OTT: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన కాలేజ్ బోల్డ్ అండ్ రొమాన్స్ డ్రామా ‘ఆఫ్ క్యాంపస్’ (Off Campus) యూత్ ను ఆకట్టుకుంటోంది. ఈ బోల్డ్ సిరీస్ నుంచి సీజన్ 2 కూడా రాబోతుంది. మరి సీజన్ 2 ఎప్పుడు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది? అందులో నటించే నటీనటులపై ఓ లుక్కేయండి.
ఆఫ్ క్యాంపస్ ఓటీటీ

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ రొమాంటిక్ అండ్ బోల్డ్ సీన్స్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఆఫ్ క్యాంపస్’. ఈ సిరీస్ సీజన్ 1 మే 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఐఎండీబీలో దీనికి 8.1 రేటింగ్ ఉంది. మొదటి సీజన్‌తోనే ఓటీటీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆఫ్ క్యాంపస్.
రెండో సీజన్
ఎల్ కెన్నెడీ రాసిన ప్రసిద్ధ హాకీ రొమాన్స్ నవలల ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ డ్రామా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ఆదరణ పొందిన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ రెండో సీజన్‌ను అధికారికంగా ఖరారు చేశారు. విశేషం ఏంటంటే, మొదటి సీజన్ విడుదల కాకముందే అమెజాన్ ఈ సిరీస్ సీజన్ 2 పై నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీజన్ 2 ఎప్పుడంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిబ్రవరి 12, 2026నే 'ఆఫ్ క్యాంపస్' సీజన్ 2ను అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు రెండో సీజన్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి సీజన్ నిర్మాణ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సీజన్ 2 వచ్చే ఏడాది అంటే 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
బ్రయర్ యూనివర్సిటీ నేపథ్యంలో సాగే ఈ కథ తదుపరి షూటింగ్ అప్డేట్స్ ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. "ఈ సిరీస్ మొదటి సీజన్ సాధించిన విజయం, కథలోని లోతు మాకు తదుపరి భాగాలను నిర్మించేందుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి" అని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ గ్లోబల్ టెలివిజన్ హెడ్ పీటర్ ఫ్రైడ్‌ల్యాండర్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
'ఆఫ్ క్యాంపస్' సీజన్ 2 వీళ్లు
{{/usCountry}}బ్రయర్ యూనివర్సిటీ నేపథ్యంలో సాగే ఈ కథ తదుపరి షూటింగ్ అప్డేట్స్ ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. "ఈ సిరీస్ మొదటి సీజన్ సాధించిన విజయం, కథలోని లోతు మాకు తదుపరి భాగాలను నిర్మించేందుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి" అని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ గ్లోబల్ టెలివిజన్ హెడ్ పీటర్ ఫ్రైడ్‌ల్యాండర్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
'ఆఫ్ క్యాంపస్' సీజన్ 2 వీళ్లు
{{/usCountry}}రెండో సీజన్‌లో పాత నటీనటులతో పాటు కొందరు కొత్త వాళ్లు కూడా సందడి చేయనున్నారు. హన్నా వెల్స్ పాత్రలో ఎల్లా బ్రైట్, గారెట్ గ్రాహమ్‌గా బెల్మాంట్ కామెలి, అల్లీ హేయిస్‌గా మికా అబ్దల్లా, డీన్ డి లారెంటిస్‌గా స్టీఫెన్ కాలైన్, జాన్ లోగన్‌గా ఆంటోనియో సిప్రియానో, టక్కర్ పాత్రలో జాలెన్ థామస్ బ్రూక్స్ మళ్లీ మెరవనున్నారు. వీరితో పాటు కొత్తగా ఇండియా ఫౌలర్ (గ్రేస్ ఐవర్స్ పాత్రలో), ఫిలిప్పా సూ (స్కార్లెట్ పాత్రలో) చేరనున్నారు. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల జోష్ హ్యూస్టన్ ఈ సీజన్‌లో కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.
కథ ఎలా ఉండబోతోంది?
అమెజాన్ ప్రైమ్ వీడియో కథాంశాన్ని పూర్తిగా వెల్లడించనప్పటికీ, ఎల్ కెన్నెడీ రాసిన రెండవ నవల 'ది మిస్టేక్' ఆధారంగా సీజన్ 2 కథ సాగనుందని సమాచారం. ముఖ్యంగా జాన్ లోగన్, గ్రేస్ ఐవర్స్ పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అలాగే హన్నా, గారెట్, డీన్, అల్లీల జీవితాల్లోని పరిణామాలు కూడా ఇందులో చూపిస్తారు.
రొమాన్స్, కాలేజ్ డ్రామా, హాకీ కల్చర్ ల సమాహారంగా వచ్చిన ఈ సిరీస్‌కు యువత నుంచి విపరీతమైన క్రేజ్ దక్కింది. నటీనటుల మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ప్రస్తుతం 'ఆఫ్ క్యాంపస్' మొదటి సీజన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: ఆఫ్ క్యాంపస్ సీజన్ 2 ఎప్పుడు విడుదలవుతుంది?
సమాధానం: మేకర్స్ అధికారిక తేదీని ప్రకటించలేదు, కానీ ఈ సిరీస్ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రశ్న 2: ఆఫ్ క్యాంపస్ సిరీస్ దేని ఆధారంగా తెరకెక్కించారు?
సమాధానం: ప్రముఖ రచయిత్రి ఎల్ కెన్నెడీ రాసిన హాకీ రొమాన్స్ నవలల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు.
ప్రశ్న 3: సీజన్ 2 లో కొత్తగా ఎవరు నటిస్తున్నారు?
సమాధానం: రెండో సీజన్‌లో ఇండియా ఫౌలర్, ఫిలిప్పా సూ కొత్త పాత్రల్లో కనిపించనున్నారు.