టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నా ఈ హీరోకు హిట్ మాత్రం దక్కడం లేదు. ఇప్పుడు కచ్చితంగా హిట్ సాధించాలనే టార్గెట్ తో రూట్ మార్చాడు నితిన్. ప్రయోగానికి రెడీ అయ్యాడు. సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆదివారం (జనవరి 25) రిలీజ్ చేశారు.
నో బాడీ నో రూల్స్

నితిన్ తన రూట్ మార్చాడు. హిట్ కోసం కొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. నో బాడీ నో రూల్స్ అంటూ కొత్త సినిమా అప్ డేట్ పంచుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీ అప్ డేట్ ను ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాగుతున్న సిగరెట్ నుంచి వస్తున్న పొగతో ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో ‘నో బాడీ నో రూల్స్’ అనే క్యాప్షన్ ఉంది. అంటే సైన్స్ ఫిక్షన్ మూవీలో బాడీ లేకుండా ఏమైనా ట్విస్ట్ ఉంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.
జర్నీ
‘‘నో బాడీ.. నో రూల్స్. రియాలిటీ రూల్స్ మారాయి. నా బ్రదర్ డైరెక్టర్ విఐ ఆనంద్, శ్రీనివాస్ గారుతో జర్నీ స్టార్ట్ చేసేందుకు ఆత్రుతతో ఉన్నా’’ అని నితిన్ ఎక్స్ లో ఈ పోస్టర్ పంచుకున్నాడు.
ఆ డైరెక్టర్ తో
డైరెక్టర్ వీఐ ఆనంద్ తో నితిన్ జత కట్టాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి వీఐ ఆనంద్ డైరెక్టర్. 2014లో వచ్చిన హృదయం ఎక్కడుంది అనే రొమాంటిక్ డ్రామాతో డైరెక్టర్ గా మారాడు ఆనంద్. ఆ తర్వాత అప్పుచి గ్రామం (తమిళం), టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన అనే సినిమాలు తీశాడు.
హిట్ కోసం
{{/usCountry}}డైరెక్టర్ వీఐ ఆనంద్ తో నితిన్ జత కట్టాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి వీఐ ఆనంద్ డైరెక్టర్. 2014లో వచ్చిన హృదయం ఎక్కడుంది అనే రొమాంటిక్ డ్రామాతో డైరెక్టర్ గా మారాడు ఆనంద్. ఆ తర్వాత అప్పుచి గ్రామం (తమిళం), టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన అనే సినిమాలు తీశాడు.
హిట్ కోసం
{{/usCountry}}నితిన్ ను వరుస ఫ్లాప్ లు దెబ్బకొట్టాయి. డైరెక్ట్ గా ఓటీటీలో 2021లో రిలీజైన మ్యాస్ట్రో తర్వాత నితిన్ కు హిట్ అన్నదే లేకుండా పోయింది. 2022లో వచ్చిన మాచర్ల నియోజకవర్గం, 2023లో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, 2025లో వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. సీనియర్ హీరో లయ కమ్ బ్యాక్ ఇచ్చిన తమ్ముడు మూవీ కూడా నితిన్ కు కలిసి రాలేకపోయింది.
ఇప్పుడు ఆనంద్ డైరెక్షన్ లో డిఫరెంట్ గా చేస్తున్న మూవీతోనైనా హిట్ కొట్టాలని నితిన్ చూస్తున్నాడు. దీనికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించనున్నారు.