...
...
Next Story

నిన్ను కోరి జనవరి 24 ఎపిసోడ్: కాపాడిన ట్యాబ్లెట్స్, శాలిని ఎదురుదాడి- బయటపడిన విరాట్ ప్లాన్- అన్నయ్యను నిలదీసిన క్రాంతి

నిన్ను కోరి సీరియల్ జనవరి 24 ఎపిసోడ్‌లో భోగి సందర్భంగా భార్యలకు భర్తలు టిఫిన్ వడ్డించాలని రఘురాం చెబుతాడు. అప్పుడు మంత్రి పీఏ మీటింగ్ గురించి విరాట్‌ను క్రాంతి అడగడంతో శాలినికి డౌట్ వస్తుంది. మంత్రి పీఏతో క్రాంతి మాట్లాడేలా చేస్తుంది శాలిని. దాంతో విరాట్‌ను నిలదీస్తాడు క్రాంతి.

Published on: Jan 24, 2026, 09:05:12 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ముగ్గులు వేసి భోగి మంట పెడతారు. ఆడవాళ్లందరూ రెడీ అవుతారు. చీరలో చంద్రకళ అందాన్ని చూసి ఫిదా అవుతాడు విరాట్. కాటుక తీసి చంద్ర నడుముకు దిష్టి చుక్క పెడతాడు విరాట్. శాలినికి మెడలో నగ పెట్టి బ్యూటిపుల్‌గా ఉన్నావంటాడు క్రాంతి.

ఇంటి ముందు భోగి మంటలు

నిన్ను కోరి సీరియల్ జనవరి 24 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జనవరి 24 ఎపిసోడ్‌

వయసు పెరుగుతున్న మొహంలో కళ తగ్గట్లేదు. మహాలక్ష్మీలా ఉన్నావని రఘురాం అంటాడు. అంతా భోగి మంట దగ్గరికి వస్తారు. శ్రుతి, జాలిరాజ్ కూడా వస్తారు. టిఫిన్ ఖర్చులు తగ్గుతాయని తొందరపెట్టి తీసుకొచ్చాడమ్మా అని కామాక్షితో శ్రుతి అంటుంది. రఘురాం భోగి మంట వెలిగిస్తాడు. అందరూ పిడకలు వేస్తారు.

చంద్రకళ, శాలిని ఒకేసారి వస్తారు. ఇకనైన నీ పాత పగలను భోగి మంటల్లో వేసి ప్రశాంతంగా గడుపు అని చంద్ర అంటే.. ఈ సంక్రాంతి పండుగలో మీకు సంతోషం లేకుండా చేస్తాను చూడు అని శాలిని ఛాలెంజ్ చేస్తుంది. అంతా భోగి మంట చుట్టూ చేరి ఆటాడుతారు. తర్వాత అంతా టిఫిన్‌కు కూర్చుంటారు. అయితే, పండుగ స్పెషల్‌గా ముందు ఆడవాళ్లు తిని తర్వాత మగవాళ్లు తినాలని రఘురాం అంటాడు.

చంద్రకు వడ్డించని విరాట్

భార్యలకు భర్తలే వడ్డించాలని రఘురాం చెబుతాడు. దాంతో అంతా అలాగే చేస్తారు. కానీ, విరాట్ మాత్రం వడ్డించడు. రఘురాం చెప్పడంతో నాన్న కోసం అలాగే చేస్తానని వడ్డిస్తాడు. కామాక్షి, శ్యామలకు కూడా రఘురాం వడ్డిస్తాడు. అలా భార్యలకు సేవలు చేస్తారు భర్తలు. ఇంతలో సడెన్‌గా నిన్న మంత్రి పీఏ గెస్ట్ హౌజ్‌కు వస్తున్నారని చెప్పావుగా. నా తరఫున సారీ చెప్పు అని క్రాంతి అంటాడు.

నేను చేసే ఎదురుదాడి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు అని శాలిని అనుకుంటుంది. టిఫిన్స్ చాలా బాగున్నాయని జాలి రాజ్ అంటే.. సిగ్గు లేకుండా ఆ తినడం ఏంటని తిడుతుంది శ్రుతి. మంచి స్ట్రాంగ్ కలిపి తీసుకురా అని తలపై సరదాగా కొట్టి వెళ్లిపోతాడు జాలి రాజ్. అది చూసిన చంద్రకళ ఏంటీ మీ సరసాలు. మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ తొలిగిపోయాయా అని సంతోషంగా అడుగుతుంది చంద్రకళ.

నా జీవితాన్ని నాశనం చేసినందుకు సంతోషంగా ఉన్నావుగా అని శ్రుతి కోప్పడుతుంది. కాపురం గురించి చద్రకళ చెబితే కామాక్షి వచ్చి నువ్వే చెప్పాలని సెటైర్లు వేస్తుంది. మరోవైపు ప్రతిదానికి మీ అన్నయ్య మీద ఎందుకు ఆధారపడటం. డైరెక్ట్‌గా మంత్రి పీఏకి కాల్ చేసి నువ్వే అడుగు అని క్రాంతికి చెబుతుంది శాలిని.

ఇరుక్కున్న విరాట్

దాంతో మంత్రి పీఏకి కాల్ చేసి అపాయింట్‌మెంట్ గురించి, అన్నయ్య చెప్పింది చెబుతాడు. మీ అన్నయ్య నాకు అసలు కాల్ చేయలేదు అని పీఏ అంటుంది. దాంతో వెళ్లి అన్నయ్య విరాట్‌ను నిలదీస్తాడు క్రాంతి. విరాట్ ఇరుక్కుంటాడు. అలా చంద్రకళ, విరాట్ ప్లాన్‌ను క్రాంతికి తెలిసేలా బయటపెట్టిస్తుంది శాలిని. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks