O Mysaa Re Song Lyrics: ఇవి అక్షరాలు కాదు కత్తులు-నిప్పులు కక్కిన సుద్దాల అశోక్ తేజ కలం-ఓ మైసా రే సాంగ్ లిరిక్స్ మీ కోసం
O Mysaa Re Song Lyrics: కలం నిప్పులు కక్కితే ఇలాగే ఉంటుందా? అక్షరాలు కత్తుల్లా మారి దూసుకెళ్తే ఇలాగే ఉంటుందా? పదాలకు ప్రాణం పోస్తే ఇలాగే ఉంటుందా?.. ఇప్పుడు ఓ మైసా రే సాంగ్ లిరిక్స్ వింటే ఇలాగే అనిపిస్తోంది. రష్మిక మందన్న మైసా మూవీ కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి.
O Mysaa Re Song Lyrics: రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేస్తున్న లేడి ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ‘ఓ మైసా రే’ సాంగ్ రిలీజైంది. ఈ పాట లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా ఎలివేట్ చేసేలా ఈ సాంగ్ ఉంది.

రష్మిక పూనకం
మైసా నుంచి వచ్చిన ‘ఓ మైసా రే’ సాంగ్ లిరిక్స్ మామూలుగా లేవనే టాక్ వినిపిస్తోంది. అక్షరాలే కత్తుల్లా దూసుకెళ్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటలో రష్మిక మందన్న పూనకంతో ఊగిపోయింది. లిరిక్స్ వింటే మనకు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందని చెప్పొచ్చు.
ఈ అద్భుతమైన పాటను ప్రముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ రాశారు. తన కలంతో నిప్పులు కక్కించారు. ఇక అంతే గొప్పగా ఈ సాంగ్ ను సింధూజ శ్రీనివాసన్ పాడారు. ఆమె వాయిస్ లోనూ వేరియేషన్స్ విజిల్స్ తెప్పిస్తున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ నవంబర్ 27న రిలీజ్ కానుంది.
ఓ మైసా రే సాంగ్ లిరిక్స్
పల్లవి
దాయే దాయే ఐషి.. దాయే దాయే ఈషి
ఐషి దాయే లేసీ... లేసీ దాయే ఈషి...
శత్రువుల కుత్తుకపై కత్తులను నూరాలే
దాయే దాయే ఐషి
బాణాలకు నెత్తుటితో తానాలు పోయాలే
దాయే దాయే ఈషి
ధనసు మీద మనసు పెట్టి పసుపు సిలకరించాలే
పిడికిళ్లతో కొడవళ్లను ముడుపు గట్టుడే
దండోరా దరువేసి చంద్ర నిప్పుల పొగలేసి
గుండెలన్నీ పిండిజేసి శాకవోసుడే
దాయే దాయే ఐషి... దాయే దాయే ఈషి
చరణం 1
మర్లవడే సవాలే దొర్లిపడే శవాలే
పొర్లాలే నీ కాళ్ల కాడా
కంటి పొర నరాలే యెంట బడే శరాలే
సాగాలి నా మృత్యు క్రీడ
కాటేసే సర్పాన్ని.. కాపాడే కర్మేంది
రక్తాన్ని తాగేసే నా ఇంట దాహాన్ని
నేనింకా ఆపేదేలే
తార లేదు పుట్టుక లేదు గాయాల నా గుండె
యే రంపాల కోత రాయిస్తే రాత దండెత్తమంటోందే
ఓ మాత రే.. మాత రే.. ఓ మాత రే మైసా రే
ఓ మాత రే.. మాత రే.. ఓ మాత రే మైసా రే
చరణం 2
గంపంతా కన్ను నీ సొంతమే
కంపరమెత్తించాలి కంపించేలే
ఇంగా నీ జంగాలో సింగాలు తొంగుంటే
రాకాసి రాజ్యంలో దిక్కేవ్వరే
హుంగే రుద్రంగి హుంగే
హుంగే రుధిరంగి హుంగే
మెరుపుల అల ఉరుముల శిలా రగిలి పగిలి లే
యాది నీ దాడి పిడుగుల జడిలే
నీ అడుగు అడుగు రగడ దగడేలే
నువ్వు దూసే కరకు బరసే బడుగుల గురిలే
దుష్టుల తలల మహిషా కన్నుల.. పొగరు ఒనికే దురకలే
లలిత జనిత జనుత జ్వలిత
యే జూమ్ జూమ్ జూమ్ జూమ్ జూమ్
ఓ మాత రే.. మాత రే.. ఓ మాత రే మైసా రే
ఓ మాత రే.. మాత రే.. ఓ మాత రే మైసా రే
ఓ మాత రే.. మాత రే.. ఓ మాత రే మైసా రే
ఓ మాత రే.. మాత రే.. ఓ మాత రే మైసా రే
భువన మరణ మృదంగం
భుస భుస భుస భుజంగం
భువన జన ఫిరంగం
భమ్ భమ్ భమ్ భమ్
తమ్ తమ్ తమ్ తరంగం
దమ్ దమ్ దమ్ ధరంగే
నమ్ నమ్ నమ్ నబాంగే
కాళియే కాళియే కాళియే కాళియే కాళియే కాళియే
జడలు విడిచె మెడలు విరిచె
కాళియే కాళియే కాళియే కాళియే కాళియే కాళియే
గగురు పొడిచే గుడిని విడిచే
ఓం తకిట ఓం ప్రకృతి ఓం వికృతి డమ్ డమ్ డమ్
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


