'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ఇప్పుడు మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఆయన 'ఆపరేషన్ సింధూర్' అనే కొత్త సినిమాను ప్రకటించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల (Deep Strikes) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ధురంధర్ 2

ప్రస్తుతం ధురంధర్ 2 మేనియా సాగుతోంది. ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి మరో దేశభక్తి సినిమా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా
ఆపరేషన్ సింధూర్ సినిమా లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. ధిల్లాన్ (రిటైర్డ్) రాసిన 'ఆపరేషన్ సింధూర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్' అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది. దేశ రక్షణ కోసం మన సైనికులు ప్రాణాలకు తెగించి చేసిన పోరాటాన్ని వివేక్ అగ్నిహోత్రి తనదైన శైలిలో చూపించబోతున్నాడు.
వివేక్ అగ్నిహోత్రి
ఆపరేషన్ సింధూర్ సినిమాను ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఒకప్పుడు 'హేట్ స్టోరీ', 'జిద్' వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి, గత కొన్నేళ్లుగా సామాజిక-రాజకీయ అంశాలపై మూవీస్ తీస్తున్నాడు.
'ది తాష్కెంట్ ఫైల్స్', ‘ది కాశ్మీర్ ఫైల్స్’, 'ది వ్యాక్సిన్ వార్' వంటి చిత్రాలు ఆయనకు భారీ విజయాలను అందించాయి. ఇప్పుడు 'ఆపరేషన్ సింధూర్' తో మరోసారి భారత సైనిక శక్తిని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యాడు
టైటిల్స్ కోసం నిర్మాతల పోటీ
భారత్ సైనిక దాడుల తర్వాత బాలీవుడ్ చిత్రనిర్మాతలు ఆపరేషన్ సింధూర్ పేరుతో టైటిల్స్ రిజిస్టర్ చేయడానికి క్యూ కట్టారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా అప్లికేషన్లు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. 'మిషన్ సింధూర్', 'హిందుస్థాన్ కా సింధూర్', 'సింధూర్ కా బద్లా' వంటి టైటిల్స్ కోసం ఆదిత్య ధర్, మధుర్ భండార్కర్ వంటి అగ్ర దర్శకులు కూడా పోటీ పడటం విశేషం.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
{{/usCountry}}భారత్ సైనిక దాడుల తర్వాత బాలీవుడ్ చిత్రనిర్మాతలు ఆపరేషన్ సింధూర్ పేరుతో టైటిల్స్ రిజిస్టర్ చేయడానికి క్యూ కట్టారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా అప్లికేషన్లు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. 'మిషన్ సింధూర్', 'హిందుస్థాన్ కా సింధూర్', 'సింధూర్ కా బద్లా' వంటి టైటిల్స్ కోసం ఆదిత్య ధర్, మధుర్ భండార్కర్ వంటి అగ్ర దర్శకులు కూడా పోటీ పడటం విశేషం.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
{{/usCountry}}ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) కు ఈ టైటిల్స్ కోసం విపరీతమైన డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఇలాంటి కీలక సంఘటనల తర్వాత టైటిల్స్ సంఖ్య 60 వరకు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకసారి టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే, నిర్మాతలు ఆ సినిమాను పూర్తి చేయడానికి మూడు సంవత్సరాల సమయం ఉంటుంది. లేదంటే ఆ టైటిల్ రద్దు అవుతుంది.
దేశవ్యాప్తంగా అంచనాలు
'ఆపరేషన్ సింధూర్' ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతికారంగా భారత సైన్యం చేసిన దాడులను ఈ సినిమాలో ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 'ధురంధర్ 2' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుండటంతో, వివేక్ అగ్నిహోత్రి సినిమా కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.