OTT Review: సినిమా ఇండస్ట్రీ చీకటి నిజాలు.. సైకోలా మారిపోయే హీరో.. ఓటీటీలోని ఈ మలయాళం డార్క్ కామెడీ ఎందుకు చూడాలంటే?
OTT Review: ఓటీటీలోకి ఈరోజే అడుగుపెట్టిన మాలీవుడ్ టైమ్స్ మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ డార్క్ కామెడీ మూవీ సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను చూపిస్తూ.. డైరెక్టర్ కావాల్సిన ఓ యువకుడు ఎలా సైకోలా మారాడన్నది ఇందులో చూడొచ్చు.
OTT Review: సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు.. దాని వెనుక కళ్లు చెదిరే చీకటి నిజాలు ఎన్నో ఉన్నాయి. టాలెంట్ ఒక్కటే ఉంటే ఛాన్సులు క్యూ కడతాయి అనుకోవడం పక్కా భ్రమ అని తేల్చి చెబుతున్న మూవీ 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times).

యంగ్ సెన్సేషన్ నస్లెన్ కె. గఫూర్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని దారుణమైన పాలిటిక్స్ ను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
డైరెక్టర్ కావాలనుకునే యువకుడి కథ
దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ ఈ మాలీవుడ్ టైమ్స్ సినిమాను తెరకెక్కించాడు. ఈ మలయాళ సినిమా అసలు సక్సెస్ వెనుక ఉన్న మాయను ధైర్యంగా బయటపెడుతుంది.
ఒక మాస్టర్ పీస్ సినిమా తీయాలని ప్రాణాలు పెట్టే ఒక అప్ కమింగ్ డైరెక్టర్ పడే కష్టాల చుట్టూ ఈ కథ సాగుతుంది. వినీత్ మాధవన్ అనే ఆ కష్టాలు పడే కుర్రాడిగా నస్లెన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
సినిమా పిచ్చిలో సైకోలా మారి..
ఈ మాలీవుడ్ టైమ్స్ ఓ ఇన్స్‌పిరేషనల్ సక్సెస్ స్టోరీ అస్సలు కాదు. గ్లామర్ ఫీల్డ్ వెనుక ఉన్న పాలిటిక్స్, అక్కడ బతికి బట్టకట్టాలంటే ఉండాల్సిన అదృష్టాన్ని డైరెక్టర్ చాలా బోల్డ్‌గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. సినిమా పిచ్చిలో పడి ఆ కుర్రాడు తన ఎథిక్స్, జాలి, మానవత్వం లాంటివి గాలికి వదిలేసి ఎలా ఒక రకమైన సైకోలా మారాడనేది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది.
సొర చేపలతో పోరాడాల్సిందే..
‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత అభినవ్ సుందర్ నాయక్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో దీనిపై ముందే మంచి హైప్ క్రియేట్ అయింది. అతను తీసుకున్న పాయింట్ ఎంత రా అండ్ రస్టిక్ గా ఉంటుందో స్క్రీన్ ప్లే కూడా అంతకంటే గ్రిప్పింగ్ గా సాగుతుంది. సినిమా అంటేనే ఒక షార్క్ ట్యాంక్ లాంటిది. అందులో బతకాలంటే సొరచేపలతో కొట్లాడాల్సిందే అని ఈ మూవీ డైరెక్ట్ గా చెబుతుంది.
ఈ క్రమంలో వచ్చే డార్క్ హ్యూమర్, కామెడీ ట్విస్టులు ఆడియన్స్‌ను ఎక్కడా బోర్ కొట్టించకుండా కట్టిపడేస్తాయి. సక్సెస్ అనే భ్రమ చుట్టూ తిరిగే ఈ కథలో స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ బేసిల్ జోసెఫ్ క్యామియో రోల్ సినిమాకు ముఖ్యమైన హైలైట్ గా నిలుస్తుంది. ఫ్యాన్స్ కు ఇదొక బిగ్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు.
సినిమా తీయడం ఓ సాహసమే
చాలా సినిమాల్లో కష్టపడితే సక్సెస్ వస్తుందని ఈజీగా చూపిస్తారు. కానీ రియాలిటీలో టాలెంట్ ఒక్కటే పనికిరాదు. అందులో ఉండే పాలిటిక్స్, బడ్జెట్ పరిమితులు, ప్రొడ్యూసర్ల ఈగోలు.. ఇవన్నీ దాటుకుని ఇండస్ట్రీలో ఒక సినిమాను బతికించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ లోతుగా దిగి ఉన్న సమస్యలను డార్క్ కామెడీ యాంగిల్‌లో ప్రెజెంట్ చేసిన విధానం ఓ అద్భతమనే చెప్పాలి.
నస్లెన్ సూపర్ యాక్షన్
'ప్రేమలు' మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో యూత్ కు కనెక్ట్ అయిన నస్లెన్.. తన లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కనపెట్టి ఇందులో చేసిన వినీత్ మాధవన్ క్యారెక్టర్ చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. నాచురల్ యాక్టింగ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన నస్లెన్ ఈ క్యారెక్టర్ లో జీవించేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీ మూడ్ కు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి.
ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జియోహాట్‌స్టార్, సింప్లీ సౌత్ యాప్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా కొంచెం డార్క్ అండ్ హార్డ్ హిట్టింగ్ రియాలిటీ డ్రామాలు ఇష్టపడేవాళ్లు ఈ వీకెండ్ కు కచ్చితంగా ఈ సినిమాను వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


