OTT Weekend: ఈ వీకెండ్ హోమ్ థియేటర్లలో వినోదాల జాతర షురూ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త సినిమాలతో రెడీ అయ్యాయి. సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు' దెబ్బకు కడుపుబ్బా నవ్వాల్సిందే.

దీంతోపాటు తెలుగులోనే ఇసకపట్నం రూపంలో మరో క్రైమ్ థ్రిల్లర్ రెడీగా ఉండగా.. మలయాళంలోనూ చాలానే థ్రిల్లర్, కామెడీ జానర్లలో సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.
సూపర్ సుబ్బు (Super Subbu) : నెట్‌ఫ్లిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నెట్‌ఫ్లిక్స్ లోకి సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ తో వచ్చేశాడు. జులై 2 నుంచే స్ట్రీమింగ్ మొదలైంది. ఒక సాంప్రదాయబద్ధంగా ఉండే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా వెళ్లిన ఒక కుర్రాడి కథ ఇది. నవ్వులు గ్యారెంటీ. మిథిలా పాల్కర్, మురళీ శర్మ కూడా ఇరగదీశారు.
ఇసకపట్నం (Isakapatnam): ప్రైమ్ వీడియో
ప్రైమ్ వీడియోలోకి ఈ వారం వచ్చిన తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. 1990లలో ఒక పోర్ట్ టౌన్ లో జరిగే పవర్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంది. భయంకరమైన డాన్ నాయుడు సామ్రాజ్యాన్ని కూల్చడానికి అతని కూతురు, ఒక లోకల్ కుర్రాడు, పోలీస్ సిస్టమ్ ఎలా ఒక్కటయ్యారు అనేది కట్టిపడేస్తుంది. ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, సునీల్ యాక్టింగ్ హైలైట్.
గుర్తుకొస్తున్నాయి (Gurthukosthunnayi): ఈటీవీ విన్
ఈటీవీ విన్‌లోకి శుక్రవారం (జులై 3) అడుగుపెట్టిన తెలుగు ఫీల్ గుడ్ లవ్ డ్రామా ఈ వెబ్ సిరీస్. పెళ్లికి ముందు మెమొరీ లాస్ అయిన సంతోష్ స్టోరీ ఇది. స్కూల్ డేస్, ఫస్ట్ లవ్ మెమొరీస్ తో అతని ఫ్రెండ్స్ గతం గుర్తు చేసే జర్నీ భలే నోస్టాల్జిక్ ఫీల్ ఇస్తుంది. రోహిణి హట్టంగడి, గోపరాజు రమణల స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది.
హాంగ్‌మ్యాన్ (Hangman): సన్ నెక్ట్స్
సన్ నెక్ట్స్ లోకి వచ్చిన ఎమోషనల్ తెలుగు డ్రామా మూవీ హ్యాంగ్మ్యాన్. అవినీతి వ్యవస్థతో విసిగిపోయిన ఒక జైలు తలారి కథ. తన కొడుకుకే ఉరిశిక్ష పడే టైమ్ వస్తే అతను కోర్టులను వదిలేసి తనే జడ్జిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. బ్రహ్మాజీ కెరీర్ లో ఇదొక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.
ప్రీతమ్ అండ్ పెడ్రో (Pritam and Pedro): జియోహాట్‌స్టార్
{{/usCountry}}సన్ నెక్ట్స్ లోకి వచ్చిన ఎమోషనల్ తెలుగు డ్రామా మూవీ హ్యాంగ్మ్యాన్. అవినీతి వ్యవస్థతో విసిగిపోయిన ఒక జైలు తలారి కథ. తన కొడుకుకే ఉరిశిక్ష పడే టైమ్ వస్తే అతను కోర్టులను వదిలేసి తనే జడ్జిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. బ్రహ్మాజీ కెరీర్ లో ఇదొక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.
ప్రీతమ్ అండ్ పెడ్రో (Pritam and Pedro): జియోహాట్‌స్టార్
{{/usCountry}}జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టిన హిందీ మిస్టరీ క్రైమ్ డ్రామా ఈ వెబ్ సిరీస్. విక్రాంత్ మాస్సే, అర్షద్ వార్సి నటించారు. టెక్నాలజీ తెలియని పోలీస్, ఒక జీనియస్ హ్యాకర్ కలిసి 15 నిమిషాల్లో జరిగిన ఏటీఎం దొంగతనాన్ని పరిష్కరించడంతోపాటు గోవాలో సైబర్ క్రైమ్స్ ఎలా ఆపారు అనేది రాజ్ కుమార్ హిరానీ స్టైల్ లో హిలేరియస్ గా ఉంటుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
కరుక్కం (Karakkam): సోనీలివ్
సోనీలివ్‌లోకి వచ్చిన మలయాళ హారర్ మూవీ ఇది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీనాథ్ భాసి నటించాడు. ఇద్దరు తాగుబోతు ఫ్రెండ్స్ ప్రాంక్ చేస్తూ శ్మశానంలో ఐదు దెయ్యాలను నిద్ర లేపుతారు. ఆ దెయ్యాలు వాళ్ల ఇంటికి వస్తే ఆ అయోమయం, భయం భలే ఫన్ క్రియేట్ చేస్తాయి.
మాలీవుడ్ టైమ్స్ (Mollywood Times): జియోహాట్‌స్టార్
జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన మరో మలయాళ కామెడీ డ్రామా ఈ మాలీవుడ్ టైమ్స్. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హారర్ సినిమా తీయాలని ఒక యంగ్ డైరెక్టర్ పిచ్చి ఆరాటం వల్ల ప్రాజెక్ట్ మొత్తం ఎలా నాశనం అయింది అనేది సెటైరికల్ గా చూపించారు. నస్లెన్ గఫూర్ యాక్టింగ్ సూపర్ అని ప్రేక్షకుల నుంచి రివ్యూలు వచ్చాయి.
ముత్తస్సి (Muthassi): జీ5 ఓటీటీ
జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన మలయాళ హారర్ డ్రామా ఇది. మంత్రాలు చేసే అత్తగారి ఇంటికి కోడలిగా వెళ్లిన లీల స్టోరీ. ఆమె కొడుకు దెయ్యంగా మారుతుంటే ఒక తల్లిగా ఆమె ఎదుర్కొన్న టెన్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కేపీఏసీ లీల లీడ్ రోల్ చేశారు.