OTT: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. ఓటీటీలోని ఈ టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ చూడండి.. దశాబ్దాల శతృత్వం ఎందుకో తెలుస్తుంది

OTT: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటున్న వేళ అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ శతృత్వానికి, దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు అసలు కారణమేంటో చెప్పే అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీలో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి వాటిలో వీటిని చూడొచ్చు.

Published on: Mar 18, 2026, 17:26:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాలు చేస్తున్న యుద్ధం సుమారు మూడు వారాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి యుద్ధమే కాదు.. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా ఈ వైరం అలాగే ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ కూడా రూపొందాయి. తీవ్ర ఉత్కంఠ రేపే స్పై థ్రిల్లర్స్ నుంచి.. వాస్తవాల ఆధారంగా తెరకెక్కిన కథల వరకు ఈ దేశాల మధ్య ఉన్న శత్రుత్వం, రాజకీయ గొడవలు, అక్కడి ప్రజల కష్టాలను ఇవి మన కళ్లకు కడతాయి.

OTT: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. ఓటీటీలోని ఈ టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ చూడండి.. దశాబ్దాల శతృత్వం ఎందుకో తెలుస్తుంది
OTT: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. ఓటీటీలోని ఈ టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ చూడండి.. దశాబ్దాల శతృత్వం ఎందుకో తెలుస్తుంది

టెహ్రాన్ (Tehran)

ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పై థ్రిల్లర్ స్టోరీలో తమర్ రబిన్యాన్ అనే ఒక మొస్సాద్ సాంకేతిక నిపుణురాలు.. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను నాశనం చేయడానికి టెహ్రాన్‌లోకి ఒక రహస్య పని మీద వెళ్తుంది. ఆ పని విఫలమైనప్పుడు, ఆమె శత్రువుల దేశంలో చిక్కుకుపోతుంది. అప్పుడు ఇరాన్ గూఢచారి సంస్థ ఆమెను వెంబడిస్తుంది. ఆమె వాళ్ల నుంచి తప్పించుకుందా లేదా అన్నదే ఈ థ్రిల్లర్ స్టోరీ. ఆపిల్ టీవీలో ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు.

స్పై ఆప్స్ (Spy Ops)

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్‌లో మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ప్రపంచంలోనే మోస్ట్ సీక్రెట్‌గా జరిగిన గూఢచర్య మిషన్స్ గురించి వాళ్ల అనుభవాలను పంచుకుంటారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించిన కోవర్ట్ ఆపరేషన్స్ కూడా ఇందులో టచ్ చేశారు. ఇంటర్వ్యూలు, పాత సీన్స్‌ను రీక్రియేట్ చేయడం ద్వారా.. ఆధునిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెర వెనుక ఎలా పనిచేస్తాయో ఈ షో ఒక మంచి ఇన్‌సైట్ ఇస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ఉంది.

వన్ విష్ ఫర్ ఇరాన్, లవ్ ఇజ్రాయెల్

2013లో వచ్చిన డాక్యుమెంటరీ ఇది. అదే సమయంలో ఇరాన్ లో అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆ సమయంలో ఇజ్రాయెలీ యూదులు, పాలస్తీనియన్లు, అరబ్ పౌరుల నుంచి వచ్చిన శాంతి సందేశాలను చూపిస్తూ ఇది సాగుతుంది. సరిహద్దులకు అటు, ఇటు ఉన్న రెండు దేశాల వైపు సాధారణ జనాలందరూ చర్చలు కోరుకుంటున్నారని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఈ డాక్యుమెంటరీ నిదర్శనం. జనాల మధ్య అసలు ఎలాంటి శత్రుత్వం లేదని ఇది చాలా క్లియర్‌గా, ఎమోషనల్‌గా కళ్లకు కడుతుంది. దీనిని యూట్యూబ్ లో చూడొచ్చు.

అటామిక్ ఫలాఫెల్

ఒక సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ అవుతున్న ఒక ఇజ్రాయెల్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ థ్రిల్లర్-కామెడీ మూవీని తీశారు. నోఫర్ అజ్రియన్ అనే ఒక టీనేజర్, ఫలాఫెల్ (మిడిల్ ఈస్ట్‌లో దొరికే ఒక ఫేమస్ వంటక) అమ్మే అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ మొత్తం తిరుగుతుంది. ఆమె అనుకోకుండా కొన్ని మిలిటరీ సీక్రెట్లను కనిపెట్టి, వాటిని బయటకు లీక్ చేస్తుంది. ఈ సీరియస్ ఇష్యూని కొంచెం మంచి కామెడీ టచ్‌తో ప్రెజెంట్ చేస్తూనే, ఆ యుద్ధం తాలూకు ఆందోళనలను అద్భుతంగా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

ఇట్ వాజ్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్ (It Was Just an Accident)

2025లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలుచుకున్న ఈ సినిమాను జాఫర్ పనాహి డైరెక్ట్ చేశాడు. ఇరాన్‌లో రాజకీయ ఖైదీగా జీవితం ఎలా ఉంటుందో ఈ మూవీ వివరంగా చూపిస్తుంది. ఇరాన్‌లో చాలా సీక్రెట్‌గా షూట్ చేసిన ఈ మూవీ, ఒక మాజీ పొలిటికల్ ఖైదీ చుట్టూ తిరుగుతుంది. తనను టార్చర్ చేసిన వ్యక్తినే అతను గుర్తించానని అనుకుంటాడు. హింస, ప్రతీకారం లాంటి థీమ్స్‌ను ఇది చాలా లోతుగా చూపిస్తుందీ మూవీ. ముబి (MUBI) ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.

ద స్పై (The Spy)

రియల్ లైఫ్ మొసాద్ ఏజెంట్ ఎలీ కోహెన్ స్టోరీ ఆధారంగా ఈ నెట్‌ఫ్లిక్స్ మినీ సిరీస్ తెరకెక్కింది. 1960ల టైమ్‌లో సిరియాలో అతను చేసిన అండర్‌కవర్ మిషన్ గురించి ఇందులో చూపించారు. సాచా బారన్ కోహెన్ ఈ స్పై రోల్‌లో అద్భుతంగా నటించాడు. ఆ దేశపు పొలిటికల్ లీడర్ల మధ్యలోకి సీక్రెట్‌గా వెళ్లి, అక్కడి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్‌ను ఇజ్రాయెల్‌కు పంపిస్తుంటాడు. దశాబ్దాల క్రితం జరిగిన కథే అయినా ఆ రీజియన్ జియోపాలిటిక్స్‌కు కారణమైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్‌ను ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫౌదా (Fauda)

ఈ ఇజ్రాయెలీ డ్రామా డోరోన్ అనే ఒక ఇజ్రాయెల్ సోల్జర్ చుట్టూ తిరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత తాను చంపేశానని అనుకున్న ఒక డెడ్లీ టెర్రరిస్ట్‌ను పట్టుకోవడానికి మళ్లీ అండర్‌కవర్‌గా ఫీల్డ్‌లోకి దిగుతాడు. ఇది ముఖ్యంగా ఇజ్రాయెల్-పాలస్తీనా టెన్షన్స్ మీద ఫోకస్ చేసినా.. మిడిల్ ఈస్ట్‌లో సెక్యూరిటీ సిట్యువేషన్స్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయో పర్ఫెక్ట్‌గా చూపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లోనే ఇది అందుబాటులో ఉంది.

ద రెడ్ సీ డైవింగ్ రిసార్ట్ (The Red Sea Diving Resort)

క్రిస్ ఇవాన్స్ హీరోగా నటించిన ఈ హిస్టారికల్ థ్రిల్లర్.. 1980ల ప్రారంభంలో సూడాన్ నుంచి ఇథియోపియన్ జ్యూయిష్ రిఫ్యూజీలను కాపాడటానికి మొసాద్ చేసిన ఒక రియల్ మిషన్ గురించి చెప్తుంది. వేలాది మంది జనాలను సీక్రెట్‌గా అక్కడి నుంచి తరలించడానికి ఏజెంట్స్ ఒక ఫేక్ టూరిస్ట్ రిసార్ట్‌ను సెటప్ చేస్తారు. ఫారిన్ కంట్రీస్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చేసే కోవర్ట్ ఆపరేషన్స్, అందులో ఉండే లాజిస్టికల్ రిస్క్‌లను ఈ సినిమా హైలైట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More