O Na Ramayya Song Lyrics: ఊరూవాడను ఊపేస్తున్న పాట.. 4.8 కోట్ల వ్యూస్.. ఓ నా రామయ్య సాంగ్ లిరిక్స్.. మీరూ పాడేయండి!
O Na Ramayya Song Lyrics: రీసెంట్ టైమ్స్ లో ఊరూవాడా అని తేడా లేకుండా అందరినీ ఊపేస్తున్న సాంగ్ ఏదైనా ఉందంటే.. అది ‘ఓ నా రామయ్య’ పాటనే. ఈ జానపద భక్తి గీతం మామూలుగా ట్రెండ్ అవడం లేదు. ముఖ్యంగా దసరా సెలవుల్లో దుర్గామాత మండపాల దగ్గర ఈ సాంగ్ మార్మోగింది. ఈ పాట తెలుగు లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి.
O Na Ramayya Song Lyrics: తెలంగాణ జానపద పాటలకు ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. సినిమా సాంగ్స్ కంటే ఇవే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ లో కోట్ల కొద్ది వ్యూస్ కొల్లగొడుతున్నాయి. అలాంటిదే ఈ ‘ఓ నా రామయ్య’ సాంగ్ కూడా. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన ఈ పాట ఇంటర్నెట్ ను మామూలుగా షేక్ చేయడం లేదు.

ఓ నా రామయ్య సాంగ్ లిరిక్స్
జానపదం ప్లస్ భక్తి కలగలిపి ఈ ఓ నా రామయ్య సాంగ్ సాగుతుంది. హుషారైన బీట్ కు తగ్గట్లు నర్సన్న వాయిస్ మ్యాజిక్ చేసింది. ఈ పాటను బూతం రమేష్ రాశారు. కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. ఈ ప్రైవేట్ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి.
పల్లవి
ఎండాలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య
అది ఎండి కోలా ఓ నా రామయ్య.. 2
బాయిలేసిన కోలా అది బంగరు కోలా ఓ నా సీతమ్మ
అది బంగరు కోలా ఓ నా సీతమ్మ.. 2
కట్టరా కాలు గజ్జె
కొట్టరా డప్పు దరువు
వెయ్యరా కాలు అడుగు సిర్రతో చిటికెర
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర
రావయ్యా జంగమా ఆహా లింగమా.. 2
చరణం 1
బాజాట్లేసే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య
అది ముక్తి భజన ఓ నా రామయ్య.. 2
సేవల్లేసే భజన అది చెక్క భజన ఓ నా సీతమ్మ
అది గజ్జెల భజన ఓ నా సీతమ్మ.. 2
పట్టరా భజనలు
కొట్టరా చిడతలు
వెయ్యరా అడుగులు
భక్తితో చిందులు
బలే బలే బలే బలే బలే బలే హా
హర హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర
లేవయ్యా శంకరా మా భోలా శంకర.. 2
చరణం 2
పెద్దలు ఏసేటి కోల పరమేశ్వర కోలా ఓ నా రామయ్య
పరమాత్మ కోలా ఓ నా రామయ్య.. 2
బాలలు యేసేటి కోల భగవంతుని కోలా ఓ నా సీతమ్మ
భలే భక్తి కోలా ఓ నా సీతమ్మ.. 2
కొట్టరా కోలాటం
అల్లరా జడలల్లిక
వెయ్యరా జడ కొప్పు
సీతమ్మ సిక్కు రా
అరే అరే అరే అరే
రామా రామా మూర్తి రామమూర్తి లెగుమా ఓహో శ్రీ రామ
రావయ్యా లక్ష్మణా ఆహా జై రామ.. 2
చరణం 3
భక్తుల్లేసే భజన అది భక్తి భజన ఓ నా రామయ్య
అది భక్తుల భజన ఓ నా రామయ్య.. 2
వీరుల్లేసే భజన అది వీర భజన ఓ నా సీతమ్మ
విశ్వమంత భజన ఓ నా సీతమ్మ.. 2
పూజలే చేయాలే
పుణ్యమే జరగాలే
పాపమే పోవాలే
దోషమే తొలగాలే
ఆడే డే డే డే
శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర
రావయ్యా జంగమ ఆ ఆహా లింగమా.. 2
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


