OTT: ఏకంగా 3.8 కోట్ల వ్యూస్.. ధురంధర్‌నే మించిపోయిన ఓటీటీ వివాదాస్పద షో.. ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన షో ఇదే

OTT: ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన షో ఏదో తెలుసా? ధురంధర్ మూవీ అనుకుంటే పొరపాటే. అత్యంత వివాదాస్పద షోగా పేరుగాంచిన ఇండియాస్ గాట్ లేటెంట్ షో 2026లో ఎక్కువ వ్యూస్ సంపాదించిన షోగా నిలవడం విశేషం.

Published on: Jul 17, 2026, 15:59:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT: రణ్‌వీర్ సింగ్ భారీ యాక్షన్ డ్రామా 'ధురంధర్' ఓటీటీలో ఊచకోత కోస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒక వివాదాస్పద కమెడియన్ గ్రాండ్ కంబ్యాక్ షో ఇండియన్ స్ట్రీమింగ్ హిస్టరీలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఆర్మాక్స్ మీడియా' రిలీజ్ చేసిన 2026 హాఫ్ ఇయర్లీ ఓటీటీ రిపోర్ట్‌లో సమయ్ రైనా ప్రెజెంట్ చేసిన 'ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2' బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

OTT: ఏకంగా 3.8 కోట్ల వ్యూస్.. ధురంధర్‌నే మించిపోయిన ఓటీటీ వివాదాస్పద షో.. ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన షో ఇదే
OTT: ఏకంగా 3.8 కోట్ల వ్యూస్.. ధురంధర్‌నే మించిపోయిన ఓటీటీ వివాదాస్పద షో.. ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన షో ఇదే

ఆర్మాక్స్ రిపోర్ట్ సంచలనం.. ధురంధర్‌ను దాటేసిన సమయ్ రైనా

2026 జనవరి నుంచి జూన్ వరకు ఇండియా వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యధికంగా చూసిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్‌ను ఆర్మాక్స్ మీడియా 'ది ఇండియా ఓటీటీ వాచ్‌లిస్ట్' పేరుతో వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం సమయ్ రైనా రియాలిటీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్ 2' ఏకంగా 3.85 కోట్ల (38.5 మిలియన్) వ్యూయర్‌షిప్‌తో ఇండియాలోనే నంబర్ 1 ఓటీటీ ప్రాజెక్ట్‌గా నిలిచింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' 3.52 కోట్ల వ్యూస్‌తో నాలుగో స్థానానికి పరిమితమైంది. దీని సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' 2.78 కోట్ల వ్యూస్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఓటీటీలో బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లను ఒక కమెడియన్ చిన్న షో వెనక్కి నెట్టడం ప్రస్తుతం డిజిటల్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వివాదాల నుంచి విపరీతమైన సక్సెస్ వరకు..

గత ఏడాది తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుని తన యూట్యూబ్ వీడియోలన్నీ డిలీట్ చేయాల్సి వచ్చిన సమయ్ రైనా.. ఏప్రిల్ లో 'స్టిల్ అలైవ్' అనే స్టాండప్ స్పెషల్‌తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత జూన్ 20న నెట్‌ఫ్లిక్స్ లో 'ఇండియాస్ గాట్ లేటెంట్ 2' ఫస్ట్ ఎపిసోడ్‌ను ఆలియా భట్, శార్వరి వాఘ్ స్పెషల్ గెస్టులుగా గ్రాండ్‌గా లాంచ్ చేశాడు.

ఎలాంటి సెన్సార్ షరతులు లేకుండా, పక్కా 'నో ఫిల్టర్' కంటెంట్‌తో వచ్చిన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్‌లోనే ఏకంగా 6 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ షో క్రేజ్ ఎంతలా ఉందంటే సమయ్ రైనా చేసిన 'స్టిల్ అలైవ్' స్టాండప్ స్పెషల్ కూడా 1.31 కోట్ల వ్యూస్‌తో ఆర్మాక్స్ టాప్ 15 లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.

ప్రభాస్ 'ది రాజా సాబ్' ఓటీటీ మ్యాజిక్.. ఇతర టాప్ ప్రాజెక్టులు

థియేటర్ల దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 1.75 కోట్ల (17.5 మిలియన్) వ్యూస్‌తో ఆర్మాక్స్ టాప్ 10 లిస్ట్‌లో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇక నసీరుద్దీన్ షా, జిమ్ సర్బ్ నటించిన 'మేడ్ ఇన్ ఇండియా: ఎ టాటన్ స్టోరీ' 1.78 కోట్ల వ్యూస్‌తో ఏడో స్థానంలో నిలవగా, దివ్య దత్తా, సంజయ్ మిశ్రా నటించిన 'చిరయ్యా' 1.63 కోట్ల వ్యూస్‌తో పదో స్థానాన్ని సాధించాయి. నిరాడంబరమైన కంటెంట్, రోత పుట్టించని కామెడీకే ఇండియన్ డిజిటల్ ఆడియన్స్ జై కొడుతున్నారని ఈ ఆర్మాక్స్ రిపోర్ట్ క్లియర్ గా ప్రూవ్ చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More