ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ కంపోజర్, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఎన్నో బాధలు అనుభవించిన తన బాల్యం గురించి తరచుగా మాట్లాడుతుంటాడు. ఇటీవల నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఆ కష్టాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చాలా చిన్న వయస్సులోనే ప్రతి రోజు బాధాకరమైన సంఘటనలను చూశానని రెహమాన్ తెలిపాడు. తమ కుటుంబానికి ఒక ఆశ్రయం కల్పించడానికి తండ్రి ఒకేసారి మూడు ఉద్యోగాలు చేశారని అతడు గుర్తు చేసుకున్నాడు.
చిన్నతనం నుంచి కష్టాలే

సంగీతాన్ని కొనసాగించడానికి తన తల్లి తనను బాగా ప్రోత్సహించిందని ఏఆర్ రెహమాన్ చెప్పాడు. తన తండ్రి తన తొమ్మిదేళ్ల వయసులోనే చనిపోయిన తరువాత కుటుంబాన్ని పోషించే బాధ్యతను తాను తీసుకున్నట్లు తెలిపాడు. తన బాల్యంలో ఎక్కువ భాగం 40, 50 ఏళ్ల సంగీతకారులతో స్టూడియోలలో గడిచిందని రెహమాన్ పంచుకున్నాడు. ఈ కారణంగా స్కూల్ జీవితాన్ని, స్నేహితులతో గడపడాన్ని తాను ఆస్వాదించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
"నేను పెరిగే క్రమంలో నా తండ్రి, అమ్మమ్మ మరణాలు వంటి చాలా విషయాలు చూశాను. ఇది జరిగినప్పుడు నాకు కేవలం తొమ్మిదేళ్లు. ప్రతి రోజు నేను చాలా బాధలు చూశాను" అని అతడు వెల్లడించాడు.
"మా అమ్మ ఒంటరి తల్లి. ఆమె చాలా ధైర్యం ఉన్న మహిళ. నా తల్లి అన్ని బాధలను తట్టుకుంది. మమ్మల్ని రక్షించడానికి ఆమె ఎంతో కష్టపడింది. ఆమె అన్ని రకాల అవమానాలను తట్టుకుని ఒంటరిగా మమ్మల్ని పెంచిన చాలా బలమైన మహిళ" అని రెహమాన్ చెప్పాడు.
తండ్రి గురించి ఏం చెప్పాడంటే?
"నేను నా జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలోనే గడిపాను. నేను అక్కడే పుట్టాను. మా నాన్న స్టూడియోలలో పని చేసేవారు. కోడంబాక్కం దగ్గర స్టూడియోలు ఉండే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం" అని రెహమాన్ వివరించాడు.
"వాళ్ల కుటుంబ సభ్యులు మా అమ్మానాన్నలను వీధిలో పడేశారు. ఆయన అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. మాకు ఆ ఇంటిని ఇవ్వడానికి ఆయన రాత్రింబవళ్లు పనిచేశారు. ఒకేసారి మూడు ఉద్యోగాలు చేయడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అదే నా బాల్యంలో చీకటి కోణం. ఆ ట్రామా నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని తెలిపాడు.
రెహమాన్ లేటెస్ట్ మూవీస్
{{/usCountry}}"వాళ్ల కుటుంబ సభ్యులు మా అమ్మానాన్నలను వీధిలో పడేశారు. ఆయన అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. మాకు ఆ ఇంటిని ఇవ్వడానికి ఆయన రాత్రింబవళ్లు పనిచేశారు. ఒకేసారి మూడు ఉద్యోగాలు చేయడం వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అదే నా బాల్యంలో చీకటి కోణం. ఆ ట్రామా నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని తెలిపాడు.
రెహమాన్ లేటెస్ట్ మూవీస్
{{/usCountry}}ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రాబోతున్న 'తేరే ఇష్క్ మే' సినిమాకు మ్యూజిక్ అందించాడు. దీనికి అతనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది.
దీంతోపాటు రామ్ చరణ్ పెద్ది మూవీకి కూడా అతడు మ్యూజిక్ అందిస్తున్నాడు. రెహమాన్ నవంబర్ 23న పూణేలోని MCA స్టేడియంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఈవెంట్‌లో ఆమిర్ ఖాన్, బోనీ కపూర్, సుఖ్వీందర్ సింగ్, చిన్మయి, హరిహరన్ వంటి ప్రముఖులు పాల్గొంటారు.