OTT Malayalam Releases: ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మలయాళం మూవీస్ ఇవే.. థ్రిల్లర్ నుంచి హారర్ కామెడీ వరకు.. ఒక్క ఓటీటీలోనే మూడు

OTT Malayalam Releases: ఓటీటీలోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ అడుగు పెట్టాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ నుంచి హారర్ కామెడీ వరకు వివిధ జానర్ల కంటెంట్ అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.

Published on: Sep 11, 2026, 22:18:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Malayalam Releases: ఈ వారం ఓటీటీ స్పేస్‌లో మలయాళ సినిమాల హవా నడుస్తోంది. యాక్షన్, సైబర్ క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ, రూరల్ ఫాంటసీలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్లను ముంచెత్తడానికి రెడీ అయ్యాయి. జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, జియోహాట్‌స్టార్ లాంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న ఈ వీకెండ్ మలయాళం ఓటీటీ మూవీస్ పూర్తి వివరాలు ఇవే.

OTT Malayalam Releases: ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మలయాళం మూవీస్ ఇవే.. థ్రిల్లర్ నుంచి హారర్ కామెడీ వరకు.. ఒక్క ఓటీటీలోనే మూడు
OTT Malayalam Releases: ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మలయాళం మూవీస్ ఇవే.. థ్రిల్లర్ నుంచి హారర్ కామెడీ వరకు.. ఒక్క ఓటీటీలోనే మూడు

ఆరు మస్ట్ వాచ్ మలయాళం మూవీస్, సిరీస్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకం. తక్కువ బడ్జెట్‌తో రియలిస్టిక్ డ్రామాలు ప్రెజెంట్ చేస్తూ కంటెంట్ లవర్స్‌ను ఆకట్టుకోవడంలో వీరు ముందుంటారు.

ప్రతివారం లాగే ఈ సెప్టెంబర్ రెండో వారంలోనూ దాదాపు అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్‌లు బాక్స్ ఆఫీస్ సందడి ముగించుకుని, నేరుగా లేదా డిజిటల్ ప్రీమియర్‌గా మన ముందుకు వచ్చేశాయి.

జోజు జార్జ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'వరవు'

మాస్ అండ్ ఇంటెన్స్ రోల్స్‌తో మెప్పించే జోజు జార్జ్ నటించిన కొత్త చిత్రం 'వరవు' (Varavu) జీ5 వేదికగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. డైరెక్టర్ షాజీ కైలాస్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్, రివేంజ్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

జైలు నుంచి విడుదలైన ఒక ఎస్టేట్ ప్లాంటర్ తన పాత శత్రువులపై పగ తీర్చుకోవడానికి సొంత ఊరికి రావడం, ఈ క్రమంలో కుటుంబంలో తలెత్తే ఘర్షణలు ఈ కథకు ప్రధాన ఆకర్షణ. వాణి విశ్వనాథ్, మురళీ గోపి, అర్జున్ అశోకన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్‌కు మంచి ఛాయిస్.

సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 'అచ్యుత అవతారం', హారర్ కామెడీ 'మహారాజా హాస్టల్'

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైబర్ మోసాల నేపథ్యంలో వచ్చిన 'అచ్యుత అవతారం' సినిమా మంచి ఆదరణ పొందుతోంది. కాసర్‌గోడ్ గ్రామీణ నేపథ్యంలో డిజిటల్ నేరాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు పునీత్ ఈ థ్రిల్లర్‌ను చెక్కారు. విశేషమేమిటంటే ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హాస్టల్ లైఫ్, ఫ్రెండ్‌షిప్, దెయ్యాల భయాన్ని ఫన్నీగా చూపించే హారర్ కామెడీ 'మహారాజా హాస్టల్' కూడా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. అఖిల్ ఎన్ఆర్డీ, శరత్ బాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా తెలుగు డబ్బింగ్ ఆడియోతో లభ్యమవుతుండటం మన ప్రేక్షకులకు ప్లస్ పాయింట్.

దాంపత్య బంధాల కథ 'వివాహ్', యూత్‌ఫుల్ సిరీస్ 'ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్'

నాలుగు వేర్వేరు జంటల జీవితాలు, వారి మధ్య ఉండే ఎమోషనల్ లోతుపాతుల ఆధారంగా తెరకెక్కిన 'వివాహ్' మూవీ సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. బ్లెస్సన్ ఎల్సా దర్శకత్వం వహించిన ఈ డ్రామాలో ధ్యాన్ శ్రీనివాసన్, నైరా నిహార్ కీలక పాత్రలు పోషించారు.

సినిమా హీరో కావాలనుకునే ఒక కుర్రాడి కలలు, ఇంట్లో ఎదురయ్యే సవాళ్లను ఫన్నీగా చూపించే వెబ్ సిరీస్ 'ప్రిన్స్ ఆఫ్ మోలీవుడ్' జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దైన్ డెవిస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ లైట్ హార్టెడ్ సిరీస్ తెలుగు సహా 7 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రముఖ దర్శకుడు నాదిర్షా రూపొందించిన రూరల్ ఫాంటసీ కామెడీ 'మ్యాజిక్ మష్రూమ్స్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి నవ్వులు పూయిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More