ఇవాళ ఓటీటీలో తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ తమిళ సూపర్ హిట్ మూవీ-భూమిపైకి వచ్చే ఏలియన్

ఇవాళ ఓటీటీలోకి ఓ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో వచ్చేసింది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. భూమిపైకి వచ్చే ఏలియన్ కథతో ఈ మూవీ సాగుతోంది. మరి ఈ సినిమా ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేయండి. 

Published on: Jan 7, 2026, 11:30:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ ఓటీటీలోకి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ మూవీ వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమానే ‘అయలాన్’. ఇది తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. భూమిపైకి వచ్చే ఏలియన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ ఏలియన్ కు హీరో ఎలా సాయం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఓటీటీలోకి తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ (x)

అయలాన్ ఓటీటీ

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అయలాన్ ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. ఈ సినిమా బుధవారం (జనవరి 7) నుంచి ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించారు. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగు ఓటీటీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఇప్పుడిక స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయొచ్చు.

రెండేళ్లకు

అయలాన్ మూవీ రెండేళ్లకు ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ సినిమా 2024లో సంక్రాంతి స్పెషల్ గా రిలీజైంది. అప్పుడు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. పాజిటివ్ టాక్ తో రూ.83 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు రెండేళ్లకు అంటే 2026లో మళ్లీ సంక్రాంతికి ముందు ఈ మూవీ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

అయలాన్ స్టోరీ

ఓ ప్రత్యేక కారణం కోసం భూమి పైకి వచ్చే ఓ ఏలియన్, దానికి సాయం చేసే హీరో చుట్టూ సాగే కథనే అయలాన్. ఇందులో తామిజ్ (శివ కార్తికేయన్) వ్యవసాయం చేస్తుంటాడు. కానీ జాబ్ చేయాలనే లక్ష్యంతో సిటీకి వస్తాడు. మరోవైపు వేరే గ్రహం నుంచి టాట్టూ అనే ఓ ఏలియన్ భూమి మీదకు వస్తుంది. టాట్టూతో తామిజ్ కు పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు.

ఆ కారణంతో

అసలు టాట్టూ ఈ భూమ్మీదకు ఎందుకు వచ్చిందనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ ఖేల్కర్) ప్రయోగాలు చేస్తుంటాడు. పెట్రోల్, డీజిల్ కు ఆల్టర్నేటివ్ గా మరో గ్యాస్ నోవా గ్యాస్ ను కనిపెట్టాలని ట్రై చేస్తుంటాడు. అందుకోసం ఇండియాలోని ఓ మైన్ లో సీక్రెట్ గా ప్రయోగాలు చేస్తాడు.

అయితే ఆర్యన్ స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగిస్తాడు. మరి భూమ్మీదకు వచ్చిన టాట్టూకు ఈ స్పార్క్ కు సంబంధం ఏంటీ? టాట్టూకు తామిజ్ ఎలాంటి సాయం చేశాడన్నది అయలాన్ మూవీలో చూడాల్సిందే. ఆహా వీడియో ఓటీటీలో ఇది తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More