Alias Rukmini: ప్రొడ్యూసర్ నాని.. హీరో నితిన్.. అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్ ఫిక్స్.. రుక్మిణి ఎవరు? అదే రోజు 4 సినిమాలు
Alias Rukmini: వరుసగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న నితిన్ మరో మూవీతో థియేటర్లకు రాబోతున్నాడు. ఈ సారి నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ మూవీతో నితిన్ లక్ పరీక్షించుకోనున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజు 4 సినిమాలు వస్తున్నాయి.
Alias Rukmini: వరుస బాక్సాఫీస్ ఫలితాలతో ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో నితిన్, తన తదుపరి చిత్రం 'అలియాస్ రుక్మిణి' (Alias Rukmini) తో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తుండటంతో మొదటి నుంచి దీనిపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్
బాక్సాఫీస్ వద్ద గట్టి విజయం కోసం చూస్తున్న నితిన్.. ఈ సారి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ డ్రామాతో ముందుకు వస్తున్నారు. 'అలియాస్ రుక్మిణి' చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ఇవాళ (అక్టోబర్ 9) అనౌన్స్ చేశారు.
పోస్టర్ వైరల్
ఇవాళ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ అలియాస్ రుక్మిణి సినిమా విడుదల తేదీ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో నితిన్ సగటు మధ్యతరగతి యువకుడిలా కనిపించి ఆకట్టుకున్నారు. సాధారణంగా గ్లామరస్ లేదా కమర్షియల్ మాస్ పాత్రలు చేసే నితిన్.. ఇందులో పక్కింటి అబ్బాయిలా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
ప్రొడ్యూసర్ నాని
అలియాస్ రుక్మిణి ప్రాజెక్ట్‌కి ప్రధాన ఆకర్షణ నేచురల్ స్టార్ నాని. నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కంటెంట్-డ్రివెన్ సినిమాలను ప్రోత్సహించే నాని, ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దీప్తి గంటాతో కలిసి నాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రుక్మిణి ఎవరు?
అయితే, ఈ సినిమాలో టైటిల్ రోల్ అయిన 'రుక్మిణి' పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని చిత్రబృందం అత్యంత రహస్యంగా ఉంచింది. అయితే అక్టోబర్ 13న రుక్మిణి ఎవరో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు.
విజయ్ బుల్గానిన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని, త్వరలోనే వరుస ప్రమోషనల్ అప్‌డేట్స్ ఇస్తామని మేకర్స్ వెల్లడించారు.
రాత మారేనా?
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన బ్రేక్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్‌కు 'అలియాస్ రుక్మిణి' ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ కానుంది. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే ఆ కథలో కంటెంట్, ఇమోషన్స్ బలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు ప్రాథమికంగానే అంచనా వేస్తాయి.
నాని బ్యానర్‌లో వచ్చిన 'హిట్' ఫ్రాంచైజ్, 'కోర్ట్' వంటి సినిమాలు ప్రొడక్షన్ వాల్యూస్, కథా బలంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. నితిన్ మార్కెట్‌కు నాని జడ్జిమెంట్ తోడవ్వడం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌కి విపరీతంగా ప్లస్ కానుంది.
రూట్ మార్చిన నితిన్
నితిన్ కెరీర్‌లో 'ఇష్క్', 'అ ఆ', 'భీష్మ' వంటి పెద్ద హిట్లు ఆయన్ను లవర్ బాయ్ లేదా పక్కింటి అబ్బాయి పాత్రల్లో చూసినప్పుడే వచ్చాయి. లార్జర్ దాన్ లైఫ్ మాస్ పాత్రల కంటే ఈ 'మిడిల్ క్లాస్ రుక్మిణి' కాన్సెప్ట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
4 సినిమాలు
అయితే బాక్సాఫీస్ దగ్గర అలియాస్ రుక్మిణికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అదే డిసెంబర్ 4న నాగ చైతన్య ‘వృషకర్మ’, విష్వక్ సేన్ ‘లెగసీ’, ‘దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’ రిలీజ్ కాబోతున్నాయి. అంటే ఒకే రోజు నాలుగు సినిమాలు రాబోతున్నాయన్నమాట. మరి వీటిలో చివరకు ఏవి అదే రోజున ఆడియన్స్ ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


