...
...
Next Story

Nithya Menon Pregnancy: పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పు కాదు.. అది మీ ఇష్టం.. ఒంటరిగానే బాగుంది: నిత్యా మీనన్

Nithya Menon Pregnancy: విలక్షణ నటి నిత్యా మీనన్ పెళ్లి, పిల్లల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల కోసం పెళ్లి తప్పనిసరి కాదని, ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న సైంటిఫిక్ పద్ధతుల ద్వారా పెళ్లి లేకుండానే తల్లి కావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

Published on: Apr 28, 2026, 19:47:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nithya Menon Pregnancy: సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్.. తన అభిప్రాయాలను ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. గ్లామర్ పాత్రల కంటే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చే నిత్య.. తాజాగా పెళ్లి, పిల్లలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిగత స్వేచ్ఛకు తాను ఎంత విలువిస్తానో ఆమె మరోసారి స్పష్టం చేశారు.

సంతానం కోసం పెళ్లి అక్కర్లేదు

Nithya Menon Pregnancy: పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పు కాదు.. అది మీ ఇష్టం.. ఒంటరిగానే బాగుంది: నిత్యా మీనన్
Nithya Menon Pregnancy: పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పు కాదు.. అది మీ ఇష్టం.. ఒంటరిగానే బాగుంది: నిత్యా మీనన్

పిల్లల గురించి నిత్య మీనన్ మాట్లాడుతూ.. "కేవలం పిల్లలు కావాలనే కోరికతో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. వివాహం చేసుకోకుండానే సంతానాన్ని పొందవచ్చు. అది మీ ఇష్టం. ఇందుకోసం ప్రస్తుతం ఎన్నో సైంటిఫిక్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ మార్గాలను అనుసరించి పిల్లల్ని కంటున్నారు" అని ఆమె తన బోల్డ్ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆధునిక కాలంలో మాతృత్వం అనేది కేవలం వివాహంతోనే ముడిపడి లేదని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.

స్వేచ్ఛే ప్రాణం.. నాపై ఎవరి నియంత్రణ లేదు

తన బ్యాచిలర్ లైఫ్ గురించి నిత్య ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. "నేను నా ఒంటరి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. నన్ను నియంత్రించే అధికారం ఎవరికీ లేదు. నాకు స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైన విషయం. వివాహం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే కావచ్చు.. కానీ అదే పూర్తి జీవితం కాదు. నాకు నిజమైన ప్రేమ దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అంతమాత్రాన పెళ్లి కాలేదని నా జీవితం ఆగిపోదు" అని ఆమె వివరించారు.

అమ్మమ్మ కూడా అర్థం చేసుకుంది

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి గురించి స్పందిస్తూ.. "కొన్నేళ్ల క్రితం వరకు మా అమ్మమ్మ నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేవారు. కానీ ఇప్పుడు ఆమె కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం నాపై ఎవరూ ఎటువంటి ఒత్తిడి చేయడం లేదు. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎవరి మాటలు వినను. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. పెళ్లి కాలేదు కదా అని నా జీవితం అసంపూర్ణం కాదు" అని నిత్యా మీనన్ స్పష్టం చేశారు.

1. పెళ్లి లేకుండా పిల్లల్ని కనడం గురించి నిత్యా మీనన్ ఏమన్నారు?

సంతానం కోసం వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న సైంటిఫిక్ పద్ధతుల ద్వారా పెళ్లి లేకుండానే తల్లి కావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

2. నిత్యా మీనన్ పెళ్లి గురించి ఏమని స్పందించారు?

నిజమైన ప్రేమ దొరికితేనే వివాహం చేసుకుంటానని, పెళ్లి జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప అదే జీవితం కాదని ఆమె స్పష్టం చేశారు.

3. నిత్యా మీనన్ తాజా చిత్రాలేమిటి?

నిత్యా మీనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసం వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks