధాంతి బిగ్ షాక్ ఇస్తాడు. చంద్రకళ కడుపులో ఉన్న బిడ్డ వల్ల ఇంటి పెద్ద అయిన జగదీశ్వరి ప్రాణాలు పోతాయని బాంబ్ పేలుస్తాడు. దీంతో చంద్రకళ ఏడుస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 25 ఎపిసోడ్ లో.. మా అన్నయ్య కుటుంబం ఎందుకు సమస్యలతో ఇబ్బంది పడుతుందని సిద్ధాంతిని శ్యామల అడుగుతుంది. ముందు నా జాతకం చూసి కాపురం నిలబడాలంటే ఏ పరిహారం చేయాలో చెప్పండని శాలిని అడుగుతుంది. పాపాలకు పరిహారాలు ఉండవని క్రాంతి సీరియస్ అవుతాడు.

ప్రాణ నష్టం
విరాట్, చంద్రకళ జాతకాలను సిద్ధాంతికి చూపిస్తారు. చంద్రకళ కడుపులో ఉన్న బిడ్డ భూమ్మీద పడితే ఈ ఇంట్లో ప్రాణ నష్టం సంభవిస్తుందని సిద్ధాంతి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. కొంపదీసి ఆ ప్రాణం గండం విరాట్ కు ఉందా ఏంటీ? అని మాయ అంటుంది. రఘురాం కూడా ప్రాణాపాయం ఉందని అంటాడు.
నానమ్మ ప్రాణాలు
ఆ గండం తప్పించడానికి ఎలాంటి పరిహారమైనా నేను చేస్తా. ఆయనకు ఏ చిన్న హానీ జరగకూడదని చంద్ర అడుగుతుంది. ప్రాణ గండం ఉంది ఆ బిడ్డ తండ్రికి కాదు, ఈ ఇంటి పెద్ద ప్రాణానికి అని సిద్ధాంతి చెప్తాడు. వారసుడి రాకవల్ల నానమ్మ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని సిద్ధాంతి బాంబ్ పేలుస్తాడు.
శాలిని ప్లాన్
అయితే అంతకుముందే శాలిని వెళ్లి సిద్ధాంతిని కలుస్తుంది. చంద్రకళకు పుట్టబోయే బిడ్డవల్ల అత్తయ్యకు ప్రాణగండం ఉందని చెప్పాలని సిద్ధాంతిని అడుగుతుంది. అప్పుడు సిద్ధాంతి కోప్పడతాడు. తల్లి సునంద కాల్ చేస్తే శాలిని జరిగింది చెప్తుంది. ఈ సిద్ధాంతి వినడం లేదని అంటుంది. ఎలాగైనా వర్కౌట్ చేయొచ్చని సునంద అంటుంది.
చంద్ర కన్నీళ్లు
తాను చెప్పమన్నట్లే సిద్ధాంతి చెప్పడంతో శాలిని ఆలోచనలో పడుతుంది. బిడ్డబోయే బిడ్డ వల్ల మా అమ్మకు ప్రాణ గండం ఉందా? అలా ఎక్కడైనా ఉంటుందా? నాన్సెన్స్ కాకపోతే అని క్రాంతి అంటాడు. నేను చెప్పేవన్ని నిజాలే. ఏదో ఒక ప్రాణమే నిలుస్తుంది. దీనికి ఏ పరిష్కారం లేదని సిద్ధాంతి వెళ్లిపోతాడు. చంద్రకళ ఏడుస్తూ కూలబడిపోతుంది.
జగదీశ్వరి కోపం
ప్రమాదానికి నీ కడుపులోనే ప్రాణం పోస్తున్నావని సిద్ధాంతి చెప్పారు. ఏం చేస్తావ్ చంద్ర అని కామాక్షి అడుగుతుంది. ఏ ప్రాణాన్ని కాపాడుకుంటుందో నిర్ణయించుకోవాల్సింది చంద్ర కదా అని కామాక్షి అంటుంది. ఓ ప్రాణం ఎప్పుడు భూమి మీదకు రావాలి? ఎప్పుడు వదిలి వెళ్లాలని నిర్ణయించేది ఆ దేవుడు. సందర్భం దొరికిందని చంద్ర మనసు నొప్పించాలని చూడకు అని కామాక్షిపై జగదీశ్వరి కోప్పడుతుంది.
ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిదని జగదీశ్వరి చెప్తుంది. అత్తయ్య ప్రాణాల కోసం నా కడుపులో బిడ్డను చంపేసుకోవాలా? అని శ్యామలతో చెప్తూ చంద్ర ఏడ్చేస్తుంది.
శ్రుతి వార్నింగ్
మరోవైపు సరోజ, శ్రుతి మళ్లీ మాటలతో పోట్లాడుకుంటారు. మా బతుకులకు దరిద్రంలా దాపురించావని శ్రుతిని సరోజ తిడుతుంది. కేసులు పెడతానని శ్రుతి వార్నింగ్ ఇస్తుంది. ఆన్ లైన్లో చూసి వెరైటీగా వండుతానని శ్రుతి చేపలు తీసుకుంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


