OTT Malayalam: 16 రోజుల్లో 5 చావులు.. చెట్టు నరికిన పాపం.. ఒకేసారి 4 ఓటీటీల్లోకి మలయాళం కామెడీ డ్రామా

OTT Malayalam: ఓటీటీలోకి ఈ వీకెండ్ మరో మలయాళ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఓట్టం తుల్లాల్ అనే ఈ సినిమా.. ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అందుబాటులోకి వస్తుండటం విశేషం. మరి ఆ మూవీ ఏంటి? కథేంటో చూడండి.

Published on: Nov 5, 2026, 19:56:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Malayalam: మలయాళ చిత్ర పరిశ్రమ అందించే సహజసిద్ధమైన రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్లకు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సరికొత్త మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘ఓట్టం తుల్లాల్’ (Ottam Thullal) ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

OTT Malayalam: 16 రోజుల్లో 5 చావులు.. చెట్టు నరికిన పాపం.. ఒకేసారి 4 ఓటీటీల్లోకి మలయాళం కామెడీ డ్రామా
OTT Malayalam: 16 రోజుల్లో 5 చావులు.. చెట్టు నరికిన పాపం.. ఒకేసారి 4 ఓటీటీల్లోకి మలయాళం కామెడీ డ్రామా

థియేటర్లలో సెప్టెంబర్ 18న విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈ శుక్రవారం అంటే నవంబర్ 6 నుండి ఒకేసారి 4 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఏ ఏ ఓటీటీలలో అందుబాటులోకి రానుంది? అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి? ఇతర విశేషాలు చూద్దాం.

ఓట్టం తుల్లాల్ స్టోరీ.. పవిత్ర చెట్టు శాపం.. 16 రోజుల్లో 5 చావుల భయం

‘ఓట్టం తుల్లాల్’ కథాంశం ఎంతో ఆసక్తికరంగా, నవ్వులు పూయించేలా ఉంటుంది. 'మేథనం' అనే సంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువ ఉన్న ఒక పల్లెటూర్లో ఈ కథ ప్రారంభమవుతుంది. గ్రామంలోని అప్పు అనే పూజారి.. రాజన్ అనే స్థానికుడిని గ్రామంలోని పవిత్రమైన ‘పాలా చెట్టు’ను నరకొద్దని హెచ్చరిస్తాడు. ఆ చెట్టుకు దైవ శక్తులు ఉన్నాయని, దాన్ని తాకితే ముప్పు తప్పదని హెచ్చరించినప్పటికీ, రాజన్ ఆ మాటలను బేఖాతరు చేస్తూ చెట్టును నరికేస్తాడు.

చిత్రంగా చెట్టు నరికిన మూడో రోజే రాజన్ ఊహించని విధంగా మరణిస్తాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలవుతాయి. అక్కడితో ఆగకుండా, రాబోయే 16 రోజుల్లో రాజన్ కుటుంబంలో మరో ఐదుగురు చనిపోతారని పూజారి అప్పు జోస్యం చెబుతాడు.

ఈ భయంకరమైన జోస్యంతో రాజన్ కుమారుడు (విష్ణు ఉన్నికృష్ణన్), ఆయన పొరుగింటివారు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఓవైపు అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూనే ఎక్కడ చచ్చిపోతామోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. ఈ చావుల శాపం నుంచి తప్పించుకోవడానికి, తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రాజన్ కొడుకు, గ్రామస్తులు చేసే వింత వింత ప్రయత్నాలు, కామెడీ ప్లాన్లు నవ్వుల పువ్వులు పూయిస్తాయి.

ఊహించని ట్విస్ట్

ఈ చిత్రానికి ప్రధాన బలం నటీనటుల మధ్య ఉన్న కెమిస్ట్రీ, దర్శకుడు జి. మార్తాండన్ అందించిన వినోదాత్మక కథనం. హీరోగా విష్ణు ఉన్నికృష్ణన్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. తండ్రి మరణం తర్వాత శాపం నుంచి తప్పించుకోవడానికి పడే ఆరాటాన్ని ఎంతో సహజంగా పండించాడు.

మలయాళ సీనియర్ నటులు విజయరాఘవన్, హరిశ్రీ అశోకన్, కళాభవన్ షాజాన్, టిని టామ్ తమ అనుభవంతో ప్రతీ సన్నివేశంలోనూ నవ్వులు పూయించారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా క్లైమాక్స్ ముందు వచ్చే ఒక ఊహించని మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

కుటుంబ సమేతంగా హాయిగా కూర్చుని నవ్వుకునే ఒక పక్కా క్లీన్ 'U' సర్టిఫైడ్ మూవీ ఇది. ఒక గంట 56 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా సాగిపోతుంది. గ్రామీణ నేపథ్యం, అక్కడి మనుషుల మధ్య ఉండే సంబంధాలు, భయాందోళనల మధ్య పుట్టే హ్యూమర్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

ఈ శుక్రవారం (నవంబర్ 6) నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, ఓవర్సీస్ ప్రేక్షకులకు సింప్లీ సౌత్ వేదికలపై ‘ఓట్టం తుల్లాల్’ స్ట్రీమింగ్ కానుంది. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఈ మలయాళ కామెడీ డ్రామాను ఖచ్చితంగా చేర్చేసుకోండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More