OTT Horror: ఓటీటీలోకి శ్రద్ధా దాస్ లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం బ్యాక్‌డ్రాప్‌లో..

OTT Horror: ఓటీటీలోకి శ్రద్ధా దాస్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో రేపటి నుంచే అంటే జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jul 8, 2026, 20:59:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror: ఓటీటీలోకి ఈవారం అనుకోకుండా వస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ త్రికాల. ప్రముఖ నటి శ్రద్ధా దాస్ నటించిన ఈ సినిమా మే 28న థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు 40 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. సన్ నెక్ట్స్ ఓటీటీ గురువారం (జులై 9) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

OTT Horror: ఓటీటీలోకి శ్రద్ధా దాస్ లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం బ్యాక్‌డ్రాప్‌లో..
OTT Horror: ఓటీటీలోకి శ్రద్ధా దాస్ లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం బ్యాక్‌డ్రాప్‌లో..

ప్రతి క్షణం కొత్త రహస్యం

త్రికాల స్ట్రీమింగ్ విషయాన్ని ఓ చిన్న వీడియో ద్వారా సన్ నెక్ట్స్ ఓటీటీ వెల్లడించింది. “ప్రతి క్షణం ఓ కొత్త రహస్యం వెలుగు చూస్తుంది. త్రికాల కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? త్రికాల: ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీని రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో సినిమా డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని రివీల్ చేసింది.

ఓ సైకియాట్రిస్ట్ గా తాను చూసిన టిపికల్ కేసు ఇది అని శ్రద్ధా దాస్ చెప్పే డైలాగుతో ఈ వీడియో మొదలైంది. తర్వాత అమ్మావారికి కట్టిన ముడుపుల్లో నుంచి రక్తం రావడం, ఆ కోరికలు కోరిన వాళ్లు చనిపోవడంలాంటివి చూపిస్తారు. ఇదంతా మూవీపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతాయి.

త్రికాల మూవీ స్టోరీ ఏంటంటే?

త్రికాల: ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీ మే 28న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ఓ సైకియాట్రిస్ట్ పాత్రలో నటించింది. ఈ సినిమాకు డైరెక్టర్ మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. హీరో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవాంచ, నంద దొరై, రోబో శంకర్, రౌడీ రోహిణి (జబర్దస్త్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఈ సస్పెన్స్ డ్రామా కథ అంతా కుమారి ఖండం అనే పౌరాణిక ప్రదేశం బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. ప్రాచీన కాలంలో ఋషులు దాచిపెట్టిన రహస్య గ్రంథాలు, చీకటి శక్తుల చుట్టూ ఈ స్టోరీని డిజైన్ చేశారు. కలియుగంలో మళ్లీ రాక్షస శక్తులు పుట్టుకొచ్చినప్పుడు, దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం ఆ చీకటి శక్తులను అంతం చేయడానికి హీరో ఎలా పోరాడాడు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, క్షుద్ర పూజలు లాంటి ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కు వెన్నులో వణుకు పుట్టించడం గ్యారెంటీ.

త్రికాల మూవీ హైలైట్స్

ఈ సినిమాకు ప్రధాన బలం దీని విలక్షణమైన కాన్సెప్ట్. కర్మ సిద్ధాంతాన్ని కేవలం మాటల్లో చెప్పకుండా పాత్రల పునర్జన్మలు, వారి మానసిక సంఘర్షణల ద్వారా దర్శకుడు చూపించిన తీరు అద్భుతంగా ఉంది. వైతరణ్ పాత్రలో నటుడు అజయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సూర్యకాంతిని చూడలేని ఒక మనిషిలోని భయం, అంతర్మథనాన్ని ఆయన కళ్లలోనే పలికించారు.

ఆయన కోసం డిజైన్ చేసిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇక హీరోగా మాస్టర్ మహేంద్రన్ అమాయకత్వం, ప్రేమ, భయం వంటి నవరసాలను చాలా సహజంగా పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన హృదయాలను కదిలిస్తుంది.

సైకియాట్రిస్ట్ మాయ పాత్రలో శ్రద్ధా దాస్ గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఒదిగిపోయారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక ప్రత్యేకమైన డార్క్ టోన్‌ను తీసుకొచ్చింది. సీనియర్ హీరోయిన్ ఆమని తల్లిగా, భయంతో కూడిన భావోద్వేగాలను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయి ఉంటే గురువారం (జులై 9) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More