OTT Movie: హేళన చేసిన వాళ్లే చప్పట్లు కొట్టేలా.. ఓటీటీలోకి సినిమాగా ఇండియా తొలి మహిళా సుమో రెజ్లర్ స్టోరీ.. ఇక్కడ చూడండి
OTT Movie: ఓటీటీలోకి మరో స్ఫూర్తిదాయక బయోపిక్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. దేశంలో తొలి మహిళా సుమో రెజ్లర్ గా ఎదిగిన హేతల్ దవే జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఇప్పుడు నేరుగా డిజిటల్ తెరపైనే స్ట్రీమింగ్ కానుంది.
OTT Movie: మహిళల అందం, శరీర ఆకృతి, బలం గురించి సమాజం నిర్ణయించిన మూస ధోరణులను బద్దలు కొడుతూ, తన శరీరాన్నే అతిపెద్ద శక్తిగా మార్చుకున్న ఒక అసాధారణ భారతీయ మహిళ కథ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వస్తోంది. దేశంలో తొలి ప్రొఫెషనల్ ఫిమేల్ సుమో రెజ్లర్ హేతల్ దవే (Hetal Dave) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ బయోపిక్ 'సుమో దీదీ' (Sumo Didi).

జియో స్టూడియోస్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్, MA+TH ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 హిందీ (ZEE5) తాజాగా విడుదల చేసింది.
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సుమో దీదీ ట్రైలర్
దర్శకుడు జయంత్ రోహత్గి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ నటి శ్రియం భగ్నాని (Shriyam Bhagnani) టైటిల్ రోల్ పోషించగా, చైతన్య శర్మ మరో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. అక్టోబర్ 23, 2026 నుంచి ఈ మూవీ జీ5 ప్లాట్‌ఫామ్ లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
సాంప్రదాయ మార్వాడీ కుటుంబంలో జన్మించిన ఒక సాధారణ అమ్మాయి, సమాజం విధించిన ఆంక్షలను ధిక్కరించి అంతర్జాతీయ స్థాయిలో సుమో రెజ్లర్‌గా ఎలా ఎదిగిందనే కాన్సెప్ట్‌తో ఈ ట్రైలర్ కట్ చేశారు. బాడీ షేమింగ్, లింగ వివక్ష, సామాజిక ఒత్తిళ్లను తట్టుకుంటూ హేతల్ దవే చేసిన పోరాటం ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుంది. కోల్‌కతాలోని ఇరుకు సందుల నుంచి జపాన్‌లోని ప్రశాంతమైన విలేజ్ లొకేషన్ల వరకు రియలిస్టిక్ లొకేషన్లలో చిత్రీకరించిన సీన్స్ సినిమా రేంజ్‌ను పెంచేశాయి.
ఇప్పటికే టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఈ చిత్రం పలు ప్రశంసలు అందుకుంది. జ్యోతి దేశ్‌పాండే, ఆకాష్ చావ్లా, అరుణవ సేన్‌గుప్తా, అమిత్ చంద్ర వంటి ప్రముఖ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా నిర్మించారు.
శ్రియం భగ్నాని మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్
హేతల్ దవే పాత్రలో నటించడానికి శ్రియం భగ్నాని ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎంతో కష్టపడింది. ఒక సుమో రెజ్లర్ బాడీ లాంగ్వేజ్‌ను, బరువు పెరిగే క్రమంలో వచ్చే ఎమోషనల్ స్ట్రగుల్‌ను ఆమె స్క్రీన్‌పై జీవించేసింది. చైతన్య శర్మ, అనుభా ఫతేపురియా, నితీష్ పాండే, రాఘవ్ ధీర్, మీనల్ కపూర్ తమ నటనతో కథకు ప్రాణం పోశారు.
కేవలం సుమో రెజ్లింగ్ క్రీడ మాత్రమే కాకుండా.. ఒక మహిళ తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉందని, తనపై తనకు ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకీ తనను ఆపలేదని చాటిచెప్పే కథ ఇది అని మేకర్స్ స్పష్టం చేశారు. అక్టోబర్ 23 నుంచి జీ5లో రాబోతున్న ఈ స్ఫూర్తిదాయక బయోపిక్ ఓటీటీ ఆడియన్స్‌ను కచ్చితంగా స్ఫూర్తి నింపుతుంది అనడంలో సందేహం లేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


