Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ తన గతాన్ని పూర్తిగా మరిచిపోయి దాక్షాయని అనే కొత్త ఇంటికి చేరుకుంటాడు. దాక్షాయని విరాట్‌ను తన కొడుకు 'సామ్రాట్' అని పిలుస్తూ ఆప్యాయతగా చూసుకుంటూ ఉంటుంది.
చంద్రకళ ఆగ్రహం

తననెవరో సామ్రాట్ అంటున్నారని చాలా కన్‌ఫ్యూజ్ అవుతాడు విరాట్. మొదట అయోమయానికి గురైన విరాట్ ఆ తరువాత దాక్షాయని చూపించిన ఫోటోలు చూసి షాక్ అవుతాడు. వాళ్లు చెప్పేదే నిజమని, అదే తన నిజమైన కుటుంబం అని బలంగా నమ్ముతాడు సామ్రాట్.
ఇదంతా మదన్ చాటుగా గమనించి చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హాస్పిటల్‌కి వెళ్తాడు మదన్. అక్కడ డాక్టర్‌తో విరాట్ కనిపించకపోవడం గురించి, ఎవరో వచ్చి తీసుకెళ్లారనే విషయం గురించి చంద్రకళ మాట్లాడుతుంది. విరాట్‌ను అలా ఎలా ఎవరితోనే పంపిస్తారని డాక్టర్, హాస్పిటల్‌పై కోప్పడుతుంది.
మదన్ కాలర్ పట్టుకున్న చంద్రకళ
ఇంతలో హాస్పిటల్‌కు చంద్రగారు అంటూ మదన్ వస్తాడు. మదన్‌ను చూడగానే కోపంతో కాలర్ పట్టుకుంటుంది చంద్రకళ. విరాట్ గారిని చూసుకోమ్మని చెప్పానుగా. ఎక్కడికి వెళ్లారు. విరాట్‌ను ఎవరో తమ కొడుకు అని తీసుకెళ్లిపోయారు. ఇదంతా జరుగుతుంటే మీరేం చేస్తున్నారని బాధతో ఏడుస్తూ అడుగుతుంది చంద్రకళ.
మీరేం కంగారుపడకండి. విరాట్‌ను నేనేం వదిలేయలేదు. విరాట్ గారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు. విరాట్‌ను తీసుకెళ్లడం చూసి నేను ఫాలో అయ్యాను. దాక్షాయని కుటుంబం వాళ్లు తన కొడుకు సామ్రాట్ అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లింట్లోనే విరాట్ గారు ఉన్నారు అని విరాట్ పరిస్థితిని చంద్రకళకు వివరిస్తాడు మదన్.
నిజం చెప్పడం శ్రేయస్కరం కాదు
అంతేకాకుండా విరాట్ ప్రస్తుతం ఆ కొత్త కుటుంబాన్నే తనదిగా నమ్ముతున్నాడు అని మదన్ చెబుతాడు. దాంతో చంద్రకళ మరింత షాక్ అవుతుంది. బావకు ఎలాగైనా నిజం చెప్పి తన దగ్గరికి తెచ్చుకోవాలని చంద్రకళ అంటుంది. కానీ, అతనికి ఇప్పుడే నిజం చెప్పడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని డాక్టర్ హెచ్చరిస్తారు.
{{/usCountry}}అంతేకాకుండా విరాట్ ప్రస్తుతం ఆ కొత్త కుటుంబాన్నే తనదిగా నమ్ముతున్నాడు అని మదన్ చెబుతాడు. దాంతో చంద్రకళ మరింత షాక్ అవుతుంది. బావకు ఎలాగైనా నిజం చెప్పి తన దగ్గరికి తెచ్చుకోవాలని చంద్రకళ అంటుంది. కానీ, అతనికి ఇప్పుడే నిజం చెప్పడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని డాక్టర్ హెచ్చరిస్తారు.
{{/usCountry}}సామ్రాట్ ఇప్పుడు జగదీశ్వరి కుటుంబాన్నే తనదిగా నమ్ముతున్నాడు. మళ్లీ అతను నమ్మేందుకు బలంగా ఫొటోలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు సామ్రాట్ కాదు విరాట్ అని చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన బ్రెయిన్ ఒత్తిడికి గురవుతుంది. దాంతో తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెబుతాడు.
విరాట్ కేర్ టేకర్‌గా చంద్రకళ
కానీ, ఇలా తన భర్తను ఒంటరిగా వదలలేనని చంద్రకళ తేల్చి చెబుతుంది. విరాట్ కోసం మదన్‌తో కలిసి దాక్షాయని ఇంటికి 'కేర్ టేకర్' (Caretaker)గా వెళ్లాలని చంద్రకళ నిర్ణయించుకుంటుంది. డాక్టర్లు కూడా ఈ ప్లాన్‌కు అంగీకరిస్తారు.
మరోవైపు ఇంట్లో చంద్రకళ ప్రయాణానికి సిద్ధమవగా, జగదీశ్వరి, రఘురామ్ తదితరులు తీవ్ర విచారంతో మౌనంగా ఉంటారు. బిడ్డ కోసం వెతుకుతూ మొండిగా బెంగళూరు వెళ్లిన తన భర్తను ఒప్పించి తీసుకురావడానికే తాను వెళ్తున్నానని చంద్రకళ తన కుటుంబ సభ్యులకు చెబుతుంది.
చంద్రకళకు జగదీశ్వరి 3 నెలల గడువు
చంద్రకళ ఒంటరిగా వెళ్లడాన్ని జగదీశ్వరి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయినప్పటికీ చంద్రకళ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో, సరిగ్గా మూడు నెలల తర్వాత భర్త, బిడ్డతో సహా తమ ముందు ఉండాలనే కఠినమైన షరతుతో జగదీశ్వరి చంద్రకళను పంపిస్తుంది. అంటే చంద్రకళకు అత్త జగదీశ్వరి 3 నెలల గడువు ఇస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.