Malayalam OTT: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి వారం వైవిధ్యమైన జానర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ వారం డిజిటల్ వేదికలపై మలయాళం నుంచి పలు క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ డ్రామాలు, మానవీయ విలువలతో కూడిన కథలు ఇష్టపడే ఆడియన్స్కు ఈ వారం పర్ఫెక్ట్ బింజ్ వాచ్ లైనప్ రెడీ అయింది. డిజిటల్ స్క్రీన్లపై అలరించబోతున్న ఈ చిత్రాల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
రెండు రోజుల్లో 5 క్రేజీ మలయాళం ప్రాజెక్టులు
ఓటీటీ ప్లాట్ఫామ్స్ : మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్, జియోహాట్స్టార్, జీ5, సన్ నెక్ట్స్
ముఖ్యమైన రిలీజెస్ : ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్, కప్పి స్క్వాడ్, ఆశ, ఒరు అన్వేషిణతింటే తుడక్కమ్
జానర్లు : సూపర్ నేచురల్ థ్రిల్లర్, క్రైమ్ డ్రామా, మిస్టరీ థ్రిల్లర్
భాషలు : మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ
ఏ మూవీ, వెబ్ సిరీస్ ఎక్కడ చూడాలంటే?
ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ : మనోరమ మ్యాక్స్ (అక్టోబర్ 15)
కప్పి స్క్వాడ్ : జియోహాట్స్టార్ (అక్టోబర్ 15)
ఆశా మూవీ: జీ5 ఓటీటీ (అక్టోబర్ 16)
ఒరు అన్వేషణతింటే తుడక్కమ్: సన్ నెక్ట్స్ (అక్టోబర్ 16)
ఆదినాశం వేళ్లపొక్కం: సైనాప్లే (అక్టోబర్ 16)
క్రేజీ కంటెంట్.. థ్రిల్లర్, కామెడీ, సూపర్ నేచురల్
1. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ (It's a Medical Miracle): సంగీత్ ప్రతాప్, షరాఫ్ ఉద్దీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సూపర్ నేచురల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇప్పటికే మనోరమా మాక్స్ (ManoramaMax), సింప్లీ సౌత్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కోమా నుంచి వింత శక్తులతో బయటపడిన యువకుడి కథ ఇది.
{{/usCountry}}1. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ (It's a Medical Miracle): సంగీత్ ప్రతాప్, షరాఫ్ ఉద్దీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సూపర్ నేచురల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇప్పటికే మనోరమా మాక్స్ (ManoramaMax), సింప్లీ సౌత్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కోమా నుంచి వింత శక్తులతో బయటపడిన యువకుడి కథ ఇది.
{{/usCountry}}కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని వినికిడి శక్తి విపరీతంగా పెరిగిపోవడం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నది చూడొచ్చు. ప్రస్తుతం కేవలం మలయాళం ఆడియోతోనే ఉన్నా త్వరలో తెలుగులోనూ వచ్చే వీలుంది.
2. కప్పి స్క్వాడ్ (Kappi Squad): డిటెక్టివ్, క్రైమ్ జానర్ను ఇష్టపడే వారి కోసం జియోహాట్స్టార్ (JioHotstar) వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో వీక్లీ సిరీస్గా ఇది అందుబాటులోకి వచ్చింది.
3. ఆశా (Aasha): సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో గురువారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee5) లో ప్రీమియర్ కానుంది.
4. ఒరు అన్వేషణతింటే తుడక్కమ్ (Oru Anweshanathinte Thudakkam): మిస్టరీ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం సన్ నెక్స్ట్ (SunNxt) వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది.
5. ఆదినాశం వెళ్లప్పోక్కం (Adinaasham Vellapokkam): సైనా ప్లే (SainaPlay) ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మలయాళ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. మలయాళ చిత్రాల మేకింగ్ స్టైల్, రియలిస్టిక్ అప్రోచ్ నచ్చే ప్రేక్షకులకు ఈ వీకెండ్ ఓటీటీ లైనప్ చక్కటి వినోదాన్ని పంచుతుంది.