నిన్ను కోరి జనవరి 7 ఎపిసోడ్: చంద్రకు తాళి కట్టిన విరాట్- గతం గుర్తుచేసుకున్న రఘురాం- హ్యాపీగా పెళ్లి ఆటలు
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ లో రఘురాం, జగదీశ్వరి పెళ్లి రోజును రీక్రియేట్ చేస్తారు. చంద్రకళ మెడలో విరాట్ తాళి కడతాడు. ఇదంతా చూసి రఘురాం గతం గుర్తొస్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్యామలకు చంద్ర థ్యాంక్స్ చెప్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ లో నా చెల్లిగా ఎలా పుట్టావ్ జగదీశ్వరి అంటూ వరదరాజులు క్యారెక్టర్ లో ఉన్న క్రాంతి రెచ్చిపోతాడు. అన్నయ్య రఘురాం చాలా మంచోడు. తనంటే నాకు ప్రాణమని జగదీశ్వరి క్యారెక్టర్ లో ఉన్న చంద్రకళ చెప్తుంది. శవాల మీద నడిచైనా పరువు నిలబెట్టుకుంటానని రఘురాం లేరా అని కాలర్ పట్టుకుంటాడు వరదరాజులు.

తాళి కట్టిన విరాట్
అన్నయ్య కాలర్ వదులు. నా భర్త మీద చేయి వేస్తే ఊరుకోనని జగదీశ్వరి క్యారెక్టర్ లో ఉన్న చంద్రకళ చెప్తుంది. నేను బతికి ఉండగా ఈ పెళ్లి నువ్వు ఆపలేవని శ్యామల అంటుంది. శ్యామల డామినెన్స్ చేస్తుందని మధ్యలో కామాక్షిగా శ్రుతి వస్తే క్రాంతి తోసేస్తాడు. ఈ ఇంట్లో ఏనాటికైనా ప్రేమకు చోటు ఉంటుందని శ్యామల చెప్తుంది. విరాట్ తాళి తీసుకుని చంద్రకళ మెడలో కడతాడు.
గుర్తొచ్చిన గతం
జగదీశ్వరి ఆ తాళి తీసేయ్ అని క్రాంతి పైపైకి వెళ్తాడు. అప్పుడే ఒరే వరదరాజులు జగదీశ్వరి ఇప్పుడు నా భార్య అని రఘురాం అడ్డుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పెళ్లి ఎలా జరిగిందో నాకు గుర్తుకొచ్చిందని రఘురాం అంటాడు. ఈ ఐడియా ఇచ్చింది నేనేనని చంద్ర చెప్తుంది. జగదీశ్వరి థ్యాంక్స్ చెప్తుంది. మనం ఎదురీదిన సముద్రం ఒకటే అత్తయ్య అని చంద్ర అంటుంది.
ప్రేమ కావాలని
రఘురాం, జగదీశ్వరి దండలు మార్చుకుంటారు. నా వల్ల ఎన్ని బాధలు పడ్డా చేయి విడవకుండా తోడుగా ఉన్నావు. నేనే కాళ్ల మీద పడాలని భార్యతో రఘురాం అంటాడు. పరిస్థితుల వల్ల కష్టాలు ఎదుర్కున్నాం. కానీ మీ వల్ల కాదు. జన్మజన్మలకు మీ ప్రేమ కావాలని జగదీశ్వరి అంటుంది. మీ పెళ్లి చూడలేకపోయామన్న లోటు ఈ రోజుతో తీరిపోయిందని విరాట్, చంద్రతో రఘురాం అంటాడు.
జల్ రాజ్, శ్రుతి కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పటికైనా లైఫ్ ను సీరియస్ తీసుకుని మీ కాళ్ల మీద నిలబడి బతకడం అలవాటు చేసుకోండని రఘురాం అంటాడు. ప్రేమను, నిజాయతీని ఎప్పుడూ సపోర్ట్ చేస్తాం. మోసాన్ని సహించమని జగదీశ్వరి చెప్తుంది. కొత్త పెళ్లి దంపతుల్లా రఘురాం, జగదీశ్వరి ఆటలాడుతారు. అందరు కలిసి భోజనం చేస్తారు.
శ్యామలకు థ్యాంక్స్
శ్రుతి, రాజ్ వెళ్లిపోతారు. థ్యాంక్స్ పిన్నిగారు. మీ సహకారం వల్ల అందరి సమక్షంలో మా పెళ్లి జరిగింది. ఆ రోజు అత్తయ్య, మామయ్యలకు అండగా నిలబడి ఒక్కటి చేశారు. ఆ తర్వాత నాకు అండగా నిలబడి ఆయనకు దగ్గర చేశారు. ఈ రోజు తాళి కట్టించారు. మీ ఆశీర్వాదం ఫలించి మేం ఒక్కటవుతాం. మా ప్రేమ గెలుస్తుందని శ్యామలతో అంటుంది చంద్ర.
ఏంటో ఈ అమ్మాయి ప్రతి విషయాన్ని తనకు అనుగుణంగా అనుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తుంది. నేను అంత ఈజీగా పడిపోనని శ్యామల అనుకుంటుంది. గదిలో విరాట్ ను సంతోషంతో ముద్దు పెడుతుంది చంద్ర. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


