నిన్ను కోరి అక్టోబర్ 15 ఎపిసోడ్: తండ్రి గాయం నిజం దాచిన విరాట్-చంద్రనే చంపాలనుకుందన్న శ్యామల- విరాట్‌కు చెంప దెబ్బ
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో తండ్రి తలపై ఎవరో బలంగా కొట్టారని విరాట్ కు తెలుస్తుంది. ఈ నిజం చెప్పొద్దని డాక్టర్ ను రిక్వెస్ట్ చేస్తాడు విరాట్. కానీ శ్యామల ఆ మాటలు వింటుంది. చంద్రను ఈడ్చి పడేస్తుంది. విరాట్ ను జగదీశ్వరి కొడుతుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 15 ఎపిసోడ్ లో తండ్రి ఒరిజినల్ రిపోర్ట్స్ ను డాక్టర్ కు చూపిస్తాడు విరాట్. ఈ రిపోర్ట్ ప్రకారం మీ నాన్న తలకు తగిలిన గాయం మామూలుది కాదు. దెబ్బ తగిలిన చోట నరాలు చిట్లిపోయాయి. అది యాక్సిడెంటల్ గా పడిపోవడం వల్ల తగిలిన దెబ్బ కాదు. ఎవరో తల మీద కొట్టి ఉంటారని డాక్టర్ చెప్తుంది. ఆ మాటలు విన్న శ్యామల ఇది కచ్చితంగా చంద్ర చేసిన పని అనుకుంటుంది.

చంద్ర షాక్
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని విరాట్ డాక్టర్ ను రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు డాక్టర్ ఒప్పుకొంటుంది. మెడిసిన్ పని చేయడం లేదు వేరేవి రాసిస్తానని డాక్టర్ అబద్ధం చెబుతుంది. ఇంటికి వెళ్లాక చంద్రకళతో మాట్లాడతాడు విరాట్. నాన్న పడిపోవడానికి ముందు ఇంకా ఎవరైనా గదిలోకి వెళ్లారా? అని అడుగుతాడు విరాట్. చూడలేదని చంద్ర చెబుతుంది. నాన్నను ఎవరో తల మీద బలంగా కొట్టారని చెెప్తాడు. చంద్ర షాక్ అవుతుంది.
శ్యామల ఫైర్
నన్ను అనుమానిస్తున్నావా బావ అని అడుగుతుంది చంద్రకళ. నేను అనుమానించడం లేదని విరాట్ అంటాడు. ఇంకెవరు చేసి ఉంటారని చంద్ర అడిగితే, నువ్వే అని శ్యామల మధ్యలోకి వస్తుంది. తండ్రిపై మమకారం కంటే భార్యపై ప్రేమ ఎక్కువైంది. అబ్బా ఏం మందు పెట్టావే చంద్ర. ఎవరు చేశారనే విషయంలో నాకు డౌట్ లేదని చంద్రను లాక్కెళ్లి హాల్లో పడేస్తుంది శ్యామల. అందరినీ పిలుస్తుంది.
విరాట్ ను కొట్టిన జగదీశ్వరి
చంద్ర ఇదంతా చేసింది. అన్నయ్యకు స్పృహ వచ్చినప్పుడు ఆయన తల మీద గట్టిగా కొట్టారు. ఈ చంద్రే అన్నయ్యను చంపాలని చూసిందని శ్యామల అంటుంది. క్రాంతి, శాలిని కలిసి చంద్ర అలా చేసి ఉండదని అంటారు. విరాట్ కు డాక్టర్ చెప్పడం నేను విన్నానని శ్యామల చెప్తుంది. విరాట్ అత్తయ్య చెప్పింది నిజమా? అని జగదీశ్వరి అడుగుతుంది. చంద్ర తప్పు చేయదు అత్త అని విరాట్ అనగానే జగదీశ్వరి చెంప మీద కొడుతుంది.
దోషి తేలాలి
నిజం దాచినందుకు కొట్టానని జగదీశ్వరి అంటుంది. చంద్ర నేరం చేయడం మీరు చూశారా? మీరే చేసి ఉండొచ్చు కదా. శ్రుతి లేదా శాలిని చేసి ఉండొచ్చు కదా. ఎవరు ఎవరిని వెనకేసుకు రావడం లేదు. దోషి తేలిన రోజు మూల్యం చెల్లించాల్సిందేనని విరాట్ అంటాడు. అన్నయ్య మాట్లాడితే తన తప్పు బయటపడుతుందని చంద్రనే చేసిందని శ్యామల మళ్లీ అంటుంది.
జగదీశ్వరి వార్నింగ్
చంద్రను బయటకు గెంటేయాల్సిందేనని శ్రుతి, శ్యామల అంటారు. చంద్ర చంపాలనుకుంటే చలనం రాకముందే చేయొచ్చు కదా అని శాలిని అడుగుతుంది. నా భర్తను చంపాలని చూసినవాళ్లను తల, మొండెం వేరు చేసి గుమ్మానికి వేలాడదీస్తా. నిజం తెలిసే వరకు ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదని జగదీశ్వరి వార్నింగ్ ఇస్తుంది.
నాకెందుకో ఆ పని చేసింది చంద్ర కాదు నువ్వే అని నా డౌట్ అని శ్రుతితో కామాక్షి అంటుంది. తగిలిన చోట మళ్లీ తగిలితే గతం గుర్తొస్తుందని నా మీద ప్రయోగం కూడా చేశావు కదా అని కామాక్షి చెప్తుంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చంద్ర చేసిందని అనిపించడం లేదని కామాక్షి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


