...
...
Next Story

నిన్ను కోరి డిసెంబర్ 19 ఎపిసోడ్: చంద్రకళతో విరాట్ గొడవ- బావకు ఎదురుతిరిగిన చంద్ర- క్రాంతికి దగ్గరయ్యేందుకు మైండ్ గేమ్

నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో తనపై నింద పడేలా శాలినీనే ప్లాన్ చేసిందని విరాట్‌తో చెబుతుంది చంద్రకళ. దాంతో ఇద్దరు గొడవ పడినట్లు అందరి ముందు నటిద్దామని, దాంతో క్రాంతికి దగ్గర కావచ్చని విరాట్ మైండ్ గేమ్ చెబుతాడు. అనుకున్నట్లుగానే ఇద్దరు గొడవ పడతారు. శాలిని తప్పా అంతా నమ్ముతారు.

Published on: Dec 19, 2025, 13:57:59 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏదో శ్రుతికి తాళి కట్టారు కదా అని ఏమనట్లేదు. తల్లివి అయిండి కొడుకుని సరిదిద్దగా సపోర్ట్ చేస్తావా. శ్రుతికి అన్యాయం చేయాలని చూస్తే నాలో తేడాను చూస్తారు అని చంద్రకళ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత చంద్రకళను విరాట్ తిడతాడు. నాకు ముందే చెప్పి ఉండొచ్చుగా అంటాడు. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారు. అదంతా శాలిని చేసిందని చంద్రకళ అంటుంది.

డౌట్ రాకుండా ప్లాన్

నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌

శాలిని ఇందాక కలిసింది. ఆ అబ్బాయి గురించి శాలినికి ముందే తెలుసు, నేను నీ గురించి ఆశలు వదిలేసుకోమన్నది కూడా తెలుసు అని అంతా చెబుతుంది చంద్రకళ. చిన్న డౌట్ రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసింది. తనను బాగా అర్థం చేసుకుంది. నేనే అర్థం చేసుకోలేదు అని చంద్రకళ అంటుంది. ఇంత చేస్తున్న శాలినినే క్రాంతి నమ్ముతున్నాడు. ఏం చేస్తే వాడు నమ్ముతాడు అని విరాట్ అంటాడు.

క్రాంతిని మార్చడం అసాధ్యం అని మాట్లాడుకుంటారు. నువ్వు నన్ను అపార్థం చేసుకోవాలనే ఈ ప్లాన్ చేసిందని చంద్రకళ చెబుతుంది. అయితే ఇప్పుడు చేసుకుంటాను. శాలిని అనుకున్నట్లుగానే నేను నిన్ను ద్వేషిస్తాను. క్రాంతిని నమ్మించాలి అంటే మనమధ్య గొడవలు జరగాలి. జరిగినట్లు మనం నటించాలి. అలా చేసి మీ వదిన తప్పు చేసిందని క్రాంతికి చెబితే వాడు నన్ను నమ్ముతాడని విరాట్ అంటాడు.

శాలినికి భయం కలుగుతుంది

మేమిద్దరం కలిసిపోతే శాలినికి భయం కలుగుతుంది. ఆ భయంతో తప్పు చేస్తుంది. ఆ తప్పును క్రాంతికి తెలిసేలా చేస్తాను అని మైండ్ గేమ్ అంతా వివరంగా చెబుతాడు విరాట్. నువ్వు చేసినదానికి ప్రతికారం రూమ్‌లోకి వచ్చాకా తీర్చుకుంటానంటుంది చంద్రకళ. దాంతో ఇద్దరు నవ్వుకుంటారు. తర్వాత ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇద్దరు.

ఇంతలో చంద్ర వచ్చి రాజ్‌కు టవల్ ఇస్తుంది. చంద్ర అడ్వైజ్ ఇవ్వడం తప్పు కాదు. పెళ్లి జరుగుతుందని తెలిసిన మనకు చెప్పకపోవడం తప్పు అని కోప్పడతాడు. ఇంతలా కోప్పడుతున్నారు. ఇది నిజమా అబద్ధమా అని శాలిని డౌట్ పడుతుంది. ఒకరు మోసపోతే తప్పా ఎవరేంటో తెలిసి రాలేదని క్రాంతి అంటాడు.

ఎదురుతిరిగిన చంద్ర

క్రాంతి భుజంపై చేయి వేసి శ్రుతి గురించి జాలి పడినట్లు చేస్తాడు విరాట్. నువ్వు ఇలా అంటే నాకు ఏడుపొస్తుంది అని చంద్రకళ అంటుంది. మరి శ్రుతి, కామాక్షి అత్త ఏడుపు సంగతేంటీ. నువ్వు ఇంకా వీళ్లకు మర్యాదలు చేస్తే ఏంటీ అర్థం అని విరాట్ అంటాడు. ఇంటి తాళాలు అత్తయ్య నాకు ఇచ్చారు. నన్ను ఆపే హక్కు మీకు లేదు అని చంద్రకళ అంటుంది.

దాంతో అంతా షాక్ అవుతారు. నా భర్త కూడా నాపై ద్వేషంతోనే తాళి కట్టాడని చంద్రకళ అంటుంది. విరాట్ కూడా ఎమోషనల్‌గా మాట్లాడుతాడు. ఇంటి తాళాలు వెంటనే అమ్మకు ఇచ్చేయ్ అని విరాట్ అంటాడు. నేను ఇవ్వను అని చంద్రకళ వెళ్లిపోతుంది. నా చంద్ర నాతో అలా అంటూ ఎమోషనల్ అయినట్లు నటిస్తాడు విరాట్.

రాజ్ ఫస్ట్ నైట్ ప్లాన్

తర్వాత శ్రుతితో ఫస్ట్ నైట్ జరగాలి. అప్పుడు ఇంటికి అఫీషియల్‌గా అల్లుడు అవుతామని రాజ్ తల్లి చెబుతుంది. అందుకోసం జగదీశ్వరితో మాట్లాడుతానని రాజ్ తల్లి అంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks