Nithiin: వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ లు.. సరైన బ్రేక్ కోసం అయిదేళ్లకు పైగా ఎదురు చూపులు.. ఇదీ ఇప్పుడు హీరో నితిన్ పరిస్థితి. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమా షురూ చేశాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాతోనైనా తన లక్ మారుతుందేమో చూడాలి.
నితిన్ కొత్త సినిమా

ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు నితిన్. వరుసగా హిట్లు అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా డిజాస్టర్లే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్లతో, మిరాయ్ బ్యూటీతో కలిసి నితిన్ కొత్త మూవీ మొదలెట్టాడు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ పూజ కార్యక్రమం ఈ రోజు జరిగింది.
మిరాయ్ బ్యూటీ
నితిన్ కొత్త సినిమాలో మిరాయ్ తో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయిన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనే నర్రి, సోము అనే యువకులు డైరెక్టర్లుగా మారుతున్నారు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 43వ సినిమా ఇది. నితిన్ కెరీర్ లో 34వ మూవీ. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారం నుంచి జరుగుతుందని మేకర్స్ తెలిపారు.
వరుస ఫ్లాప్ లతో
{{/usCountry}}నితిన్ కొత్త సినిమాలో మిరాయ్ తో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయిన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనే నర్రి, సోము అనే యువకులు డైరెక్టర్లుగా మారుతున్నారు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 43వ సినిమా ఇది. నితిన్ కెరీర్ లో 34వ మూవీ. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారం నుంచి జరుగుతుందని మేకర్స్ తెలిపారు.
వరుస ఫ్లాప్ లతో
{{/usCountry}}హీరో నితిన్ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. 2020లో వచ్చిన ‘భీష్మ’ తర్వాత నితిన్ కు మరో హిట్ దక్కలేదు. చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ముఖ్యంగా నితిన్ లాస్ట్ మూవీ తమ్ముడు అయితే డిజాస్టర్ గా నిలిచింది.
తమ్ముడు ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న నితిన్ ఇప్పుడు డెబ్యూ డైరెెక్టర్లతో చేస్తున్న మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. భీష్మ, రంగ్ దే తర్వాత నాగవంశీ- నితిన్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ ఇది.
గోల్డెన్ లెగ్
మరోవైపు హీరోయిన్ రితికా నాయక్ కు గోల్డెన్ లెగ్ అనే పేరొచ్చింది. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీతో డెబ్యూ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హాయ్ నాన్నలో మెరిసింది. అనంతరం మిరాయ్ లో అదరగొట్టింది. మిరాయ్ లో అందం, నటనతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.
ఇప్పుడు నితిన్ పక్కన సినిమాలో రితికా నాయక్ ఛాన్స్ కొట్టేసింది. ఈ భామ ఖాతాలో మరో మూడు సినిమాలున్నాయని టాక్. మరి బ్యూటీ రితికా రాకతోనైనా నితిన్ జాతకం మారుతుందేమో చూడాలి.