OTT Thrillers: ఓటీటీలో మైండ్ బ్లాంక్ చేసే 5 అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. దృశ్యంని మించిన ట్విస్టులు
OTT Thrillers: ఓటీటీలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కోసం చూస్తున్నారా? అయితే దృశ్యం మూవీని మించిన ట్విస్టులతో మైంబ్ బ్లాంక్ చేసే ఈ 5 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అస్సలు మిస్ కావద్దు.
OTT Thrillers: అజయ్ దేవగన్, మోహన్ లాల్, తెలుగులో వెంకటేశ్ నటించిన 'దృశ్యం' (Drishyam) సిరీస్ ఇచ్చిన సస్పెన్స్ కిక్ ఎవరికైనా పిచ్చెక్కిస్తుంది. కానీ సినిమా ముగిసే వరకు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించే అలాంటి హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలని ఉందా? అయితే మీ కోసం సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 5 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జాబితా ఇక్కడ ఉంది. ఈ సినిమాలన్నింటికీ ఐఎండీబీలో ఏకంగా 8కి పైగా రేటింగ్ ఉంది. సీట్ నుంచి కదలకుండా చూసేలా చేసే ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టాప్ 5 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్
ఎవరు - ప్రైమ్ వీడియో (అడవి శేష్, ఐఎండీబీ 8.1)
తొండిముతలమ్ దృక్‌సాక్షియుమ్ - జియోహాట్‌స్టార్ (ఫహాద్ ఫాజిల్, ఐఎండీబీ 8)
దురువంగల్ పత్తినారు - తమిళ క్రైమ్ థ్రిల్లర్ (జీ 5, ఐఎండీబీ 8.1)
మెమొరీస్ - జియోహాట్‌స్టార్ (పృథ్విరాజ్ సుకుమార్, ఐఎండీబీ 8.1)
బాలన్: ది బాయ్ - మిస్టరీ డ్రామా (జీ 5 ఓటీటీ, ఐఎండీబీ 8)
1. ఎవరు (Evaru - 2019)
అడవి శేష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎవరు'. స్పానిష్ సినిమా 'ది ఇన్విజిబుల్ గెస్ట్' స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో సమీరా మహా అనే అమ్మాయి ఒక పోలీసు అధికారిని హత్య చేస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చే ఆఫీసర్ విక్రమ్ వాసుదేవ్ (అడవి శేష్) పాత్ర చేసే ట్విస్టులు సినిమా చివరి వరకు కళ్లు తిప్పనివ్వవు. ఐఎండీబీలో ఈ చిత్రానికి 8.1 రేటింగ్ ఉంది. ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
2. తొండిముతలమ్ దృక్‌సాక్షియుమ్ (Thondimuthalum Driksakshiyum - 2017)
ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన ఈ మలయాళ సినిమా రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్‌కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక నవదంపతులు తమ బంగారు గొలుసును అమ్ముకోవడానికి వెళ్లే క్రమంలో అది చోరీకి గురవుతుంది. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. దీనికి ఐఎండీబీలో 8 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమాను జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.
3. ధురువంగల్ పతినారు (Dhuruvangal Pathinaru - 2016)
తమిళంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మాస్టర్‌పీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయిన మాజీ పోలీస్ ఆఫీసర్ దీపక్, ఒక హిట్ అండ్ రన్ కేసును డీల్ చేసే విధానం సినిమాను ఎంగేజింగ్‌గా మారుస్తుంది. డైరెక్టర్ కార్తీక్ నరేన్ తన మేకింగ్‌తో ఆడియన్స్‌ను మైండ్ బ్లాంక్ చేస్తారు. దీనికి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది. దీనిని జీ5 ఓటీటీలో చూడొచ్చు.
4. మెమొరీస్ (Memories - 2013)
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళ థ్రిల్లర్ 'మెమొరీస్'. భార్య, కూతురు హత్యకు గురికావడంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన ఒక ఎక్స్‌పర్ట్ పోలీస్ ఆఫీసర్ సామ్ అలెక్స్.. ఆ తర్వాత వరుస హత్యల కేసును ఎలా చేధించాడనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. సస్పెన్స్ ఎలిమెంట్స్ పీక్స్‌లో ఉండే ఈ సినిమాకు ఐఎండీబీలో 8.1 రేటింగ్ లభించింది. దీనిని జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.
5. బాలన్: ది బాయ్ (Balan: The Boy)
ఈ ఏడాది విడుదలైన ఈ మలయాళ మిస్టరీ డ్రామా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. జైలు నుంచి విడుదలైన బాలన్ అనే అబ్బాయి, అతని తల్లి వేరే పేర్లతో కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే వారి గతం వారిని ఎలా వెంటాడింది, ఆ తర్వాత జరిగే అనూహ్య మలుపులు సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. దీనికి ఐఎండీబీలో 8 రేటింగ్ ఉంది. దీనిని జీ5 ఓటీటీలో తెలుగులోనూ చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


