జాన్వీకి అతడు ఎవరో కూడా తెలియకపోవచ్చు.. నువ్వో యాంటీ నేషనల్.. ఫొటోగ్రాఫర్లు పట్టించుకోలేదని ఏడ్చే రకం: ఒర్రీ కామెంట్స్
జాన్వీ కపూర్ పై నోరు పారేసుకున్న యూట్యూబర్ ధృవ్ రాఠీపై మండిపడ్డాడు కంటెంట్ క్రియేటర్ ఒర్రీ అలియాస్ ఒర్హాన్ అవత్రమణి. ఈ మధ్యే అతడు జాన్వీపై చేసిన కామెంట్స్ ను ఖండిస్తూ ధృవ్ ను యాంటీ నేషనల్ అని అనడం గమనార్హం.
ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ల ప్లాస్టిక్ సర్జరీలపై చేసిన వీడియో దుమారం రేపుతోంది. అందులో జాన్వీ కపూర్ అందం కృత్రిమమని ఆరోపించడంతో, ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఒర్రీ (Orry) రంగంలోకి దిగాడు. ధృవ్ రాఠీని "యాంటీ నేషనలిస్ట్" అంటూ చాలా ఘాటుగా విమర్శించాడు.

ధృవ్ రాఠీ వీడియోలో ఏముంది?
యూట్యూబర్ ధృవ్ రాఠీ, బాలీవుడ్ సెలబ్రిటీల గొడవ ముదిరింది. జాన్వీ కపూర్‌ని టార్గెట్ చేస్తూ ధృవ్ చేసిన వీడియోపై సోషల్ మీడియా స్టార్ ఒర్రీ అలియాస్ ఒర్హాన్ అవత్రమణి సీరియస్ అయ్యాడు.
డిసెంబర్ 25న ధృవ్ రాఠీ తన ఛానెల్‌లో "ది ఫేక్ బ్యూటీ ఆఫ్ బాలీవుడ్ సెలబ్రిటీస్" అనే వీడియో పోస్ట్ చేశాడు. అందులో జాన్వీ కపూర్, దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా, కాజోల్ వంటి తారలు ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్, స్కిన్ లైటనింగ్ చేయించుకున్నారని చెప్పాడు.
ముఖ్యంగా జాన్వీ కపూర్ ఫోటోను థంబ్‌నెయిల్‌గా పెట్టి 'బిఫోర్ - ఆఫ్టర్' అంటూ చూపించడం వివాదానికి దారితీసింది.
ఒర్రీ ఘాటు రిప్లై: "అసలు నువ్వెవరో కూడా తెలియదు"
బంగ్లాదేశ్ ఘటనపై జాన్వీ స్పందించిన కొద్దిసేపటికే ధృవ్ ఈ వీడియో పెట్టాడని ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ వైరల్ అయ్యింది. దీనిపై ఒర్రీ స్పందిస్తూ ధృవ్ రాఠీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు నువ్వెవరో కూడా జాన్వీకి తెలియకపోవచ్చు అని ఎద్దేవా చేశాడు.
"నాకు తెలిసినంతవరకు ఇతను ఒక యాంటీ నేషనలిస్ట్. ఇతనికి ఫాలోవర్స్ ఉన్నా రైల్వే స్టేషన్‌లో ఫోటోగ్రాఫర్లు తనను పట్టించుకోలేదని ఏడ్చే రకం ఇతను. కేవలం అటెన్షన్ కోసమే ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు" అని ఒర్రీ మండిపడ్డాడు.
వరుస వివాదాల్లో ధృవ్
ధృవ్ రాఠీ ఈ మధ్య వరుసగా బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాడు. దీపికా పదుకోన్ స్కిన్ కలర్ మార్చుకుందని అనడంతో ఆమె ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ సినిమా 'ధురంధర్' ఒక ప్రమాదకరమైన తప్పుడు ప్రచారం చేసే సినిమా అంటూ రివ్యూ ఇచ్చి విమర్శల పాలయ్యాడు.
ధృవ్ రాఠీకి యూట్యూబ్ లో 3 కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతడు తరచూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఎన్నో వీడియోలు చేస్తుంటాడు. ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడం, వార్తల్లో నిలవడం ధృవ్ కు అలవాటుగా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


