OTT Malayalam: మలయాళ చిత్ర పరిశ్రమ అందించే సహజసిద్ధమైన రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్లకు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సరికొత్త మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘ఓట్టం తుల్లాల్’ (Ottam Thullal) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

థియేటర్లలో సెప్టెంబర్ 18న విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈ శుక్రవారం అంటే నవంబర్ 6 నుండి ఒకేసారి 4 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఏ ఏ ఓటీటీలలో అందుబాటులోకి రానుంది? అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి? ఇతర విశేషాలు చూద్దాం.
ఓట్టం తుల్లాల్ స్టోరీ.. పవిత్ర చెట్టు శాపం.. 16 రోజుల్లో 5 చావుల భయం
‘ఓట్టం తుల్లాల్’ కథాంశం ఎంతో ఆసక్తికరంగా, నవ్వులు పూయించేలా ఉంటుంది. 'మేథనం' అనే సంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువ ఉన్న ఒక పల్లెటూర్లో ఈ కథ ప్రారంభమవుతుంది. గ్రామంలోని అప్పు అనే పూజారి.. రాజన్ అనే స్థానికుడిని గ్రామంలోని పవిత్రమైన ‘పాలా చెట్టు’ను నరకొద్దని హెచ్చరిస్తాడు. ఆ చెట్టుకు దైవ శక్తులు ఉన్నాయని, దాన్ని తాకితే ముప్పు తప్పదని హెచ్చరించినప్పటికీ, రాజన్ ఆ మాటలను బేఖాతరు చేస్తూ చెట్టును నరికేస్తాడు.
చిత్రంగా చెట్టు నరికిన మూడో రోజే రాజన్ ఊహించని విధంగా మరణిస్తాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలవుతాయి. అక్కడితో ఆగకుండా, రాబోయే 16 రోజుల్లో రాజన్ కుటుంబంలో మరో ఐదుగురు చనిపోతారని పూజారి అప్పు జోస్యం చెబుతాడు.
ఈ భయంకరమైన జోస్యంతో రాజన్ కుమారుడు (విష్ణు ఉన్నికృష్ణన్), ఆయన పొరుగింటివారు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఓవైపు అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూనే ఎక్కడ చచ్చిపోతామోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. ఈ చావుల శాపం నుంచి తప్పించుకోవడానికి, తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రాజన్ కొడుకు, గ్రామస్తులు చేసే వింత వింత ప్రయత్నాలు, కామెడీ ప్లాన్లు నవ్వుల పువ్వులు పూయిస్తాయి.
ఊహించని ట్విస్ట్
{{/usCountry}}ఈ భయంకరమైన జోస్యంతో రాజన్ కుమారుడు (విష్ణు ఉన్నికృష్ణన్), ఆయన పొరుగింటివారు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఓవైపు అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూనే ఎక్కడ చచ్చిపోతామోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. ఈ చావుల శాపం నుంచి తప్పించుకోవడానికి, తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రాజన్ కొడుకు, గ్రామస్తులు చేసే వింత వింత ప్రయత్నాలు, కామెడీ ప్లాన్లు నవ్వుల పువ్వులు పూయిస్తాయి.
ఊహించని ట్విస్ట్
{{/usCountry}}ఈ చిత్రానికి ప్రధాన బలం నటీనటుల మధ్య ఉన్న కెమిస్ట్రీ, దర్శకుడు జి. మార్తాండన్ అందించిన వినోదాత్మక కథనం. హీరోగా విష్ణు ఉన్నికృష్ణన్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. తండ్రి మరణం తర్వాత శాపం నుంచి తప్పించుకోవడానికి పడే ఆరాటాన్ని ఎంతో సహజంగా పండించాడు.
మలయాళ సీనియర్ నటులు విజయరాఘవన్, హరిశ్రీ అశోకన్, కళాభవన్ షాజాన్, టిని టామ్ తమ అనుభవంతో ప్రతీ సన్నివేశంలోనూ నవ్వులు పూయించారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా క్లైమాక్స్ ముందు వచ్చే ఒక ఊహించని మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
కుటుంబ సమేతంగా హాయిగా కూర్చుని నవ్వుకునే ఒక పక్కా క్లీన్ 'U' సర్టిఫైడ్ మూవీ ఇది. ఒక గంట 56 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా సాగిపోతుంది. గ్రామీణ నేపథ్యం, అక్కడి మనుషుల మధ్య ఉండే సంబంధాలు, భయాందోళనల మధ్య పుట్టే హ్యూమర్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.
ఈ శుక్రవారం (నవంబర్ 6) నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, ఓవర్సీస్ ప్రేక్షకులకు సింప్లీ సౌత్ వేదికలపై ‘ఓట్టం తుల్లాల్’ స్ట్రీమింగ్ కానుంది. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఈ మలయాళ కామెడీ డ్రామాను ఖచ్చితంగా చేర్చేసుకోండి.