OTT Malayalam: సస్పెన్స్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలు, థ్రిల్లింగ్ యాక్షన్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు మలయాళ ఇండస్ట్రీ పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 2 నుంచి నవంబర్ 8 (2026) మధ్య కాలంలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న 4 మోస్ట్ అవేటెడ్ మలయాళ మూవీస్, సిరీస్ వివరాలు ఇవే.
1. ఐయామ్ గేమ్ (I'm Game) - జియోహాట్‌స్టార్ (నవంబర్ 6)

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రెండు నెలల విరామం తర్వాత డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెడుతోంది.
ఆర్డీఎక్స్ మూవీ ఫేమ్ నహాస్ హిదాయత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ తోపాటు ఆంటోనీ వర్గీస్, కయాదు లోహర్, మిస్కిన్ లాంటి వాళ్లు నటించారు. నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన యాక్షన్ ప్రేమికులకు ఇది బెస్ట్ ఛాయిస్.
2. ICU: అంటిల్ ద లాస్ట్ బ్రీత్ - సన్ నెక్ట్స్ (నవంబర్ 6)
హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ‘ICU: అంటిల్ ద లాస్ట్ బ్రీత్’ (ICU - Until The Last Breath). 1 గంట 51 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ఆద్యంతం మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో సాగుతుంది. జార్జ్ వర్గీస్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. బిబిన్ జార్జ్, బాబూరాజ్, మురళీ గోపి, మీరా వాసుదేవ్, శ్రీకాంత్ మురళిలాంటి వాళ్లు ఇందులో నటించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, తీవ్ర ఒత్తిడి మధ్య నిర్ణయాలు తీసుకోవాల్సిన వైద్యుల చుట్టూ కథనం తిరుగుతుంది. ఇది భయం, సస్పెన్స్ కలగలిపి సాగే స్టోరీ. నవంబర్ 6 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
3. కుంజుమలాఖ (Kunjumalakha) - మనోరమ మాక్స్ (నవంబర్ 2)
{{/usCountry}}ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, తీవ్ర ఒత్తిడి మధ్య నిర్ణయాలు తీసుకోవాల్సిన వైద్యుల చుట్టూ కథనం తిరుగుతుంది. ఇది భయం, సస్పెన్స్ కలగలిపి సాగే స్టోరీ. నవంబర్ 6 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
3. కుంజుమలాఖ (Kunjumalakha) - మనోరమ మాక్స్ (నవంబర్ 2)
{{/usCountry}}కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ డ్రామాను కోరుకునే వారికి ‘కుంజుమలాఖ’ మంచి ఆప్షన్. ఇదొక మలయాళ సీరియల్. మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు ఓ కొత్త ఎపిసోడ్ చూడొచ్చు.
4. మీసయ మురుక్కు 2 (Meesaya Murukku 2) - సోనీ లివ్
ఇక సంగీత నేపథ్యంతో సాగే తమిళ హిట్ ఎంటర్టైనర్ ‘మీసయ మురుక్కు 2’ మలయాళం డబ్బింగ్ వెర్షన్ ఈ వారం సోనీ లివ్ (SonyLIV) ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మ్యూజికల్ డ్రామాలను ఆస్వాదించే యువతకు ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది.