Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సామ్రాట్‌కు గతం గుర్తులేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అతని ఆస్తిని కాజేసేందుకు కుటుంబంలోనే కుట్రలు మొదలవుతాయి.
సామ్రాట్ ఆస్తిపై జీవన్ కన్ను

ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతున్న జీవన్‌ను, అతని స్నేహితులు వెటకారం చేస్తారు. సామ్రాట్ తిరిగి రావడంతో ఆస్తి మొత్తం నీకు దక్కకుండా పోయిందని హేళన చేస్తారు. దాంతో జీవన్ ఆవేశంతో చేతిలో ఉన్న గ్లాస్‌ను గోడకేసి కొడతాడు. సామ్రాట్‌కు గతం గుర్తుకురాకముందే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని తన దుర్బుద్ధిని ఫ్రెండ్స్ ముందు బయటపెడతాడు జీవన్.
తల్లి ప్రేమను చూసి కరిగిపోయిన విరాట్
సామ్రాట్‌తో కేశవ్ మాట్లాడటానికి ప్రయత్నించగా, దాక్షాయణి మధ్యలో వచ్చి తన కొడుక్కి సొంత చేతులతో టిఫిన్ తినిపిస్తుంది. "ఎంత ఎదిగినా కొడుకు నా దృష్టిలో పసిబిడ్డే" అంటూ దాక్షాయణి అంటుంది. దాక్షాయణి చూపిస్తున్న మాతృప్రేమను చూసి సామ్రాట్ రూపంలో ఉన్న విరాట్ మనసు కరిగిపోతుంది.
ఆస్తి కోసం చామంతి, గిరిజల కుట్ర
తల్లి కొడుకుల అనుబంధాన్ని చూసి జీవన్ మనసులోనే అసూయతో కుళ్లుకుంటాడు. గిరిజ తన కూతురు చామంతిని సామ్రాట్ చుట్టూ తిరుగుతూ అతని ప్రేమను పొందాలని నూరిపోస్తుంది. సామ్రాట్‌కు గతం గుర్తులేకపోవడమే తమకు సరైన సమయమని నీలగిరి భావిస్తాడు.
సామ్రాట్‌తో ఈ పెళ్లి జరిగితే దాక్షాయణి ఆస్తి మొత్తం తమ చేతికి వస్తుందని, సామ్రాట్ తమకు ఆస్తి తెచ్చిపెట్టే ఏటీఎమ్ మెషిన్ లాంటివాడని భావించి స్వార్థంతో కుట్రలు పన్నుతారు.
కుట్రదారులపై దాక్షాయణి ఆగ్రహం
మరోవైపు సామ్రాట్‌పై దాడి చేసిన వారిని అస్సలు వదిలిపెట్టనని, వెతికి పట్టుకుని తగిన శిక్ష విధిస్తానని దాక్షాయణి చంద్రకళతో అంటుంది. కొడుకు పరిస్థితి చూసి దాక్షాయణి కన్నీళ్లు పెట్టుకోగా, చంద్రకళ ఏమీ తెలియనట్లు కవర్ చేస్తూ తన ప్లాన్స్‌ను దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది.
ఆ తర్వాత చంద్రకళ మాటలు విన్న గిరిజ అనుమానంగా చూస్తుంది. నువ్వెవరు, ఎందుకు ఉన్నావని చంద్రకళను ప్రశ్నిస్తుంది. అదేంటండీ సామ్రాట్ గారిని మేమే కదా చూసుకోడానికి వచ్చింది అని మదన్ అంటాడు. సామ్రాట్‌ను చూసుకునేందుకు అబ్బాయివి నువ్వుంటే సరిపోతుందిగా కదా.. ఈ అమ్మాయి ఎందుకు అని గిరిజ ప్రశ్నిస్తుంది.
వెళ్లిపోయిన చంద్రను ఆపిన సామ్రాట్
{{/usCountry}}ఆ తర్వాత చంద్రకళ మాటలు విన్న గిరిజ అనుమానంగా చూస్తుంది. నువ్వెవరు, ఎందుకు ఉన్నావని చంద్రకళను ప్రశ్నిస్తుంది. అదేంటండీ సామ్రాట్ గారిని మేమే కదా చూసుకోడానికి వచ్చింది అని మదన్ అంటాడు. సామ్రాట్‌ను చూసుకునేందుకు అబ్బాయివి నువ్వుంటే సరిపోతుందిగా కదా.. ఈ అమ్మాయి ఎందుకు అని గిరిజ ప్రశ్నిస్తుంది.
వెళ్లిపోయిన చంద్రను ఆపిన సామ్రాట్
{{/usCountry}}దాంతో చంద్రకళ, మదన్ కంగారుపడిపోతారు. సామ్రాట్ కుటుంబసభ్యులు కరెక్టుగానే అడిగింది కదా అనుకుంటారు. నువ్వు వెళ్లిపో అమ్మాయి అని గిరిజ అంటుంది. దాంతో మరింత చంద్రకళ మరింత షాక్ అవుతుంది. ఇంట్లో ఉండేందుకు ఒప్పుకున్న దాక్షాయణి కూడా ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది.
ఇక చేసేది ఏం లేక సరేనని చంద్రకళ వెళ్తుంటుంది. ఇంతలో చంద్ర ఎక్కడికి వెళ్లదు అని సామ్రాట్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. చంద్రకళ ఆశ్చర్యపోతూ సంతోషిస్తుంది. చంద్ర లేకుండా నేను ఇక్కడ ఉండలేను అని సామ్రాట్ అంటాడు.
చామంతి టెన్షన్
దాంతో మరింత సంబరపడిపోతుంది చంద్రకళ. చంద్రకళ ఉంటే సమస్య వస్తుందనుకున్న గిరిజ కుట్రను సామ్రాట్ తిప్పికొడతాడు. సామ్రాట్‌ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్న చామంతి మాత్రం తెగ కంగారుపడిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.