OTT: ఇండియాలో ఓటీటీ వినోద రంగం ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఆర్మాక్స్ మీడియా' (Ormax Media) వెల్లడించిన లేటెస్ట్ నివేదిక ప్రకారం.. ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ సంఖ్య ఏకంగా 11 శాతం పెరిగి 665 మిలియన్లకు (66.5 కోట్లు) చేరుకుంది. మనదేశంలో డిజిటల్ కంటెంట్ వినియోగం ఎంత వేగంగా విస్తరిస్తుందో ఈ గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి.
60 శాతం పెరిగిన కనెక్టెడ్ టీవీలు.. లివింగ్ రూమ్‌లో సరికొత్త విప్లవం

ఈ ఆర్మాక్స్ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కనెక్టెడ్ టీవీ (Connected TV / CTV) యూజర్ల సంఖ్య ఏకంగా 60 శాతం పెరగడం. ఒకప్పుడు కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమైన ఓటీటీ వినోదం.. ఇప్పుడు నేరుగా ఇళ్లలోని లివింగ్ రూమ్‌లకు చేరింది.
స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గడం, గ్రామీణ ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ విస్తరించడం వల్ల ప్రజలు కేబుల్ టీవీ, డీటీహెచ్‌లకు స్వస్తి చెప్పి స్మార్ట్ టీవీల్లో ఓటీటీలు చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
రీజినల్ కంటెంట్ ధమాకా.. తెలుగు, సౌత్ ఇండియన్ సినిమాల హవా
ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ వేగంగా పెరగడానికి రీజినల్ కంటెంట్, ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. థియేటర్లలో మిస్సయిన సినిమాలను కొన్ని వారాలు లేదా నెల రోజుల్లోనే ఓటీటీలో చూసే సౌకర్యం ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఆడియన్స్ ఓటీటీల వైపు క్యూ కడుతున్నారు.
ఆహా (Aha), ఈటీవీ విన్ లాంటి ప్రత్యేక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ లాంటి దిగ్గజ సంస్థలు ప్రాంతీయ భాషల ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఫ్రీ కంటెంట్‌తోపాటు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్
ఇండియాలో ఓటీటీ యూజర్లలో అత్యధిక భాగం ఉచితంగా లభించే యాడ్ సపోర్టెడ్ (AVOD) కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అయితే కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడంతో పెయిడ్ సబ్స్క్రిప్షన్లు (SVOD) తీసుకునే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
{{/usCountry}}ఇండియాలో ఓటీటీ యూజర్లలో అత్యధిక భాగం ఉచితంగా లభించే యాడ్ సపోర్టెడ్ (AVOD) కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అయితే కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడంతో పెయిడ్ సబ్స్క్రిప్షన్లు (SVOD) తీసుకునే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
{{/usCountry}}రాబోయే రోజుల్లో సాంప్రదాయ టీవీ ప్రసారాల కంటే ఇంటర్నెట్ ఆధారిత కనెక్టెడ్ టీవీ స్ట్రీమింగే వినోద రంగాన్ని ఏలబోతోందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. ప్రొడక్షన్ హౌస్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇకపై టీవీ వీక్షకులను టార్గెట్ చేస్తూ కంటెంట్‌ను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.
భారీ మొత్తాలకు ఓటీటీ హక్కులు
ఒకప్పుడు కొత్త సినిమాలు వస్తుంటే ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటీటీ హక్కులకు వీటి కంటే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. కొన్ని స్టార్ల సినిమాలైతే షూటింగులు కూడా మొదలవక ముందే కోట్ల డిమాండ్ పలుకుతున్నాయి. తెలుగు సహా సౌత్ ఇండియా స్టార్ల సినిమాల కోసం ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీగా ఖర్చు చేస్తున్నాయి.