Sonu Sood Launch Oh Naa Siddayya Song On 70MM Screen: భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయని వినూత్న ప్రయోగానికి హైదరాబాద్ నగరం వేదికైంది. సాధారణంగా పెద్ద సినిమాల ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లను మైదానాల్లో నిర్వహించడం చూస్తుంటాం.
70ఎంఎం భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్

కానీ, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కోసం ఏకంగా అవుట్‌డోర్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది ‘ఓ నా సిద్ధయ్య’ చిత్ర బృందం. సినిమా థియేటర్‌లో లభించే గొప్ప అనుభూతిని బహిరంగ మైదానంలోనూ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ఆలోచన చేశారు.
వర్షంలోనూ మైదానానికి పోటెత్తిన 5 వేల మంది ప్రేక్షకులు
శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం శంషాబాద్‌లోని ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో ఈ ఆల్బమ్ పాట ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక ప్రారంభ సమయంలో తీవ్రమైన వర్షం కురిసినప్పటికీ అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.
వాతావరణం సహకరించకపోయినా, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా 5 వేల మందికి పైగా ప్రేక్షకులు శంషాబాద్ మైదానానికి తరలివచ్చారు. ఓపెన్ థియేటర్ వాతావరణంలో భారీ స్క్రీన్‌పై డిజిటల్ క్వాలిటీ, డాల్బీ సౌండ్‌తో పాటను ప్రదర్శించడంతో అక్కడకు వచ్చిన ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
పాటను ఆవిష్కరించిన రియల్ హీరో సోనూ సూద్
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ ముఖ్య అతిథిగా హాజరై ‘ఓ నా సిద్ధయ్య’ పాటను లాంచ్ చేశారు. "బహిరంగ మైదానంలో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై ప్రైవేట్ పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదొక వినూత్నమైన ప్రయోగం. ఇలాంటి సాహసోపేతమైన ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పాట పెద్ద విజయం సాధించాలి" అని సోనూ సూద్ ఆకాంక్షించారు.
ఈ వేడుకలో పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. "శంషాబాద్ వేదికగా ఇలాంటి వైభవమైన ఈవెంట్ జరగడం ఆనందంగా ఉంది. 'ఓ నా సిద్ధయ్య' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని శ్రోతల మనసులు గెలుచుకోవాలి" అని శుభాకాంక్షలు తెలిపారు.
{{/usCountry}}ఈ వేడుకలో పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. "శంషాబాద్ వేదికగా ఇలాంటి వైభవమైన ఈవెంట్ జరగడం ఆనందంగా ఉంది. 'ఓ నా సిద్ధయ్య' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని శ్రోతల మనసులు గెలుచుకోవాలి" అని శుభాకాంక్షలు తెలిపారు.
{{/usCountry}}ఈ కార్యక్రమంలో హీరో ఇంద్రరామ్, సింగర్ నల్గొండ గద్దర్ నరసన్న, ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, బిగ్ బాస్ ఫేమ్ బోలే షావలి, నటుడు ఉత్తేజ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు తమ మద్దతు తెలిపారు.
భార్యాభర్తల ప్రేమానుబంధం.. సిద్ధయ్య, చిట్టెమ్మల కథ
‘ఓ నా సిద్ధయ్య’ పాట కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా దాంపత్య జీవితంలోని మహోన్నత విలువలను చాటిచెబుతుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ ప్రేమకథలో సిద్ధయ్య, చిట్టెమ్మ అనే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే తత్వాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.
ఈ పాటలో సిద్ధయ్య పాత్రలో నటించడమే కాకుండా స్వయంగా నిర్మించిన సిద్ధు రెడ్డి కందకట్ల తన నిజజీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా భార్యాభర్తలు ఎలా నిలదొక్కుకోవాలో చూపించడంతో పాటు, తమ చుట్టూ ఉన్న సమాజానికి సహాయపడే దృక్పథాన్ని కూడా ఈ కథనంలో జోడించారు. సిద్ధు రెడ్డికి జోడీగా కాత్యాయని జగన చిట్టెమ్మ పాత్రలో జీవించారు.
వినోదంతో పాటు సామాజిక సేవలోనూ ముందంజ
సిద్ధు రెడ్డి కందకట్ల కేవలం కళారంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నిరంతరం ముందుంటున్నారు. గతంలో ఆయన 300 మంది ఆటో డ్రైవర్లకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత అందించారు.
అదేవిధంగా సినీ పరిశ్రమలో తెరవెనుక రాత్రింబవళ్లు శ్రమించే సినీ కార్మికుల ప్రాణరక్షణను దృష్టిలో ఉంచుకుని వారికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే ఆయన సామాజిక స్పృహను వేదికపై ఉన్న ప్రముఖులు కొనియాడారు.
రామ్ అద్నాన్, శ్రీనిధి ఆలాపన
రామ్ అద్నాన్ రచన, దర్శకత్వంలో, కళ్యాణ్ కీస్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను రామ్ అద్నాన్, శ్రీనిధి అద్భుతంగా ఆలపించారు. అరుణ్ కొలుగురి ఛాయాగ్రహణం, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, నవీన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. రమేష్ మదసు, శీలం భానుప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ ఆల్బమ్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో శ్రోతలను అలరిస్తోంది.