OTT Movie Review: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (ఆగస్ట్ 28) ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'బబితా సింగ్ రిపోర్టింగ్' (Babita Singh Reporting) ఆడియన్స్ ను తొలి రోజే ఆకట్టుకుంటోంది. మలయాళ స్టార్ హీరోయిన్ నిమిష సజయన్, పాపులర్ నటుడు బరుణ్ సోబ్టి కాంబోలో వచ్చిన ఈ మూవీ ఓటీటీ లవర్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
బబితా సింగ్ రిపోర్టింగ్ మూవీ కథేంటి?

ఢిల్లీ క్రైమ్, దహాడ్, ఆర్యనాక్ లాంటి విమెన్ సెంట్రిక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు ఓటీటీలో ఇప్పటికే చాలానే వచ్చాయి. కానీ డైరెక్టర్ అంబికా పండిత్ తెరకెక్కించిన 'బబితా సింగ్ రిపోర్టింగ్' ఒక రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. బబిత అలియాస్ బేబీ (నిమిష సజయన్).. పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తన తండ్రి డ్యూటీలో చనిపోవడంతో కారుణ్య నియామకాల్లో భాగంగా ఏఎస్ఐ ఉద్యోగం సంపాదిస్తుంది. ఏ తప్పూ చేయకపోయినా సడన్‌గా సస్పెన్షన్‌కు గురైన బబిత.. తన సొంత ఊరికి వెళ్తుంది. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు బన్సి (బరుణ్ సోబ్టి) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని తెలుస్తుంది. ఈ విషాదం వెనక ఉన్న నిజాన్ని బయటపెట్టడానికి బబిత ఏం చేసింది అనేది మిగతా స్టోరీ.
నిమిష సజయన్ నటనే మూవీకి హైలైట్
ఈ బబితా సింగ్ రిపోర్టింగ్ సినిమాలో ప్రధాన బలం నటీనటుల పర్ఫార్మెన్స్. నిమిష సజయన్ బబిత క్యారెక్టర్‌లో జీవించేసింది. ఎక్కడా సూపర్ పోలీస్ బిల్డప్‌లు లేకుండా, చాలా సాధారణ ఆఫీసర్‌లా నేచురల్ యాక్టింగ్‌తో సీన్స్ పండించింది. బేబీ శరీర ఆకారంపై, బరువుపై చుట్టుపక్కల వాళ్లు చేసే కామెంట్స్‌ను తట్టుకుంటూ ఆమె చేసే ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది.
ఇక బరుణ్ సోబ్టి స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ తన క్యారెక్టర్‌తో మంచి ప్రభావం చూపించాడు. భర్త శరద్ రోల్లో అన్షుమాన్ పుష్కర్, అత్తగా సునీతా రాజ్వర్, ఎస్ఐ సేఠీగా రాజేష్ శర్మ తమ రోల్స్‌కు పూర్తి న్యాయం చేశారు.
సినిమాలో మైనస్ పాయింట్లు
{{/usCountry}}ఇక బరుణ్ సోబ్టి స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ తన క్యారెక్టర్‌తో మంచి ప్రభావం చూపించాడు. భర్త శరద్ రోల్లో అన్షుమాన్ పుష్కర్, అత్తగా సునీతా రాజ్వర్, ఎస్ఐ సేఠీగా రాజేష్ శర్మ తమ రోల్స్‌కు పూర్తి న్యాయం చేశారు.
సినిమాలో మైనస్ పాయింట్లు
{{/usCountry}}ఈ మూవీకి ప్రధానంగా మైనస్ పాయింట్ ఎడిటింగ్. దాదాపు 2 గంటల 30 నిమిషాల రన్‌టైమ్ సినిమాకు కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ వస్తున్నట్లుగా ఉండి నెమ్మదిగా సాగుతాయి. ఈ సినిమాను కనీసం మరో 15 నిమిషాల వరకు ట్రిమ్ చేసి ఉంటే ఆడియెన్స్ కు ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది.
అయినా కూడా డైరెక్టర్ అంబికా పండిత్ టేకింగ్, కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటాయి. ఎమోషన్స్ ఓవర్‌డోస్ లేకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది.
రెగ్యులర్ క్రైమ్ ప్రొసీజరల్ లాగానే అనిపించినా.. పవర్ ఫుల్ యాక్టింగ్, రియలిస్టిక్ అప్రోచ్ వల్ల 'బబితా సింగ్ రిపోర్టింగ్' మంచి చూడదగిన ఆప్షన్‌గా నిలుస్తుంది. థ్రిల్లర్ సినిమాలు, ఇన్వెస్టిగేటివ్ సిరీస్‌లను ఇష్టపడే ఓటీటీ లవర్స్ ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో కచ్చితంగా చూడొచ్చు.