OTT Telugu: యండమూరి వీరేంద్రనాథ్ కథతో.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
OTT Telugu: పాపులర్ రైటర్ యండమూరి వీరంద్రనాథ్ అందించిన కథతో తెరకెక్కిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. అదిరిపోయే సస్పెన్స్ తో డిజిటల్ ఆడియన్స్ ను ఈ చిన్న సినిమా ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ మూవీ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
OTT Telugu: సండే స్పెషల్ గా ఓ చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఆ సినిమానే.. ‘‘నిశ్శబ్ధం’’. ఇవాళ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.

నిశ్శబ్ధం ఓటీటీ
తెలుగు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్ధం’ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ మూవీ ఇవాళ (మే 31) డిజిటల్ రిలీజ్ అయింది. 42 నిమిషాల ఈ చిన్న సినిమా ఓటీటీ లవర్స్ ను అలరిస్తోంది.
కథాసుధాలో
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కథాసుధాలో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు నిశ్శబ్ధం మూవీ రిలీజైంది. ఈ చిత్రం కథను యండమూరి వీరేంద్రనాథ్ అందించడం విశేషం. తన కథలు, నవలలతో యండమూరి వీరేంద్రనాథ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.
సస్పెన్స్ డ్రామా
నిశ్శబ్ధం మూవీ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో సీనియర్ నటి సుధ, లావణ్య, జయంత్, రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆంథోని మట్టిపల్లి డైరెక్టర్. వైట్ లైట్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఉపేంద్ర సింగం ఈ నిశ్శబ్ధం మూవీని నిర్మించాడు.
నిశ్శబ్ధం స్టోరీ
తనకు ఇష్టం లేకుండా సింధు అనే అమ్మాయిని కొడుకు రాఘవ పెళ్లి చేసుకోవడంతో రమాదేవి మనస్తాపానికి గురవుతుంది. ఈ వివాహాన్ని అస్సలు అంగీకరించలేక ఆమె కొడుకు, కోడలికి దూరంగా ఉంటుంది. మరోవైపు, ఇంట్లో జరిగిన ఒక చిన్న ప్రమాదం తర్వాత సింధుకు తన అత్తగారిపై నెమ్మదిగా అనుమానం మొదలవుతుంది.
ప్రెగ్నెన్సీతో
రమాదేవి, సింధు మధ్య అపోహలు పెరుగుతాయి. అదే సమయంలోనే, తన మావయ్య చెప్పాడని సింధు తెలియక రమాదేవికి ఒక సిరప్ ఇస్తుంది. అయితే, సింధు గర్భవతి అనే విషయం తెలియడంతో కథ మొత్తం మలుపు తిరుగుతుంది. రమాదేవి తన కోపాన్నంతా మరిచిపోయి, కోడలిపై తల్లిప్రేమను కురిపించడం ప్రారంభిస్తుంది.
స్లో పాయిజన్
అత్తగారి ప్రేమను చూసి, తాను అనవసరంగా అనుమానించానని సింధు బాధపడుతున్న తరుణంలో... ఆమె మావయ్య ఒక షాకింగ్ నిజం చెప్తాడు. తాను ఇచ్చిన సిరప్ ఒక స్లో పాయిజన్ అని అంటాడు. ఆ మాటతో సింధు తీవ్రమైన గుండెకోతతో కుంగిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రమాదేవి చనిపోయిందా? సింధు ఏం చేసింది? అసలు స్లో పాయిజన్ ఎందుకు ఇచ్చారు? అన్నది నిశ్శబ్ధం సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


