Sai Pallavi: రామానంద్ సాగర్ క్లాసిక్ టీవీ సీరియల్ ‘రామాయణ్’లో సీతగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటి దీపికా చిక్లియా.. బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ్’ లో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి (Sai Pallavi) పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో సాయి పల్లవి సీతగా ఎలా కనిపిస్తుందో ఊహించలేకపోతున్నానని ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
సీతా దేవి ఎలా ఉంటుందంటే?

తులసీదాస్ రాసిన రామచరితమానస్లో సీతాదేవి వర్ణన చాలా స్పష్టంగా ఉందని దీపికా చిక్లియా చెప్పారు. బాదం పప్పు ఆకారపు కళ్లు, నిర్దిష్టమైన రూపురేఖలతో ఉండేలా వర్ణించారు. ఆ రోజుల్లో రామానంద్ సాగర్ సరిగ్గా అలాంటి పోలికలు ఉన్న నటి కోసం వెతికి తనను ఎంపిక చేశారని దీపికా చిక్లియా గుర్తుచేసుకున్నారు.
“సీతాదేవికి కర్లీ హెయిర్ ఉన్నట్లు ఎక్కడా లేదు”
సాయి పల్లవి చాలా అద్భుతమైన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదని దీపికా చెప్పారు. అయితే రామాయణంలో సీతాదేవికి కర్లీ హెయిర్ (ముంగురులు) ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. స్క్రీన్ మీద ఆమెను సీత రూపంలో చూస్తే తప్ప ఆ లుక్ ఎంతవరకు సెట్ అవుతుందో చెప్పలేమని ఆమె అన్నారు.
కొవిడ్ సమయంలో దూరదర్శన్లో మళ్లీ ప్రసారమైన రామానంద్ సాగర్ ‘రామాయణ్’ కొత్త తరం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయిన ఆ ఒరిజినల్ ఐకానిక్ ఇమేజ్ను చెరిపేయడం కొత్త సినిమాకు చాలా కష్టమైన విషయమని దీపికా అభిప్రాయపడ్డారు.
టైప్కాస్ట్ వివాదం.. రణ్బీర్ కపూర్ విభిన్న పాత్రలు
ఆ సీరియల్లో దీపికతో కలిసి రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్.. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణంలో దశరథ మహారాజుగా నటిస్తుండటం విశేషం. ఆ రోజుల్లో సీతగా నటించడం వల్ల తన కెరీర్ అక్కడితో ఆగిపోయిందని, వేరే ఆఫర్లు రాక టైప్కాస్ట్ అయిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}ఆ సీరియల్లో దీపికతో కలిసి రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్.. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణంలో దశరథ మహారాజుగా నటిస్తుండటం విశేషం. ఆ రోజుల్లో సీతగా నటించడం వల్ల తన కెరీర్ అక్కడితో ఆగిపోయిందని, వేరే ఆఫర్లు రాక టైప్కాస్ట్ అయిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
{{/usCountry}}అయితే ఇప్పటి కాలంలో రణ్బీర్ కపూర్ 'బర్ఫీ', 'సంజు', 'యానిమల్' లాంటి విభిన్నమైన సినిమాలు చేస్తూనే రాముడిగా నటించగలగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నటులుగా వేర్వేరు రోల్స్ చేయడం ఈ తరం యాక్టర్లకు దక్కిన అవకాశమని కొనియాడారు.
కామిక్-కాన్ లో షాక్.. రామాయణం ట్రైలర్ వాయిదా
మరోవైపు శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC 2026) వేదికగా విడుదల కావలసిన 'రామాయణం' అధికారిక ట్రైలర్ చివరి నిమిషంలో పోస్ట్పోన్ అయ్యింది. గ్లోబల్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్'తో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడంతో ట్రైలర్ను త్వరలోనే మరో గ్రాండ్ డేట్లో వరల్డ్వైడ్గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
రాక్స్టార్ రణ్బీర్ కపూర్ రాముడిగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీని దాదాపు రూ. 4,000 కోట్ల అత్యంత భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో గ్లోబల్ లెవెల్లో విపరీతమైన హైప్ నెలకొంది. రామాయణం పార్ట్-1 ను దీపావళి 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.